భారత ఆటో ఎక్స్పో 2016 లో నిస్సాన్
ఫిబ్రవరి 01, 2016 04:12 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిస్సాన్ వారు ఈ సంవత్సరపు 2016 ఆటో షోలో ఒక మంచి ప్రదర్శనను, కాదు నిజానికి ఒక గంభీరమైన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ఆటో ఎక్స్పో ప్రాగణంలోని వారి యొక్క జిటి-ఆర్ వాహనాన్ని చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. దీనిని చాలా మంది గాడ్జిలా అని వ్యవహరిస్తున్నారు. దీనితొర్ పాటూ నిస్సాన్ యొక్క కొత్త X-ట్రెయిల్ మరియు నిస్సన్ పాట్రోల్ వాహనన్ని కూడా ప్రదర్శనకు ఉంచారు. భారతదేశంలో ప్రస్తుతం నిస్సాన్ వారి గట్టి పోటీ ని ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే, ఇందుకు నిస్సన్ వారు తమ యొక్క కొత్త ఉత్పాదక శ్రేణి తోటి ముందుకు రాబోతున్నారు. ఏదిఏమైనప్పటికీ జిటి-ఆర్ దేశీయంగా నిస్సాన్ యొక్క పేరుని కొనుగోలుదార్లలో మరియు ఔత్సాహికులలో పెంచేదిగా ఉండోతోంది అని అంచనా. నిస్సాన్ వరు నొయిడాలో ప్రదర్శిస్తున్న ఈ వాహనం యొక్క కొన్ని విశేషాలు మీకోసం.
జిటి-ఆర్
ఈ గాడ్జిలా ఔత్సాహికులను అద్భుతంగా తన యొక్క సామర్ధ్యంతో ఆసక్తి పరచబోతోంది. ఒక 3.8 లీటర్ V6 ఇంజిన్ కలిగి దాదాపుగా 545Bhp శక్తిని ఈ వాహనం ఉత్పత్తిని చేయగలుగుతుంది. వాహనం యొక్క పవర్ప్లాంట్ 6-స్పీడ్ ఆటోమెటిక్ సామర్ధ్యాన్ని త్వరితమైన ఆల్ వీల్ డ్రైవ్ సిష్టంతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క సామర్ధ్యం విషయం అటు ఉంచితే, జిటి-ఆర్ ఒక అద్భుతమైన బాహ్య రూపురేఖలు కలిగి ఉంటుంది. తొలిసారి దీనిని ప్రదర్శించినప్పుడు ఈ వాహనం యొక్క ధర 2 కోట్ల మార్క్ ను చేరుకుంటుందని ఆశించడం జరిగింది. ఈ 2-డోర్ సూపర్ కార్ సెడాన్ వాహనం రూపు రేఖలతో 4 ప్రయాణికుల సీటింగ్ సామర్ధ్యం కలిగి సౌకర్యవంతమైన లగేజ్ స్థలం ని కూడా కలిగి ఉంటుంది.
X-ట్రెయిల్
నిస్సన్ వారు 2014 లో తమ యొక్క X-ట్రెయిల్ వాహనాన్ని తగ్గిన అమ్మకాల దృష్ట్యా నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాహన ప్రియులకు మరియు ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు ఉత్తేజపరిచేందుకు మళ్ళా ప్రవేశపెడుతున్నారు. ఈ 5 సీటర్ ఎస్యువి వాహనం 24 లక్షల ఖరీదు కలిగి సిబియు మార్గాన్ని పట్టనుంది. అందుచేత ఖరీదు పెంపు చోటుచేసుకోవడం జరిగింది. ఈ ఎస్యువి వాహనం ఒక 2.0 డిసి ఐ డీజిల్ మోటార్ ని కలిగి ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ విభాగాలలో కూడా అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించబోతోంది. ఒక AWD సెటప్ ని కలిగి ఇదివరకటి శ్రేణి వాహనాల కన్నా అధీకృతమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించబోతోంది.
పాట్రోల్
నిస్సన్ వారు ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క ఎస్యువి ఫ్లాగ్షిప్ వాహనాలకు గౌరవింపబడడం జరుగుతుంది, ఆ శ్రేణిలోనిదే ఈ పాట్రోల్. ఈ యుటిలిటీ వాహనం నిస్సాన్ వారి ఒక ప్రియమైన ఉత్పాదకం. ఇది ఆడీ క్యు7, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సెడీస్ బెంజ్ జిఎల్ వంటి వాహనాలకు పోటీగా మార్కెట్ లో ఉన్న వాహనం. లక్షణాల పరంగా, ఈ వాహనం ఎన్నో నవీకరించబడిన సమాచార వినోద వ్యవస్థ, నావిగేషన్ వ్యవస్థ, టెరేన్ మానిటరింగ్ వ్యవస్థ మరియు సర్దుబాటు చేసుకోగలిగే సస్పెన్షన్ వ్యవస్థలు వంటి ఎన్నో అంశాలను కలిగి ఉండబోతోంది.
కిక్ కాన్సెప్ట్
నిస్సన్ సంస్థ యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఎస్యువి శ్రేణి వాహనాలలో ఇది ఒక కలల ఉత్పాదకం. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకూ 2014 సావ్ పావలో మోటార్ షో మరియు 2015 బియోనోస్ ఎయిరెస్ మోటార్ షో రెండు ఆటో షో లలో ప్రదర్శితమయ్యి ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఇందువలన మన ఈ ఆటో షో నిస్సాన్ వారు ఈ కాన్సెప్ట్ ని ప్రత్యేకంగా ప్రదర్శితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా చదవండి : " నిస్సాన్ GT -R ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శన దిశగా ముందుకు వస్తోంది"