2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత పతక విజేతలకు బహుమతిగా MG Windsor EV
ఎంజి విండ్సర్ ఈవి కోసం dipan ద్వారా ఆగష్టు 05, 2024 08:44 pm ప్రచురించబడింది
- 111 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ZS EV, కామెట్ EV తర్వాత MG విండ్సర్ EV భారతదేశంలో బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ అందిస్తున్న మూడో EV.
ఇటీవలి ట్వీట్‌లో, JSW గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం గెలిచిన ప్రతి భారతీయ అథ్లెట్‌కు రాబోయే MG విండ్సర్ EV బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. MG మోటార్ ఇండియా మరియు JSW గ్రూప్, వారి జాయింట్ వెంచర్ కింద, ఈ బహుమతి ద్వారా భారతీయ అథ్లెట్ల విజయాలను ఈ కార్యక్రమం ద్వారా గౌరవించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి..
August 1, 2024
ఒలింపిక్స్‌లో భారత్
ప్రస్తుతం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటికే మూడు కాంస్య పతకాలను గెలుచుకుంది. కాలక్రమేణా, ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. MG విండ్సర్ EVలను బహుమతిగా ఇవ్వడం అథ్లెట్ల కృషి మరియు విజయానికి తగిన నివాళి.
ఇంగ్లాండ్లోని విండ్సర్ కాజిల్ స్ఫూర్తితో MG క్రాసోవర్ EVకి 'విండ్సర్' అని నామకరణం చేసినట్లు ఇటీవల MG చైర్మన్, MD ఈ ట్వీట్ చేశారు. విదేశాల్లో విక్రయించే వులింగ్ క్లౌడ్ EV ఆధారంగా విండ్సర్ EVని రూపొందించారు. భారతదేశంలో రాబోయే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి:
ఇది కూడా చదవండి: రాబోయే MG విండ్సర్ EV గురించి మీరు తెలుసుకోవలసిన టాప్ 5 విషయాలు
MG విండ్సర్ EV: ఒక అవలోకనం
MG విండ్సర్ భారతదేశంలో MG యొక్క మూడవ ఎలక్ట్రిక్ కారు, ఇది MG కామెట్ EV మరియు MG ZS EV మధ్య ఉంచబడుతుంది. భారతదేశంలోకి రానున్న విండ్సర్ ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్ల గురించి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు, అయితే దీనికి ఇండోనేషియా మోడల్ యొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఇవ్వవచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి.
ఇండోనేషియాలో, ఇది 50.6 kWh బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని సరఫరా చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ పవర్ అవుట్‌పుట్ 136 PS మరియు 200 Nm. చైనా లైట్ డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ (CLTC) ప్రకారం ఇండోనేషియా-స్పెక్ మోడల్ 460 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. అయితే, భారతీయ మోడల్ యొక్క అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ధృవీకరించబడిన పరిధి భిన్నంగా ఉండవచ్చు.
MG విండ్సర్ ఇతర MG కార్ల వలె ఫీచర్ లోడ్ చేయబడవచ్చు. దీని భారతీయ వెర్షన్‌లో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ వంటి ఫీచర్లను అందించవచ్చు. భద్రత పరంగా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లను అందించవచ్చు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ని కూడా ఇందులో అందించవచ్చు.
ఆశించిన ధర మరియు ప్రత్యర్థులు
MG విండ్సర్ EV పండుగ సీజన్లో విడుదల చేయబడుతుంది. దీని ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది MG ZS EV కంటే సరమైన ఎలక్ట్రిక్ కారుగా అందించబడుతుంది, అయితే టాటా నెక్సాన్ EV మరియు మహీంద్రా XUV400 EV కంటే ప్రీమియం ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
ఆటోమోటివ్ ప్రపంచం నుండి మరిన్ని అప్‌డేట్‌ల కోసం కార్దెకో యొక్క వాట్సప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
0 out of 0 found this helpful