• English
  • Login / Register

మైక్రా ఎక్స్ ఎల్ సివిటి ను మరియు ఎక్స్-షిఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ ను ఇటీవల ప్రవేశపెట్టిన నిస్సాన్ ఇండియా

జూలై 07, 2015 04:45 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: నిస్సాన్ ఇండియా మైక్రా ఎక్స్ -షిఫ్ట్ తో పాటూ మైక్రా ఎక్స్ ఎల్ సివిటి ని విడుదల చేసిన కారణంగా దాని హాచ్బాక్ మైక్రా విభాగంలో ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ ఎక్స్ ఎల్ సివిటి అత్యుత్తమ లక్షణాలను కలిగి 6.34 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ యొక్క నిర్దేశాలు మరియు లక్షణాలు ప్రస్తుతం ఉన్న ఎక్స్ ఎల్ లానే ఉంటాయి. దీనిలో చిన్న మార్పు ఏమిటంటే మాన్యువల్ గేర్బాక్స్ బదులుగా సివిటి ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది.

ఈ లిమిటెద్ ఎడిషన్ మైక్రా ఎక్స్-షిఫ్ట్ వాహనాన్ని కేవలం 750 యూనిట్ల పరిమిత ఉత్పత్తి ను మాత్రమే కలిగి ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ప్రాథమికంగా కొన్ని కాస్మెటిక్ మార్పులతో వచ్చాయి. ఆ మార్పులు ఏమిటంటే, మాట్టే బ్లాక్ రెప్పెడ్ రూఫ్, క్రోమ్ ఫినిష్ ఎగ్సాస్ట్ పైపు, బ్లాక్ సైడ్ డెకాల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఎల్ ఇడి స్కఫ్ ప్లేట్స్ మరియు నిస్సాన్ సన్నీ లో ఉండే స్టీరింగ్ వీల్ తో వచ్చింది. అంతేకాకుండా, ఈ స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలతో ఇటీవల విడుదలయ్యింది.

ఎక్స్ ఎల్ సివిటి విషయానికి వస్తే, ఆటోమేటిక్ గేర్బాక్స్ గతంలో ఎక్స్ వి పెట్రోల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ బేస్ వేరియంట్లో సివిటి గేర్బాక్స్ అందుబాటులోనికి వచ్చాక వాహన తయారీదారుడు దేశంలో ఆటోమేటిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ఎక్స్ వి వేరియంట్ సివిటి గేర్బాక్స్ తో రూ. 7.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఎక్స్ ఎల్ సివిటి దిగువ శ్రేణి వేరియంట్ కంటే రూ. 71,000 ఎక్కువ.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience