మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఫోర్త్- జనరేషన్ GLE కోసం బుకింగ్‌లను తెరిచింది
మెర్సిడెస్ బెంజ్ 2020-2023 కోసం rohit ద్వారా నవంబర్ 05, 2019 12:11 pm ప్రచురించబడింది
- 33 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది సరికొత్త GLE మరియు BS 6-కంప్లైంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో అందించబడుతుంది
- నెక్స్ట్-జెన్ GLE 2020 ఆటో ఎక్స్‌పోకు ముందే భారతదేశంలో విడుదల కానుంది.
- ఇది ఇటీవల భారతీయ రోడ్లపై ఎమిషన్ పరీక్షలకు గురైంది.
- దీని ధర రూ .70 లక్షలు నుండి రూ .1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) ఉండవచ్చని అంచనా.
- ప్రారంభించిన తరువాత, ఇది BME X 5, వోల్వో XC 90, ఆడి Q 7 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి పోటీగా ఉంటుంది.
2018 ప్యారిస్ మోటార్ షోలో ప్రారంభమైన నెక్స్ట్-జెన్ మెర్సిడెస్ బెంజ్ GLE భారతదేశంలో 2020 ఆటో ఎక్స్‌పోకు ముందే ప్రారంభం కానున్నది. రాబోయే SUV ని ఒక నెల క్రితం భారతదేశంలో రహస్యంగా పరీక్ష చేశారు.
ఇప్పుడు, మెర్సిడెస్ బెంజ్ ఇండియా రాబోయే GLE SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించినట్లు ప్రకటించింది. స్పై షాట్ల ద్వారా వెళితే, నాల్గవ తరం GLE BS6-కంప్లైంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ల ద్వారా పవర్ ని అందుకుంటుందని భావిస్తున్నాము. టెస్ట్ మ్యూల్ ఎమిషన్ స్థాయిలను పరీక్షించడానికి ఉపయోగించే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ఎనలైజర్‌ను క్యారీ చేస్తున్నట్టుగా కనిపించింది.
GLE కొత్త ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉన్నందున, దాని వీల్‌బేస్ 80mm పెరిగింది మరియు ఇప్పుడు 2,995mm ఉంది. టెస్ట్ మ్యూల్ 19-అంగుళాల ఆప్షనల్ అల్లాయ్ వీల్స్ తో కనిపించింది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ భారతదేశంలో నాలుగు వేరియంట్లలో అందించబడుతుండగా, 2020 GLE ని అంతర్జాతీయంగా మొత్తం ఐదు వేరియంట్లలో (మూడు డీజిల్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్లు) అందిస్తున్నారు: GLE 300 d, GLE 350 d, GLE400 d, GLE 350 మరియు GLE 450 .
ఇది కూడా చదవండి: మెర్సిడెస్ బెంజ్ G350 d భారతదేశంలో రూ .1.5 కోట్లకు ప్రారంభించబడింది
హుడ్ కింద, కొత్త 2020 GLE నాలుగు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. 300 d డీజిల్ 2.0-లీటర్ యూనిట్ (245 PS / 500 Nm) చేత పవర్ అందుకోగా, 400 d డీజిల్ 3.0-లీటర్ ఇంజిన్ 330 PS గరిష్ట పవర్ మరియు 700 Nm పీక్ టార్క్ ని అందిస్తుంది. GLE350 వేరియంట్ 2.0-లీటర్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ తో 255PS పవర్ అందిస్తుంది, అయితే GLE 450 3.0-లీటర్ V 6 తో అందించబడుతుంది, ఇది 367PS ల పవర్ అందిస్తుంది. జర్మన్ కార్ల తయారీదారు అన్ని ఇంజిన్‌లను 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో అందిస్తోంది.
కొత్త GLE కొత్త A-క్లాస్ నుండి రెండు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ లతో అందించబడుతుంది. అదనంగా, ఇది స్టీరింగ్ వీల్ పై మల్టీ -ఫంక్షనల్ టచ్ బటన్లతో పాటు సెంటర్ కన్సోల్ లో పెద్ద టచ్‌ప్యాడ్‌ను కలిగి ఉండవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ ధర 70 లక్షల నుండి 1.05 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ఇండియా). ఇది BMW X 5, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, ఆడి Q 7 మరియు వోల్వో XC 90 వంటి వాటికి వ్యతిరేకంగా పోటీ పడగలదు.