మారుతి విటారా బ్రెస్జా vs హోండా WR-V టాటా నెక్సన్ vs: రియల్ వరల్డ్ పెర్ఫామెన్స్ & మైలేజ్
ఏప్రిల్ 18, 2019 02:42 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- 22 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ రోజుల్లో సబ్ 4m SUV లు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ కార్లు హాచ్బ్యాక్లతో పోల్చినప్పుడు ఎక్కువ కమాండింగ్ హై సెట్ డ్రైవింగ్ స్థానాలను అందిస్తాయి, ఇంధన సమర్థవంతమైనవి, మరింత ప్రాక్టికల్ గా ఉంటాయి మరియు ఇప్పటికీ అవి అందుకోలనంత ఖరీదుగా కూడా ఉండవు. మీరు రోజువారీ ప్రయాణం కోసం ఒక డీజిల్ కారు ని కొనుగోలు చేసుకోవాలని మార్కెట్ లో ఉంటే, మేము మీకు సహాయపడేందుకు ప్రముఖ సబ్ 4m SUV లు అయిన విటారా బ్రజ్జా, నెక్సాన్, మరియు WR-V ఈ మూడు కార్లు యొక్క రియల్ వరల్డ్ పనితీరు డేటా కలిగి ఉన్నాము. తద్వారా మీరు మూడిటిని పోల్చుకొని చూసుకోవచ్చు.
ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్ పరీక్షలు: నెక్సాన్ కారు త్వరిత రోల్ -ఆన్ టైంస్ తో ఆకట్టుకుంటుంది
0-100Kmph ఆక్సిలరేషన్ టెస్ట్ లో మారుతి విటారా బ్రెజ్జా 12.36s టైం తో ముందంజలో ఉంది, తరువాత దానికి కొంచెం దగ్గరగా WR-V 12.43s టైం తో రెండవ స్థానంలో ఉంది. దాని తరువాత నెక్సా కారు 13.25 సెకెన్స్ తో మూడవ స్థానంలో ఉంది.
కానీ మనలో చాలామందికి 0-100Kmph మార్క్ లో త్వరిత వేగం ఉండే కారు కాదు కావలసింది. దానికి బదులుగా సిటీ స్పీడ్ లో వేగవంతమైనది కావాలి. ఇందులో నెక్సా కారు మెరిసిపోతుందని చెప్పాలి.
టాటా నెక్సన్ యొక్క 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 1500rpm నుండి 260Nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ టార్క్ దాని పోటీదారులయిన రెండు కార్ల కంటే 60Nm ఎక్కువగా ఉంటుంది మరియు 250 ఆక్సిలరేషన్ తో తక్కువగా వస్తుంది. దీనివలన నెక్సా కారు థీరీ మరియు ప్రాక్టికల్ రెండిటినీ గెలుచుకుంది. ఇది 30Kmph మరియు 40Kmph వంటి స్పీడ్ లలో బ్రజ్జా మరియు WR-V రెండింటి కంటే వేగంగా ఉంటుంది. అదే 40Kmph నుండి 100Kmph లో, నెక్సాన్ కారు బ్రెజ్జా కంటే 2 సెకన్లు వేగంగా ఉంది!
టాటా నెక్సాన్:
కారు |
0-100kmph |
30-80kmph |
40-100kmph |
మారుతి బ్రెజ్జా |
12.36s |
8.58s |
15.68s |
హోండా WR-V |
12.43s |
8.89s |
14.22s |
టాటా నెక్సాన్ |
13.25s |
7.82s |
13.35s |
బ్రేకింగ్ టెస్ట్: టాటా మళ్లీ ఆధిక్యంలో ఉంది
ఈ మూడు సబ్-4m కార్లు కూడా ముందు భాగంలో డిస్క్ బ్రేకులు మరియు వెనుక భాగంలో డ్రం బ్రేకులు కలిగి ఉన్నాయి. కానీ బ్రేకింగ్ టెస్ట్ లో 100Kmph లో 2.96 సెకెన్స్ టైం తో నెక్సాన్ ఉత్తమ ప్రదర్శనగా ఉంది. ఇతర రెండు కార్లు ఈ టెస్ట్ లో 3s పైగా సమయం తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా, నెక్సాన్ 41.58m కనీస దూరాన్ని నిర్వహిస్తుంది.
కారు |
100-0kmph |
80-0kmph |
మారుతి బ్రెజ్జా |
44.05m |
27.67m |
హోండా WR-V |
41.90m |
26.38m |
టాటా నెక్సాన్ |
41.58s |
26.34m |
ఇంధన సామర్ధ్యం పరీక్ష: బ్రెజ్జా నగరం లోపల చాలా పొదుపుగా ఉంది
డీజిల్-ఆధారిత బ్రజ్జా, WR-V మరియు కార్ల యొక్క డీజిల్ గణాంకాలని పరిగణలోనికి తీసుకుంటే హోండా WR-V 25.5Kmpl ఇంధన సామర్ధ్యం అందిస్తూ ఉత్తమంగా ఉంది. దాని తరువాత స్థానంలో బ్రెజ్జా ఉంటూ 24.3Kmpl మైలేజ్ ని అందిస్తుంది మరియు నెక్సా 21.5Kmpl మైలేజ్ అందిస్తుంది. హైవే పై మీద కూడా WR-V 25.88Kmpl మైలేజ్ ని అందిస్తూ ముందంజలోనే ఉంది. అయితే, రెండు కార్లు కూడా మరీ వెనక్కి లేవు, బ్రెజ్జా 25.3Kmpl మైలేజ్ ని అందిస్తుంది మరియు నెక్సాన్ 23.97Kmpl మైలేజ్ ని అందిస్తుంది.
హోండా WR-V:
అయితే సిటీ లో పూర్తిగా ఇది భిన్నంగా ఉంటుంది, బ్రజ్జా 21.7Kmpl మైలేజ్ ని అందిస్తుంది. WR-V కారు 15.35Kmpl మైలేజ్ అందిస్తుంది మరియు నెక్సా 16.8Kmpl మైలేజ్ ని అందిస్తుంది. మీరు సిటీ లోపల ఎక్కువగా డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడి మరియు మంచి మైలేజ్ ని అందించే సబ్-కాంపాక్ట్ SUV కోసం చూసినట్లయితే బ్రెజ్జా మంచి ఎంపికగా నిలుస్తుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా:
కారు |
సిటీ ఇంధన సామర్ధ్యం |
హైవే ఇంధన సామర్ధ్యం |
క్లైమెడ్ ఫ్యుయల్ ఎఫిషియన్సీ |
మారుతి బ్రేజ్జా |
21.7kmpl |
25.3kmpl |
24.3kmpl |
హోండా WR-V |
15.35kmpl |
25.88kmpl |
25.5kmpl |
టాటా నెక్సన్ |
16.80kmpl |
23.97kmpl |
21.5kmpl |
ఈ మూడు SUV లలో ఏది కొనుగోలు చేస్తారు? ఇప్పటికీ అయోమయంగా ఉందా? ఇక్కడ బ్రెజ్జా Vs WR-V యొక్క వివరణాత్మక పోలిక నివేదిక ఉంది చదవండి.
నిర్దేశాలు:
కార్ |
ఇంజన్ డిస్ప్లేస్మెంట్ |
ట్రాన్స్మిషన్ |
గరిష్ట .పవర్ |
గరిష్ట . టార్క్ |
క్లైమెడ్ ఫ్యుయల్ ఎఫిషియన్సీ |
మారుతి బ్రేజ్జా |
1248cc |
5- స్పీడ్ మాన్యువల్ |
90PS @ 4000rpm |
200Nm @ 1750rpm |
24.3kmpl |
హోండా WR-V |
1498cc |
6- స్పీడ్ మాన్యువల్ |
100PS @ 3600rpm |
200Nm @ 1750rpm |
25.5kmpl |
టాటా నెక్సన్ |
1497cc |
6- స్పీడ్ మాన్యువల్ |
110PS @ 3750rpm |
260Nm @ 1500rpm |
21.5kmpl |