• English
  • Login / Register

కొత్త మహింద్రా ఎక్స్యూవీ500 - ఎందుకు కొనాలి ఎందుకు కొనకూడదో ఇక్కడ తెలుసుకోండి

మహీంద్రా ఎక్స్యూవి500 కోసం bala subramaniam ద్వారా సెప్టెంబర్ 04, 2015 03:46 pm సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:

మహింద్రా వారు ఎక్స్యూవీ500 కి ఫేస్లిఫ్ట్ ని అందించి ఈ సెగ్మెంట్ కి రారాజుగా వారి స్థానం మరింత దృఢం చేసుకుంటున్నారు. ఇక్కడ క్రింద ఎందుకు మహింద్రా ఎక్స్యూవీ500 ని కొనవచ్చును మరియూ ఎందుకు కొనకూడదు అనే అంశాలు తెలుపబడ్డాయి.

కొనడానికి కారణాలు

ఈ బ్రాండ్ పై మన భారతీయులకు మరియూ విదేశీయులకు ఉండే అభిప్రాయాన్ని మహింద్రా వారు మార్చివేసారు. ఎక్స్యూవీ స్థానిక ఉత్పత్తి గా ముందుకు వచ్చి, అంతర్జాతీయ డిజైన్ ని కలిగి, గొప్ప నిర్మాణంతో మరియూ విలాసవంతమైన లక్షణాలు కలిగి, ప్రీమియం ఎస్యూవీ యొక్క ధరలో రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య గల తేడాని తగ్గించారు. ఈ సెగ్మెంట్ లో ఎన్నడూ లేని విధంగా మోనోకాక్ కలిగిన ఈ ఎస్యూవీ అమ్మకాలను చూసింది.

ఎక్స్యూవీ500 ఫేస్లిఫ్ట్ విషయానికి వస్తే, మార్పులు ఎక్కువ శాతం బాహ్య రూపానికే జరిగాయి. కానీ ఈ మార్పులు ఈ చిరుత పులిని మరింత సమర్ధవంతం చేశాయి. బయటి వైపు మార్పులలో క్రోము ఇన్సర్ట్స్ కొత్త స్కార్పియో లాగా, కొత్త నలుపు హెడ్ల్యాంప్స్ కి బెండింగ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్, అందంగా కనపడే లైట్ గైడ్స్ (ఇవి డీఎలార్స్ కావు), కొత్త ఫాగ్ ల్యాంప్స్ (ఎక్కువ క్రోముతో), కొత్త ధృఢమైన బోనెట్, విండోలపై కొత్త క్రోము లైనింగ్ మరియూ కొత్త అల్లాయ్ వీల్స్ గా ఉన్నాయి. ఈ మార్పులు పైనే ఎక్కువగా ఉన్నా, ఈ ఎక్స్యూవీ500 ని మరింత అందంగా చేయడానికి ఎంతగానో దోహదం చేశాయి.

ఎక్స్యూవీ500 యొక్క ప్రముఖ యూఎస్పీలలో కొన్ని దీనికి ఉన్న పెద్ద లక్షాణాల జాబితా. ఆ జాబితా ఇంకా పెద్దది అయ్యింది. ఎలెక్ట్రిక్ సన్రూఫ్, బాహ్య అద్దాలపై ఉత్తమమైన లోగో ప్రొజెక్షన్ ల్యాంప్స్, 6-వే పవర్ అడ్జ్స్టబుల్ డ్రైవర్ సీటు, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ, 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ తో జీపీఎస్ నావిగేషన్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ సిస్టం, రివర్స్ పార్కింగ్ కామెరా ,వాయిస్ మెసేజింగ్ సిస్టం మరియూ ఇంకా ఎన్నో.

లోపల, ఎక్స్యూవీ500 కి కొత్త నలుపు మరియూ బేజ్ అంతర్ఘతాలు, కొత్త బేజ్ లెదర్ సీట్లు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి ఐసీ బ్లూ థీం మరియూ అల్యూమినియం పెడల్స్, రెండవ మరియూ మూడవ సీట్ల వరుసలో స్థలం మెండుగా ఉంది.

ఈ ఎక్స్యువి 500 అదే 2.2 లీటర్ ఎం-హాక్ ఇంజిన్ తో 140Hp శక్తిని మరియు 330Nm టార్క్ ని అందిస్తుంది. కానీ ఇంధన సామర్ధ్యం 16Kmpl అభివృద్ధి చేశారు. మరొక ముఖ్యమైన మెరుగుదల ఏమిటంగా రైడ్ నాణ్యత. కొత్త సస్పెన్షన్ సెటప్ తో, ఎక్స్యువి500 గట్టిగా కాకుండా, మంచి అధిక వేగం సామర్థ్యంతో స్పోర్టీరియర్ ఫీల్ ని అందిస్తుంది.

కొనుగోలు చేయకపోవడానికి కారణాలు:

ఈ జాబితాలో కారణాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, అవి నిర్లక్ష్యం చేసేందుకు సాధ్యం కాదు. 3 వరుసలలో కూడా సీటింగ్ ఉండడం మూలాన వెనుక లేగేజ్ పెట్టుకునే స్థలం లేదు మరియు మూడవ వరుసలో సీట్లు పిల్లకి మాత్రమే అనువుగా ఉంటాయి. మహీంద్రా ఎక్స్యువి500 పెద్ద వాహనం అయినప్పటికీ దానిలో మూడు వరుస సీట్లు కూడా ఆక్రమించబడి ఉండడం అనేది ఒక పెద్ద ప్రతికూలత. రైడ్ యొక్క క్వాలిటీ మరియు నిర్వహణ అభివృద్ధి చేసినప్పటికీ ఎక్స్యువి 500 యొక్క క్లచ్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరముంది. దూరపు ప్రయాణాల సమయంలో, క్లచ్ ట్రాఫిక్ లో చాలా చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా తాత్కాలిక మోకాలి నొప్పి వస్తుంది.

7 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ ఖచ్చితంగా డ్రైవర కి ఉపయోగించడానికి సులభంగా లేదా సహజమైనదిగా ఉండదు. నావిగేషన్ కి గమ్యం ని చేర్చడానికి చాలా ఓపిక అవసరం. అన్ని కారకాలు పరిగణలోనికి తీసుకుంటే, ఈ కొత్త ఎక్స్యువి 500 ఇప్పటికీ ఆ ధర పరిధిలో మంచి ఉత్పత్తి మరియు మీరు దీనిని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవచ్చు.

was this article helpful ?

Write your Comment on Mahindra ఎక్స్యూవి500

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience