• English
  • Login / Register

అధికారికంగా వెల్లడైన మెర్సిడెస్ జిఎల్ సి

జూన్ 18, 2015 04:17 pm arun ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం అయిన మెర్సిడెస్ అధికారికంగా, బేబీ ఎస్యువి అయిన జిఎల్ సి ను వార్తల్లో వెల్లడించింది. మెర్సిడెస్ పోర్ట్ఫోలియో లో ఉన్న జిఎల్ కె ను భర్తీ చేయడానికి జిఎల్ సి రానుంది. పరిమాణం ప్రకారం చెప్పాలంటే, ఈ జిఎల్ సి ను మెర్సిడెస్ పోర్ట్ఫోలియో లో ఉన్న జిఎల్ ఏ కు మరియు జిఎల్ ఈ కు మధ్యలో ప్రవేశపెట్టే సూచనలు ఉన్నాయి.   

ఈ కొత్త జిఎల్ సి, విజయవంతమైన ఎస్యువి తత్వశాస్త్రం అమలులో మరింత, క్రమబద్ధమైన అడుగు ను సూచిస్తుంది. అంతేకాకుండా, దీనిలో గతంలో కంటే మరిన్ని అంశాలతో రాబోతుంది. దీనిలో భాగంగా ఒక స్పోర్టి టచ్ తో పాటు డ్రైవింగ్ లో సౌకర్యాన్ని అందిస్తుంది.  డైమ్లెర్ ఏజీ యొక్క నిర్వహణ బోర్డు సభ్యుడు మరియు గ్రూప్ రీసెర్చ్ మరియు మెర్సెడెజ్-బెంజ్ కార్స్ డెవెలప్మెంట్ మేనేజర్ అయిన థామస్ వెబెర్ మాట్లాడుతూ, ఇది రోడ్ పై అందరిని ఆకట్టుకుంటుంది. ఈ కొత్త డిజైన్ మరియు పరికరాలు వినియోగదారులను ఆకర్షింపచేస్తాయి అని అన్నారు. 


ఈ జిఎల్ సి ను క్రింది ఇంజిన్ ఎంపికలతో విడుదల చేశారు:

  • జిఎల్ సి 220 డి 4మ్యాటిక్ (170 HP / 400 nm)
  • జిఎల్ సి 250 డి 4మ్యాటిక్ (204 HP / 500 nm)
  • జిఎల్ సి 250 4మ్యాటిక్ (211 HP / 350 nm)

వీటితో పాటు, జిఎల్ సి ఎ 4 మ్యాటిక్ ను కూడా బహిర్గతం చేశారు. ఈ వాహనం లో హైబ్రిడ్ ప్లగ్ ఇన్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ అత్యధికంగా 211bhp పవర్ ను పెట్రోల్ మోడ్ లో ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎలెక్ట్రిక్ మోడ్ లో 116bhp పవర్ ను విడుదల చేస్తుంది. ఈ మెర్సిడెస్ యొక్క అన్ని వేరియంట్లలో 4 మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ అనేది ప్రామాణిక అంశం అని చెప్పవచ్చు.

ఈ జిఎల్ సి ముందు భాగానికి వస్తే, సి-క్లాస్ ఎస్క్ హెడ్ల్యాంప్స్, ఒక మేసివ్ ట్విన్ స్లేటెడ్ గ్రిల్ వంటివి అమర్చబడి ఉంటాయి. దీనిలో అధిక మోత్తం లో నాణ్యత కలిగిన క్రోం ను ఉపయోగిస్తారు. ఈ జిఎల్ సి యొక్క వీల్బేస్ 118 మిల్లీమీటర్లు, అంటే అవుట్గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ. ఈ వాహనం లో వెండి రూఫ్ రైల్స్ బిగించి ఉంటాయి. దీని యొక్క వెనుక భాగం సాధరణంగా రాబోతుంది మరియు రేప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్ తో రాబోతుంది. బాహ్య అద్దాలకు మరియు రేర్ స్పోయిలర్ కు ఒక యాంటిన్నా అనుసంధానం చేయబడి ఉంటుంది.  

ఈ జిఎల్ సి లోపలి భాగాలు, జిఎల్ ఈ ను పోలి ఉంటాయి. వీటి యొక్క సీట్లు నెప్ప లెధర్ సీట్లతో అమర్చబడి ఉంటాయి. మరియు డాష్బోర్డ్ అంతటా చెక్క తొ ఎ అలంకరించబడి ఉంటుంది. సెంటర్ కన్సోల్ చాలా అందంగా మరియు ఒక సమాచార వ్యవస్థ, ఏసి వెంట్స్, క్లైమేట్ కంట్రోల్ వంతి అంశాలతో రాబోతుంది. జిఎల్ సి కమాండ్ వ్యవస్థ కోసం ఒక తచ్ ప్యాడ్ కూడా అందించబడుతుంది. ఈ టచ్ ప్యాడ్ లో సంఖ్యలు మరియు చేతిరాత లో ఎంటర్ చేయబడిన ప్రత్యేక అక్షరాలు అనుమతిస్తుంది- ఆడియో 20 లేదా కమాండ్ ఆన్లైన్ ద్వారా ఏ భాషలోనైనా మద్దతిస్తుంది. అదనంగా, హెడ్-అప్ డిస్ప్లే కూడా అందుబాటులో ఉండబోతుంది.

జర్మన్ వాళ్ళు భద్రత పరంగా గ్రిల్స్ ను పొందుపర్చారు. అంతేకాకుండా, కొల్లిజన్ ప్రివెన్షన్ అసిస్ట్ ప్లస్, క్రాస్విండ్ అసిస్ట్, హెడ్ల్యాంప్స్ అసిస్ట్ మరియు అటెన్షన్ అసిస్ట్ వంటి అంశాలను ప్రామాణికంగా అందించబడతాయి. డ్రైవింగ్ సహాయం ప్యాకేజీ టికింగ్ లో డిస్ట్రోనిక్ ప్లస్ తో పాటు స్టీరింగ్ అసిస్ట్ మరియు స్టాప్ & గో పైలెట్, ప్రీ సేఫ్ బ్రేక్ తో పాటు పెడిస్ట్రియన్ డిటెక్షన్ ఇతర భద్రతా సూచనలతో రాబోతుంది. 

ఈ కొత్త జిఎల్ సి వాహనం భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈ జిఎల్ సి వాహనం, బిఎండబ్ల్యూ ఎక్స్3 మరియు ఆడి క్యూ5 తో పోటీ పడటానికి రాబోతుంది. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience