సెప్టెంబర్ 25 న ప్రారంభించబడుతున్నమెర్సిడీస్ మేబ్యాచ్
సెప్టెంబర్ 09, 2015 10:48 am konark ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: జర్మన్ సెలూన్, మేబ్యాచ్ ఎస్600 ఎల్లప్పుడూ అంతిమంగా డ్రైవర్ చే నడపబడే యంత్రం మరియు సౌకర్యం గల వెనుక సీటుతో లగ్జరీ వాహనంగా ప్రతీతి పొందినది. ఎస్ క్లాస్ యొక్క సూపర్ లగ్జరీ మేబ్యాచ్ ఎడిషన్ ఇప్పుడు ఈ నెల 25 న భారతదేశంలో రాబోతుంది.
వెనుక సీట్ జోడించడం వలన ఎస్600 మేబ్యాచ్ సాధారణ ఎస్- క్లాస్ కంటే 207 మిల్లీమీటర్లు పొడవైనదిగా ఉంటుంది. దీని యొక్క మొత్తం పొడవు 5,453 మిల్లీమీటర్లు ఉంటుంది. అయితే దీని వీల్బేస్ 200మిల్లీమీటర్లు కి పెంచగా 3,365 మిల్లీమీటర్లు వీల్బేస్ ని కలిగి ఉంటుంది.
ఈ ఎస్ 600 దాని మెరిసే అలాయ్ వీల్స్ కారణంగా మరియు పదునైన గ్రిల్ తో పాటూ సి-పిల్లర్స్ పైన మేబ్యాచ్ లోగో కారణంగా వీధుల్లో సులభంగా గుర్తించబడుతున్నది. బూట్ లిడ్ కూడా మేబ్యాచ్ బాడ్జింగ్ ని కలిగి ఉంటుంది.
ఈ ఎస్ 600 మేబ్యాచ్ శక్తివంతమైన 6.0-లీటర్, వి12, ద్వి టర్బో పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి 523bhp శక్తిని మరియు 830Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా నియంత్రించబడుతుంది.
దీని పొడవైన వీల్బేస్ కారణంగా మేబ్యాచ్ ఎస్600 ప్రామాణిక ఎస్ క్లాస్ కంటే విశాలమైనదిగా ఉంటుంది. అంతర్భాగాలలో అపోలిస్ట్రీ పైన వివిధ స్థలాలలో మేబ్యాచ్ లోగోలు గుర్తించవచ్చు. వెనుక కూర్చునే ప్రయాణికుల కొరకు సర్దుబాటు బ్యాక్ రెస్ట్లు అందుబాటులో ఉంటాయి. సీటు కుషన్ కూడా వంపు మరియు సమాంతర సర్దుబాటు తో కలిపి వ్యక్తిగతంగా సర్ద్దుబాటు చేసుకోవచ్చు.
0 out of 0 found this helpful