రూ. 2.4 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ - AMG GT- S

modified on nov 24, 2015 04:15 pm by konark for మెర్సిడెస్ ఏఎంజి జిటి

  • 12 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ:

మెర్సిడెస్ బెంజ్ ఇండియా దాని ఫ్లాగ్‌షిప్ మోడల్ AMG GT- S ని రూ. 2.4 కోట్ల  ధర వద్ద  (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)లో ప్రారంభించింది.  ఇది ఈ ఏడాది ప్రారంభించబడుతున్న 5 వ ఏఎంజి. ఇది పూర్తిగా మెర్సిడెస్ AMG శాఖ చే అభివృద్ధి చేయబడినది. SLS AMG స్థానంలో ఈ సూపర్‌కారు కొత్త 4.0 లీటర్ ట్విన్ టర్బోV8 ఇంజిన్ చే అమర్చబడి 510ps శక్తిని మరియు 650Nm టార్క్ ని అందిస్తుంది.

ఈ పవర్‌ప్లాంట్ ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ యూనిట్ తో జత చేయబడి వెనుక చక్రాలకు శక్తిని పంపిస్తుంది. SLS లో చూసిన విధంగా గల్-వింగ్ డోర్స్ ని కలిగి ఉంటుంది మరియు ఇంజిన్ కూడా ఎమిజన్ నియమాలకి తగ్గట్టుగా ఉంటుంది.

ఈ సూపర్‌కారు ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ సస్పెన్షన్ తో ఒక అల్యూమినియంతో చేసినఫ్రేమ్ ఆధారంగా ఉంది. అలానే అడ్జస్టబుల్ డంపింగ్ ని ప్రామాణిక లక్షణంగా పొంది ఉంది. ఈ కారుఒక సుదీర్ఘ హుడ్ మరియు ఒక చిన్న సీటింగ్ కాక్పిట్ తో క్లాసిక్GT కారు రూపకల్పనని కలిగి ఉంది. లోపలివైపు, AMG GT S టెక్నాలజీ స్విచ్లు మరియు అల్యూమినియం ట్రింస్ తో ఫైటర్ జెట్ ని చాలా వరకూ పోలి ఉంది.

అలానే ఈ వాహనం సిరామిక్ బ్రేకులు, ఫోర్జెడ్ వీల్స్, డ్రై సంప్ లూబ్రికేషన్,డైనమిక్ సర్దుబాటు గల ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ మౌంట్స్ ని కలిగి ఉంది.

AMG GT S కేవలం 3.7 సెకన్లలో 100Kmph చేరుకోగలుగుతుంది మరియు 310kmph గరిష్ట వేగం వరకూ వెళ్ళగలదు. అద్భుతమైన ఏక్జిలరేషన్ తో ఇది చాలా అద్భుతమైన కారు.

ఇది 2015 లో జర్మన్ తయారీసంస్థ అందిస్తున్న 14 వ వాహనం. ఇది పోర్స్చే 911 టర్బో S, ఆడి R8 V10మరియు జాగ్వార్ F- టైప్R కూపే వంటి వాటితో పోటీ పడవచ్చు.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ AMG జిటి

Read Full News

trendingకన్వర్టిబుల్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience