చైనా లో జిఎల్‌సి యొక్క ప్రొడక్షన్ ప్రారంభించిన మెర్సిడెస్
నవంబర్ 02, 2015 06:07 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ క్లాస్ ఎస్యువి ని ఈ సంవత్సరం జూన్ లో జిఎల్‌కె మానికర్ కి బర్తీగా వెల్లడించింది. జర్మన్ తయారీదారులు బీజింగ్, చైనా లో ఈ ఎస్యువి యొక్క స్థానిక ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది స్వదేశంలో జర్మనీలో బ్రెమన్ తర్వాత రెండవ తయారీ ప్లాంట్. భారతదేశం గురించి మాట్లాడుకుంటే మెర్సిడెస్ బెంజ్ వచ్చే ఏడాది దీనిని పరిచయం చేయబడుతుందని భావిస్తున్నాము. జిఎల్‌కె ఎడమ చేతి డ్రైవ్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉండేది, అయితే ఈ జిఎల్‌సి రైట్ హ్యాండ్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంటుంది!
"బ్రెమన్ ప్లాంట్ వద్ద జిఎల్‌సి విజయవంతంగా ప్రారంభించబడిన తర్వాత, బీజింగ్ రెండవ నిర్మాణంగా సైట్ గా ఇప్పుడు అనుసరిస్తుంది. కొత్త అసెంబ్లీ సౌకర్యాలు మా అనువైన మరియు సమర్థవంతమైన ఉత్పత్తి నెట్వర్క్ లో ఆధునిక ఉత్పత్తి యొక్క అత్యధిక ప్రమాణాలను చేరుకోగలుగుతుంది. తద్వారా మేము ప్రపంచవ్యాప్తంగా మా మెర్సిడెస్-బెంజ్ కార్లలో అధిక నాణ్యత నిర్ధారించగలము. " అని మానుఫాక్చరింగ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డివిజనల్ బోర్డు మెర్సిడెస్-బెంజ్ కార్స్ సభ్యుడు, మార్కస్ స్కాఫెర్ తెలిపారు.
యాంత్రికంగా, వాహనం మెర్సిడెస్ బెంజ్ యొక్క శాశ్వత ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం 4 మాటిక్ తో ప్రామాణికంగా అందించబడుతుంది. అందుబాటులో ఇంజన్ ఎంపికలలో 2 డీజిల్ మరియు ఒక హైబ్రిడ్ వెర్షన్ తో పాటు పెట్రోల్ ఇంజిన్ అందించబడతాయి. భారతదేశం లో పరిచయం చేసినప్పుడు అది ఆడీ క్యు5, బిఎండబ్లు ఎక్స్3 మరియు వోల్వో ఎక్స్‌సి60 వంటి వాటితో పోటీ పడవచ్చు.