మెర్సిడేజ్ వారు ఏఎంజీ జీటీ ని నవంబరు 24, 2015 న విడుదల చేయనున్నారు
మెర్సిడెస్ ఏఎంజి జిటి కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 28, 2015 10:50 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మెర్సిడేజ్-బెంజ్ ఏఎంజీ జీటీ ని 2015, నవంబరు 24న విడుదల అవుతుంది. ఈ రెండు సీతర్లు ఉన్న సూపర్ కారు గంటకి 0 నుండి 100 కిలోమీటర్లు 3.8 సెకనుల్లో చేరుతుంది మరియూ గరిష్ట వేగం గంటకి 305 కిలోమీటర్లు చేరగలదు. ఈ సంఖ్య భారత ప్రత్యేక మోడల్ అయిన ఏఎంజీ జీటీ ఎస్ ది.
పొడుగైన హుడ్ మరియూ చిన్న కాక్‌పిట్ వంటి క్లాసిక్ జీటీ యొక్క డిజైన్ కలిగి ఉంటుంది. పైగా లైట్ అమరిక మరియూ వంపులు అన్నీ సూపర్ కారుని గుర్తు చేస్తాయి. లోపల వైపున, రెట్రో స్విచెస్ మరియూ అలుమినియం ట్రిం కలిగి అచ్చం ఎయిర్ క్రాఫ్ట్ మాదిరిగా కనిపిస్తుంది. ఇంజిను విషయానికి వస్తే, దీనికి 4.0-లీటర్ V8 ఇంజిను ఉండి ఇది 503bhp శక్తి విడుదల చేస్తుంది.
డ్యువల్ క్లచ్ గేర్‌బాక్స్ రేర్ ఆగ్జల్ వద్ద ఉండటం వలన బరువు సమానంగా పంపకం జరుగుతుంది. శక్తి సరఫరా వెనువెంటనే అయ్యేందుకు గాను డ్రై సంప్ లుబ్రికేషన్ సిస్టం ని కలిగి ఉంటుంది.
ఏఎంజీ జీటీ యొక్క ధర రూ.2.5 కోట్ల వరకు ఉండవచ్చు. ఇది పోర్షే 911 ఇంకా జాగ్వార్ ఎఫ్ టైప్ తో పోటీ పడనుంది.
2015 పూర్తి అయ్యేటప్పటికి 15 కార్లు అందిస్తామని బెంజ్ వారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఈ కారు వారు 14వ సమర్పణ గా నిలుస్తుంది.