• English
 • Login / Register

2024 లో భారతదేశంలో విడుదల కానున్న కొత్త Kia Carnival ఎక్ట్సీరియర్ ప్రదర్శన

కియా కార్నివాల్ కోసం rohit ద్వారా అక్టోబర్ 30, 2023 02:16 pm ప్రచురించబడింది

 • 888 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త కియా కార్నివాల్ షార్ప్ ఫాసియా మరియు నిలువుగా అమర్చిన LED హెడ్లైట్లతో అందించబడుతుంది, ఇది కియా యొక్క తాజా డిజైన్ భాషతో అలైన్ చేయబడుతుంది.

2024 Kia Carnival

 • కియా నాల్గవ తరం కార్నివాల్ ను ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించారు.

 • ఎక్ట్సీరియర్ లో కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కొత్త LED టెయిల్ లైట్లు ఉన్నాయి.

 • క్యాబిన్ లో కొత్త డ్యాష్ బోర్డు, కొత్త డిస్ ప్లే ఇవ్వవచ్చు.

 • ఇది పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ అనే మూడు ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. ఇప్పుడు వీటిలో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ ఎంపికను కూడా జోడించారు.

 • ఇది 2024 లో భారతదేశంలో విడుదల కావచ్చు, దీని ధర రూ .40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

కియా మోటార్స్ నాల్గవ తరం కార్నివాల్ యొక్క ఫస్ట్ లుక్ ను ఆటో ఎక్స్ పో 2023 లో చూసాము. కంపెనీ ఈ లగ్జరీ MPVని లేటెస్ట్ డిజైన్ థీమ్ తో దీన్ని రూపొందించారు. దీని స్టైలింగ్ నవీకరణలు కియా యొక్క తాజా డిజైన్ ఫిలాసఫీ అపోసిట్స్ యునైటెడ్'కు అనుగుణంగా ఉన్నాయి.

డిజైన్ లో చాలా మార్పులు చేశారు

కొత్త కియా కార్నివాల్ డిజైన్ మునుపటి కంటే షార్ప్ లుక్స్ తో లభిస్తుంది. నవీకరణలో కంపెనీ వర్టికల్ పొజిషన్ 4-పీస్ LED హెడ్ లైట్లు, కొత్త LED DRLలు, పెద్ద అలాగే కొత్త గ్రిల్లను అందించింది. కియా ఫ్రంట్ బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ యొక్క మూలలను కూడా నవీకరించారు. ఇందులో ఎయిర్ డ్యామ్ ఇప్పటికీ అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కోసం సమాంతర స్లేట్ మరియు రాడార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2024 Kia Carnival side

దాని సైడ్ పార్ట్ లో పెద్దగా మార్పులు లేవు. కానీ, అల్లాయ్ వీల్స్ లకు మాత్రం కొత్త డిజైన్ అందించారు. వెనుక భాగంలో కొత్త టెయిల్ గేట్, సన్నని మరియు కొత్త LED టెయిల్ లైట్లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో కొత్త బంపర్ ఉన్నాయి.

2024 Kia Carnival Gravity
2024 Kia Carnival Gravity rear

కియా మోటార్ కొత్త కార్నివాల్ ను బ్లాక్ ORVMలు, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్ గ్రిల్ తో కొత్త డార్క్ గ్రే షేడ్ లో ప్రవేశపెట్టింది.

 • ఇక్కడ మీకు ఏవైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి .

క్యాబిన్ లో కూడా నవీకరణలు

Kia Carnival cabin

రిఫరెన్స్ కోసం ప్రస్తుత కియా కార్నివాల్ యొక్క క్యాబిన్ చిత్రం

కార్నివాల్ MPV యొక్క క్యాబిన్ కు సంబంధించిన సమాచారాన్ని కియా మోటార్స్ ఇంకా పంచుకోలేదు. అయితే కంపెనీ తన క్యాబిన్ లో స్క్రీన్, డ్యాష్ బోర్డ్, రేర్ సీట్ కంఫర్ట్ లను నవీకరించనున్నట్లు తెలిపారు. ఇది మునుపటి మాదిరిగానే అనేక సీటింగ్ కాన్ఫిగరేషన్లతో రానుంది.

ఇందులో ఏ ఇంజన్ ఎంపికలు లభించనున్నాయి?

కొత్త కియా కార్నివాల్ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ అనే మూడు ఇంజన్ ఎంపికలతో  లభిస్తుంది. కియా మోటార్ దీనికి కొత్త 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ను జోడించినట్లు ప్రకటించింది. భారతదేశంలో ఈ ప్రీమియం MPV కారుకు పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడుతుందని మేము భావిస్తున్నాము, అయితే దాని పాత మోడల్ లో ఒక డీజిల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది.

ఇది కూడా చదవండి:  మీ ట్రిప్పులను మరింత మెరుగ్గా ప్లాన్ చేయడానికి నవీకరించిన కొత్త గూగుల్ మ్యాప్స్ మీకు సహాయపడుతుంది

విడుదల మరియు ధర

2024 Kia Carnival rear

కియా మోటార్స్ భారతదేశంలో కొత్త కార్నివాల్ కారును విడుదల చేయనున్నట్లు ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ వాహనం 2024 నాటికి ఇక్కడకు రాగలదని మేము ఆశిస్తున్నాము. దీని ప్రారంభ ధర రూ .40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. టయోటా ఇన్నోవా హైక్రాస్ కంటే ఎక్కువ ప్రీమియం ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. అయినప్పటికీ భారతదేశంలో, ఇది నేరుగా ఏ కారుతోనూ పోటీ పడదు. అంతర్జాతీయ మార్కెట్లో, కియా మోటార్స్ 2023 కార్నివాల్ గురించి మరిన్ని కొత్త సమాచారాన్ని నవంబర్ 2024 లో వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి:  ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఎక్ట్సీరియర్ డిజైన్ చిత్రాలు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన కియా కార్నివాల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience