2016 వ సంవత్సరం నుండి 2% ధర పెంపుతో రాబోతున్న మెర్సిడెస్ బెంజ్

డిసెంబర్ 07, 2015 05:16 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఒక మెర్సిడెస్ బెంజ్ వాహనాన్ని కొనుగోలు చేయాలంటే, ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందువలన అంటే, జనవరి 01, 2016 వ సంవత్సరం నుండి ఈ మెర్సిడెస్ బెంజ్ మొత్తం మోడళ్ళు, గంభీరమైన ధర పెంపును కలిగి రాబోతున్నాయి. ఈ ధర పెంపు ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ మోడల్ సిరీస్ యొక్క వివిధ మోడళ్ళకు వేర్వేరుగా ఉంటుంది మరియు ఈ పెరుగుదల గరిష్టంగా 2% వరకు ఉండవచ్చు. ఈ వాహనాల ధరలు, వాటి ఎక్స్ షోరూం ఆధారంగా పెరుగుతాయి. ఇప్పటి వరకు భారత మార్కెట్ లో మెర్సిడెస్ బెంజ్, 24 మోడళ్ళతో అందుబాటులో ఉంది. వాటి యొక్క ధర పరిదిని (ఎక్స్ షోరూం) గనుక చూసినట్లైతే, రూ 27.5 లక్షల నుండి రూ 2.7 కోట్ల వరకు ఉంది.  

ఈ పెరుగుదల సమయంలో వ్యాఖ్యానిస్తూ, మెర్సిడెస్ బెంజ్ భారతదేశం మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో అయిన రోలాండ్ ఫోల్గేర్స్ మాట్లాడుతూ, "ఎక్స్ షోరూం ధరలు పెరుగుతున్న సమయంలో, మేము బ్రాండ్ లో మా వినియోగదారుల పెట్టుబడిని రక్షించేందుకు, మా ఉత్పత్తి శ్రేణిలో కొన్ని ధర సర్దుబాట్లను చేయడానికి ఒత్తిడిని కలిగి ఉన్నాము. అంతేకాకుండా, మార్కెట్ లో మా ప్రీమియం బ్రాండ్ స్థానాలు నిర్వహించడానికి మరియు ఒక లాభదాయకమైన వ్యాపార కొనసాగించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాము" అని వ్యాఖ్యానించారు. ధర పెరుగుదల ఉన్నప్పటికీ, వినియోగదారులు వారు వారి కల కారును నడపడంతో పాటు స్టార్ ఫైనాన్స్, స్టార్ ఎజిలిటీ, స్టార్ లీజ్ లేదా కార్పొరేట్ స్టార్ లీజ్ వంటి వాటిని ఆర్థికంగా వాహనాల యొక్క పరిధిలో లాభపడవచ్చు అని అన్నారు.

సంస్థ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 14 వాహనాలను ప్రవేశపెట్టింది. వాటిలో ఇటీవల విడుదల అయిన వాహనం, ఏ ఎం జి జిటి ఎస్ వాహనం మరియు ఇది, 2.4 కోట్ల ఎక్స్ షోరూం ఢిల్లీ వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ వాహనం, ఈ ఏడాది భారతదేశం లో ప్రారంభించబడింది మరియు మెర్సిడెస్ ఏఎంజి శాఖలో, సంస్థలోనే పూర్తిగా అభివృద్ధి చెందిన 5 వ ఏఎంజి వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనం, ఎస్ ఎల్ ఎస్ ఏఎంజి స్థానాన్ని భర్తీ చేసింది. అంతేకాకుండా, ఈ సూపర్ కారు అన్ని- కొత్త 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 510 పి ఎస్ పవర్ ను అదే విధంగా 650 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  

ఇది కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience