• English
  • Login / Register

MG హెక్టర్ 6- సీటర్ టెస్టింగ్ కొనసాగుతోంది. కెప్టెన్ సీట్లు పొందుతుంది

ఎంజి హెక్టర్ 2019-2021 కోసం dhruv attri ద్వారా జనవరి 04, 2020 03:37 pm సవరించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హెక్టర్ నుండి వేరు చేయడానికి ఇది వేరే పేరును కలిగి ఉంటుంది

  •  ఆరు సీట్ల హెక్టర్ ప్రస్తుతం ఉన్న హెక్టర్ SUV నుండి డిజైన్ మార్పులను పొందనున్నది.
  •  ఇది రెండవ వరుసలో ఫోల్డ్ చేయగల ఆర్మ్‌రెస్ట్‌ తో కెప్టెన్ సీట్లను పొందుతుంది.
  •  ఇంజిన్ ఎంపికలు హెక్టర్ మాదిరిగానే ఉంటాయి, కాని BS6 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.
  •  5 సీట్ల హెక్టర్ కంటే దీని ధర సుమారు లక్ష రూపాయలు ఎక్కువ.

MG Hector 6-seater Testing Continues. Gets Captain Seats

అనేక సార్లు మా కంటపడిన తరువాత, చివరకు MG హెక్టర్ 6- సీటర్ లోపలి భాగం మొట్టమొదటిసారి మా కంటపడింది. అదనపు ప్రయాణీకుల కోసం సీటింగ్ ఉన్న MG హెక్టర్ సాధారణ SUV మాదిరిగానే ఫీచర్లను పొందడం కొనసాగిస్తుంది, అయితే కొన్ని డిజైన్ అప్‌డేట్స్‌తో కొంచెం పొడవుగా ఉంటుంది.

వెలుపల నుండి, MG హెక్టర్ ఆరు-సీట్ల వైఖరి కొద్దిగా MPV లాగా కనిపిస్తుంది, కానీ ఇది హెక్టర్ కంటే 40mm పొడవు ఉండే అవకాశం ఉన్నందున అది ఊహ మాత్రమే. తక్కువ-స్పెక్ హెక్టర్ మాదిరిగానే 17- ఇంచ్ యూనిట్లు ఉండే సరళమైన అల్లాయ్ వీల్స్‌పై రోల్ చేస్తున్నందున మా కంటపడిన మోడల్ తక్కువ వేరియంట్ లాగా కనిపిస్తుంది. 6- సీటర్‌ హెక్టర్  లో LED DRL డిజైన్‌తో పాటు ఫ్రంట్, రియర్ బంపర్‌ల కోసం అప్‌గ్రేడ్‌లు ఉంటాయి.

ఏదేమైనా, ఇక్కడ అతిపెద్ద మార్పు రెండవ వరుసలో కాంట్రాస్ట్ కుట్టుతో లెథరెట్ అప్హోల్స్టరీని కలిగి ఉండే కెప్టెన్ సీట్లు లభిస్తాయి. ఈ సీట్లు ప్రత్యేకమైన, ఇంటిగ్రేటెడ్ ఫోల్డబుల్ ఆర్మ్‌రెస్ట్‌ను స్లైడ్ మరియు రిక్లైన్ ఫంక్షన్ తో పొందుతాయి.

MG Hector 6-seater Testing Continues. Gets Captain Seats

MG హెక్టర్ 6-సీటర్ BS 6 రూపంలో ఉన్నప్పటికీ ఐదు సీట్ల హెక్టర్ మాదిరిగానే ఇంజన్లను నిలుపుకునే అవకాశం ఉంది. SUV కి 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ మరియు 2.0-లీటర్ ఫియట్-సోర్స్డ్ డీజిల్ ఇంజన్ పవర్ ని ఇస్తుంది. ట్రాన్స్మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గా అందించబడుతుంది మరియు పెట్రోల్ కోసం  DCT కూడా ఉంది.

MG మోటార్ హెక్టర్ 6- సీటర్ రూ .1 లక్ష ప్రీమియంతో రూ .12.48 లక్షల నుంచి రూ .17.28 లక్షల మధ్య ధరతో నిర్ణయించే అవకాశం ఉంది. ఇది టాటా గ్రావిటాస్, 2020 మహీంద్రా XUV500 మరియు XUV 500 ఆధారంగా కొత్త ఫోర్డ్ SUV లతో పోటీ పడుతుంది.

మూలం

మరింత చదవండి: MG హెక్టర్ ఆన్ రోడ్ ప్రైజ్

was this article helpful ?

Write your Comment on M g హెక్టర్ 2019-2021

4 వ్యాఖ్యలు
1
P
peddisetti srinivasarao
Feb 28, 2020, 6:59:17 PM

When will it launch?

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    V
    vandana mahadik
    Feb 23, 2020, 5:38:35 PM

    Call when launching 6 seated

    Read More...
      సమాధానం
      Write a Reply
      1
      S
      sushil
      Jan 18, 2020, 8:54:16 PM

      Waiting for launch of 6sitter, will rock in current suv:s

      Read More...
        సమాధానం
        Write a Reply

        explore మరిన్ని on ఎంజి హెక్టర్ 2019-2021

        ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

        • లేటెస్ట్
        • రాబోయేవి
        • పాపులర్
        ×
        We need your సిటీ to customize your experience