మెర్సిడెస్ బెంజ్ G 350 d భారతదేశంలో రూ .1.5 కోట్లకు ప్రారంభించబడింది
మెర్సిడెస్ జి జిఎల్ఈ 2011-2023 కోసం rohit ద్వారా అక్టోబర్ 21, 2019 12:42 pm సవరించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది భారతదేశంలో G-వాగన్ యొక్క మొదటి నాన్- AMG డీజిల్ వేరియంట్
- కొత్త G 350 d 3.0-లీటర్ డీజిల్ యూనిట్ (285Ps / 600Nm) తో వస్తుంది.
- ఇది AMG G 63 కన్నా తక్కువ స్పోర్టి బాహ్య భాగాన్ని కలిగి ఉంది.
- ఇది తక్కువ- రేంజ్ గేర్‌బాక్స్ మరియు లాకింగ్ డిఫరెన్షియల్స్ వంటి రోడ్ టెక్నాలజీ తో వస్తుంది.
- రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి వాటికి G 350 d ప్రత్యర్థి.
మెర్సిడెస్ బెంజ్ తన మొట్టమొదటి నాన్-AMG G-వాగన్ ను భారతదేశంలో రూ .1.5 కోట్లకు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది. ఇప్పటి వరకు G-క్లాస్, AMG G 63 వేరియంట్‌గా మాత్రమే అందించబడింది, ఇది SUV యొక్క స్పోర్టియర్ వెర్షన్.
కొత్త G 350 d 3.0-లీటర్ 6- సిలిండర్ డీజిల్ యూనిట్‌తో వస్తుంది, ఇది 285Ps గరిష్ట శక్తిని మరియు 600Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మూడు డిఫరెన్షియల్ లాక్స్ ని కూడా పొందుతుంది, G- క్లాస్ యొక్క అన్ని వెర్షన్లకి ప్రసిద్ధి చెందిన దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని నిలుపుకుంటుంది. AWD డ్రైవ్‌ట్రెయిన్‌తో పాటు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది.
ఇవి కూడా చూడండి: 2019 మెర్సిడెస్ బెంజ్ GLE భారతదేశంలో మా కంట పడింది
మార్పుల పరంగా, G 350 d ఒక టోన్ డౌన్, పనామెరికానా AMG గ్రిల్‌కు బదులుగా, మూడు-స్లాట్ గ్రిల్‌ను పొందుతుంది. మెర్సిడెస్ తక్కువ ప్రముఖ వీల్ ఆర్చులతో పాటు విభిన్నమైన అల్లాయ్ వీల్‌లను అందిస్తోంది. అయితే, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు బూట్‌లోని స్పేర్ వీల్ G 63 నుండి దీనిలో ఉంచిన కొన్ని విషయాలు.
లోపల, కార్బన్ ఫైబర్ వివరాలు మరియు ఇన్సర్ట్‌ల వంటి స్పోర్టి ఎలిమెంట్స్ మినహా G 350 d దాదాపు ఒకే క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. G 350 d నాపా లెదర్ అప్హోల్స్టరీ మరియు ఖరీదైన ఇంటీరియర్స్ తో వస్తుంది. ఇది డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలతో ఉంటుంది, ఒకటి డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు MID కోసం, మరొకటి కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం టచ్‌స్క్రీన్ డిస్ప్లే.
G-క్లాస్ మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, పవర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి లక్షణాలతో లోడ్ చేయబడింది. మెర్సిడెస్ తన ‘మెర్సిడెస్ మి’ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ కోసం కొత్త G 350 d ని ఎంబెడెడ్ eSIM తో అమర్చారు మరియు ఇది ఫ్యాక్టరీతో అమర్చిన భారతదేశంలో మొట్టమొదటి బెంజ్ మోడల్.
మెర్సిడెస్ ఆప్షనల్ ఎక్స్‌ట్రాల యొక్క G మ్యానుఫ్యాక్చర్ లైన్ ద్వారా G-క్లాస్ కోసం ఉన్నత స్థాయిలో మనకి అనుగుణంగా మార్చుకొనే కూడా అందిస్తుంది. దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేనప్పటికీ, G 350 d ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC 200 వంటి వంటి వాటితో పోటీ పడుతుంది.
దీనిపై మరింత చదవండి: GO-క్లాస్ ఆటోమేటిక్