• English
    • Login / Register

    ఆటో ఎక్స్ؚపో 2023లో, 550 కిమీ పరిధి గల eVX ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ؚను మారుతి ఆవిష్కరించింది

    మారుతి ఈ విటారా కోసం sonny ద్వారా జనవరి 13, 2023 04:51 pm ప్రచురించబడింది

    • 44 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ వాహనం కొత్త EV-నిర్దిష్ట ప్లాట్ؚఫారంؚపై నిర్మించబడి, 2025 లోపు తొలిసారిగా మార్కెట్ؚలోకి రానుంది.

    Maruti eVX Concept at Auto Expo 2023

    ఎలక్ట్రిఫైయింగ్ eVX Concept, ఒక ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణతో, ఆటో ఎక్స్ؚపో 2023ను మారుతి గొప్పగా ప్రారంభించింది. ఇది పూర్తిగా సుజుకి వారు అభివృద్ధి చేసిన సరికొత్త ప్లాట్ؚఫారంؚపై నిర్మించబడి మరియు ఈ కారు తయారీదారు నుండి పూర్తి శ్రేణి EVలను ఉత్పత్తి చేస్తుంది.

     

    eVX కాన్సెప్ట్ 60kWh బ్యాటరీ ప్యాక్ؚను కలిగి ఉండి, 550 కిమీ వరకు పరిధిని హామీ ఇస్తుంది. ఇది ధృడమైన మరియు బాక్సీ డిజైన్ కలయికతో కొత్త Grand Vitara వలె కాంపాక్ట్ SUVగా ఉంటుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ؚతో, ఏరో-ఆప్టిమైజ్డ్ؚగా మెరుగు పరచిన వీల్స్ؚతో eVX ఏరో డైనమిక్ؚగా సమర్ధమైన మరియు మృదువైన ప్రొఫైల్ؚను మనం చూడగలం. పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్ؚఫారం, క్యాబిన్ స్పేస్ؚను గరిష్టం చేయడానికి పొడవైన వీల్ؚబేస్ మరియు తక్కువ ఓవర్ؚహ్యాంగ్ؚకు వీలు కల్పిస్తుంది.

    Maruti eVX Concept at Auto Expo 2023

    eVX పని తీరు గురించి సుజుకి ఎక్కువగా వెల్లడించలేదు, కానీ ఇది 4X4 డ్రైవ్ؚట్రైన్ కోసం డ్యూయల్ మోటార్ సెట్అప్ కలిగి ఉంటుంది అని నిర్ధారించింది. evX కాన్సెప్ట్ ఇంటీరియర్ గురించి ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచారు, కానీ కనెక్టెడ్ సాంకేతికత మరియు మల్టిపుల్ లార్జ్ డిస్ప్లేలను కలిగి ఉండవచ్చు. 

     

    eVX కాన్సెప్ట్, 2025 నాటికి మార్కెట్‌లోకి అడుగుపెట్టే ఎలక్ట్రిక్ SUVల కనిపిస్తుంది. భారతదేశంలో బ్యాటరీలు మరియు EVల ఉత్పత్తి కోసం రూ. 100 బిలియన్ల పెట్టుబడి పెట్టడానికి సుజుకి మోటార్ కార్పొరేషన్ కట్టుబడి ఉంది, eVX స్థానికంగా తయారు చేయబడి మరియు రూ. 25 లక్షల ధరతో చవకైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV కావచ్చని సంకేతాలు ఇచ్చింది.

     

    Maruti eVX Concept at Auto Expo 2023
     

    ఇది Tata Nexon EV వంటి వాటికి ప్రీమియం ప్రత్యామ్నాయంగా ఉంటుంది, మరియు Hyundai Kona Electric మరియు MG ZS EVలతో పోటీ పడుతుంది.

    was this article helpful ?

    Write your Comment on Maruti ఈ విటారా

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience