నేషనల్ ఫైనల్లో ఆరుగురు వి జేతలను నిశ్చయించిన నిస్సాన్ జిటి అకాడమీ
జూలై 02, 2015 01:36 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై:
భారతదేశంలో చెన్నై ఎంఎంఎస్సి రేస్ ట్రాక్ వద్ద , జిటి అకాడమీలో జరుగుతున్న నేషనల్ ఫైనల్స్ కి, నిస్సాన్ టాప్ 20 క్వాలిఫైయిర్ల్లలో నుండి ఆరుగురిని విజేతలుగా నిశ్చయించింది. ఈ ఆరుగురు విజేతలు ఇప్పుడు సిల్వర్ స్టోన్, యుకె లో జరుగుతున్న అల్టిమేట్ రేసింగ్ చాంపియన్ షిప్ లో అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్కడ వారికి జిటి అకాడమీ ఆసియా ఛాంపియన్ షిప్ లో జపాన్, థాయిలాండ్, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన ఇతర ఫైనలిస్టులతో పోటీ ఉంటుంది. ఒక విజేత మాత్రం దుబాయ్ 24 గంటల ఈవెంట్ వద్ద నిస్సాన్ డ్రైవర్ కోసం పోటీ పడుతున్న అభివృద్ధి కార్యక్రమం కోసం వెళ్లవలసి వస్తుంది.
విజేతల పేర్లు-
అభిషేక్ ద్వారక్ నాథ్
అనుష్ చక్రవర్తి
అష్కయ్ గుప్తా
ధృవ్ దయాళ్
జైదీప్ చహల్
శాంతాను కల్లియన్ పుకర్
భారతదేశం లో జరిగిన జిటి అకాడమీ విజయోత్సవ సంబరాలలో నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ అధ్యక్షుడు గ్విలామ్సికర్డ్ మాట్లాడుతూ" మోటారుస్పోర్ట్స్ వైపు దేశంలో ప్రజలకు పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. కేవలం ఒక నెల సమయంలో జిటి అకాడమీ 2015 లో పోటీలో 10,000 మంది పాల్గొనడం మా సంస్థను అగ్రస్థానానికి చేర్చుతుందని ఆశిస్తున్నాము" అని ఆయన వాఖ్యానించారు.
"మేము భారతదేశం లో మోటారుస్పోర్ట్స్ ప్రజాస్వామికం లక్ష్యంగా ఏర్పాటు చేశాము మరియు రేస్ ట్రాక్ వద్ద నేడు ఫైనలిస్టుల అనుభవం చూసాక మాకుచాలా గర్వంగా ఉంది. మా ఆరుగురు విజేతలు ఇప్పుడు సిల్వర్ స్టోన్ వద్ద జరిగే ఒక అంతర్జాతీయ పోటీలో పాల్గొనడం కోసం సిద్ధంగా ఉన్నారు మరియు ఒకవేళ మేము వారి ఆకాంక్షలు నెరవేర్చినట్లయితే వారి జీవితాలలో ఒక వెలుగును తీసుకు రావడానికి అవకాశం ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
జాతీయ ఫైనల్స్ లో విజేతలను ప్రకటించేటప్పుడు, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, జిటి అకాడమీ ఏకైక అవకాశాలు అందించడం ద్వారా నిస్సాన్ కలలు నెరవేరడానికి కారణమని మరియు నిస్సాన్ యొక్క ప్రజల నిబద్ధత మార్క్స్" అని అన్నారు. ఈ ఔత్సాహిక రేసర్లు మరియు గేమర్స్ అవకాశాల్ని కల్పించడం వలన, మాకు చాలా ప్రయోజనకరం అని చెప్పారు. ఎందుకంటే, ఇప్పుడు తమ కలలన్నీ దీని ద్వారా నిజం చేసుకున్నారు.
ఈ ఆరుగురు విజేతలు, టీమ్ ఇండియా మెంటర్ అయిన కరుణ్ చాందోక్ వద్ద ఒక రోజు గడపబోతున్నారు. ఎందుకంటే, జరగబోయే సిల్వర్స్టోన్ రేస్ క్యాంప్ కోసం సిద్ధం అవ్వడానికి అతని దగ్గర ఉండబోతున్నారు.
ఈ ఈవెంట్ యొక్క న్యాయ నిర్ణేతలలో ఒకరైన కరుణ్ మాట్లాడుతూ " నేను ఎప్పుడూ జూనియర్ రేసర్లకు సహాయం అందించేందుకు డ్రైవర్ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉంటాను. జిటి అకాడమీ, మోటారుస్పోర్ట్స్ తో ఆరంభించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉండే చోటు, ముఖ్యంగా మీకు అవసరమైన అండ లేనటువంటి వారు అయితే మీకు అన్ని విధాలుగా సహాయకంగా ఉంటుంది. నా తదుపరి కర్తవ్యం ఏమిటనగా ఇప్పుడు దేశ స్థాయిలో ఆరుగురు విజేతలను తీసుకొచ్చినట్లుగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఆరుగురు విజేతలను తయారు చేయడం నా లక్ష్యం" అని ఆయన ప్రసంగించారు.