• English
  • Login / Register

భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి ప్రారంభించిన మెర్సెడెజ్-బెంజ్ జిఎల్ ఏ క్లాస్ ప్రారంభ ధర రూ.31.31 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ కోసం raunak ద్వారా జూన్ 11, 2015 05:12 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మన దేశీయ ప్రాంతంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా, జిఎల్ ఏ క్లాస్ కాంపాక్ట్ వాహనం కోసం నిర్మాణ సౌకర్యాన్ని ప్రారంభించింది; సిఎల్ ఏ, ఏ మరియు బి క్లాస్ లను త్వరలోనే ప్రారంభిస్తుంది.


జైపూర్: మెర్సెడెజ్-బెంజ్ ఇండియా స్థానికంగా పూణేలో ఉన్న తయారీ సంస్థలో ఉత్పత్తి చేసిన జిఎల్ ఏ ఎస్యూవి వాహనాన్ని ప్రారంభించింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన జిఎల్ ఎ ధర చౌకగా దాదాపు రూ. 2 లక్షలు తక్కువ, అయితే ఇప్పుడు డీజిల్ వేరియంట్ ధర రూ. 31,31 లక్షల నుండి మొదలయింది. ఈ జిఎల్ ఏ తో, జర్మనీ తయారీ సంస్థ కూడా పూణే ప్రాంగణంలో తయారీ సౌకర్య కర్మాగారాన్ని ప్రారంభించనుంది. ఈ కొత్త సౌకర్యంతో త్వరలోనే ఉత్పత్తి కానున్న సిఎల్ ఏ, ఏ మరియు బి కాంపాక్ట్ వాహనాల నిర్మాణం ఇక్కడే ప్రారంభించబోతున్నారు. ఈ కొత్త సౌకర్యంతో త్వరలోనే ఉత్పత్తి కానున్న సిఎల్ ఏ, ఏ మరియు బి కాంపాక్ట్ వాహనాలను నిర్మాణం ఇక్కడే ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా, స్థానికంగా ఉత్పత్తి చేసిన డీజిల్ వేరియంట్లలో జిఎల్ ఏ క్లాస్ మాత్రమే ప్రారంభించారు.

ధరలు (స్థానిక ఉత్పత్తి ఎక్స్-షోరూమ్, పూనే)

  •     జిఎల్ ఏ 200 సిడి ఐ స్టైల్: రూపాయలు.31.31 లక్షలు
  •     జిఎల్ ఏ 200 సిడి ఐ స్పోర్ట్: రూపాయలు.34.25 లక్షలు

కంపెనీ వారు, తయారీ సౌకర్యాన్ని పూనే చకన్ లో 1000 కోట్ల రూపాయిల కంటే ఎక్కువ పెట్టుబడిని  పెట్టారు.  మరియు వారు ఇప్పుడు 20,000 వాహనాల వార్షిక సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ కొత్త ఉత్పత్తి సౌకర్యాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ దేవేంద్ర ఫడ్నావిస్ మరియు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ కు కేంద్ర మంత్రి అయిన శ్రీ ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా దీనిని ప్రారంబించారు.  

ఈ జిఎల్ ఏ ఇంజెన్ 2లీటర్ డీజిల్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజెన్ 3600 నుండి 4400rpm వద్ద అత్యధికంగా 136bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటుగా 1600 నుండి 3000rpm వద్ద 300Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ కాంపాక్ట్ లగ్జరీ ఎస్యువి అయిన ఈ జిఎల్ ఏ క్లాస్ మోడల్ 17.9kmpl ఉత్తమ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mercedes-Benz బెంజ్ Class

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience