4 వ "నిస్సాన్ తో హ్యాపీ" అనే సేవ క్యాంప్ నిర్వహిస్తున్న నిస్సాన్ సంస్థ
నవంబర్ 20, 2015 02:51 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: నిస్సాన్ ఇండియా తన కార్లకు దేశవ్యాప్తంగా ఉచిత చెక్-అప్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ 4వ, 'హ్యాపీ విత్ నిస్సాన్' 2015 సంవత్సరం నవంబర్ 19 నుండి 28 వరకూ భారతదేశం అంతటా 140 స్థానాల్లో 120 నగరాలకు విస్తరించి 60 పాయింట్ల సమగ్ర కారు చెకప్ అందిస్తుంది. ఇది కాకుండా,అధనంగా ఉచిత వాషింగ్ కూడా అందించబడుతుంది మరియు వినియోగదారులు కార్మిక చార్జీలు మరియు నిస్సాన్ యొక్క యాక్సిసరీస్ లో డిస్కౌంట్ పొందగలరు. 20% డిస్కౌంట్ ముందు చెప్పిన ఆరోపణలు / ఉపకరణాల కొరకు అందించబడుతుంది.
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెవేట్. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ "నిస్సాన్ వద్ద మేము పెరుగుతున్న SSI స్కోర్లు ద్వారా ప్రోత్సాహించబడుతున్నాము మరియు మా ఉత్పత్తులను కొనుగోలు చేసిన తర్వాత కూడా మా వినియోగదారులకు ఒక సరిపోలని అనుభవాన్ని అందించాలని యోచిస్తున్నాము. మేము ఆ ఆశయాన్ని చేరుకొనేందుకు గానూ 'హ్యాపీ విత్ నిస్సాన్ ' మాకు గొప్ప అవకాశం ఇస్తుంది. ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులను చేరుకొని సమర్థవంతంగా పరిష్కారాలను ఇవ్వడం." అని తెలిపారు.
10 రోజుల పాటు శిబిరాన్ని మరింత ఉత్తేజపరచడానికి, నిస్సాన్ సంస్థ వినియోగదారులు నిస్సాన్ అసలైన యాక్సెసరీస్, కారు సంరక్షణ ఉత్పత్తులు మరియు సినిమా టిక్కెట్లు మరియు రెస్టారెంట్ల వోచర్లు మాత్రమే కాకుండా ఉచితం వాషింగ్ కూపన్లు గెలుచుకోవచ్చని ప్రకటించింది.