మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2018: వేరియంట్స్ వివరణ

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం raunak ద్వారా ఏప్రిల్ 18, 2019 02:35 pm ప్రచురించబడింది

 • 23 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Vitara Brezza

 • మారుతి బ్రెజ్జా నాలుగు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది: LDI, VDI, ZDI మరియు ZDI +
 • ధర రూ .7.67 లక్షల నుండి రూ .10.64 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
 • AMT వేరియంట్స్  మాన్యువల్ వేరియంట్స్ కంటే రూ.50,000 ప్రీమియం ధరకే ఉంటుంది.

Maruti Suzuki Vitara Brezza

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా దేశంలో అత్యుత్తమంగా అమ్ముడయ్యే సబ్ -4m SUV ఇది డీజిల్ ఇంజిన్ తో మాత్రమే లభిస్తుంది, కానీ MT లేదా AMT తో అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి నాలుగు బ్రాండ్లలో LDI, VDI, ZDI మరియు ZDI + బ్రెజ్జా ని అందిస్తోంది. ఇవి రూ.7.67 లక్షల నుండి ప్రారంభమయ్యి 10.64 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ధరను కలిగి ఉంటుంది.  

ధరలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ):

మారుతి సుజుకి విటరా బ్రెజ్జా

మాన్యువల్

AMT

LDI

రూ. 7.67 లక్షలు

NA

VDI

రూ. 8.19 లక్షలు

రూ. 8.69 లక్షలు (+ 50 K)

ZDI

రూ. 8.96 లక్షలు

రూ. 9.46 లక్షలు (+ 50 K)

ZDI +

రూ. 9.92 లక్షలు

రూ. 10.42 లక్షలు (+ 50 K)

ZDI + డ్యూయల్ టోన్

రూ. 10.07 లక్షలు

రూ. 10.64 లక్షలు (+ 57 K)

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా LDI:

ధర: రూ. 7.67 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

భద్రతా లక్షణాలు: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS,ప్రీ టెన్ష్నర్ తో ఫ్రంట్ సీటు బెల్ట్స్ మరియు ఫోర్స్ లిమిటర్, ISOFIX  చైల్డ్ సీటు యాంకర్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు హై స్పీడ్ అలర్ట్

ఆడియో వ్యవస్థ: బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ తో డబుల్-డిన్ ఆడియో సిస్టమ్, USB మరియు ఆక్స్-ఇన్ తో పాటూ CD ప్లేబ్యాక్ ని కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ నాలుగు స్పీకర్ సిస్టమ్ తో జత చేయబడింది.

సౌకర్యవంతమైన లక్షణాలు: సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ (డ్రైవర్ ఆటో డౌన్),ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, మాన్యువల్ A.C మరియు పవర్ స్టీరింగ్.  

వీల్స్ మరియు టైర్లు: 16-అంగుళాల స్టీల్ రిమ్స్ మరియు 205/60 క్రాస్-సెక్షన్ టైర్లు

ప్రాథమిక లక్షణాలు మిస్ అయ్యాయి:

 •  వెనుక పవర్ విండోస్
 •  బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs
 •  రేర్ డీఫాగర్

ఇది కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?

చాలా కార్లు వలే, బేస్ LDI వేరియంట్ ఎవరైతే కొనుగోలుదారులు టైట్ బడ్జెట్లో ఉన్నారో మరియు వారు బ్రెజ్జా ని కొనుగోలు చేసుకుందామనుకుంటారో వారికి సిఫార్సు చేయబడుతుంది. ఇది ప్రాథమిక భద్రతా లక్షణాలను పొందుతుంది. వీటితో పాటు, మారుతి కనీస అవసరమైన అనుగుణమైన లక్షణాలను కలిగి ఉంది, ప్రత్యేకించి బ్లూటూత్-ఎనేబుల్ ఆడియో సిస్టమ్ ని కూడా.   

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా VDI

 

MT

AMT

VDI

రూ.8.19 లక్షలు

రూ. 8.69 లక్షలు

LDI పైన

రూ. 52,000

 

LDI మీద VDI కలిగి ఉండే లక్షణాలు:

సౌందర్య లక్షణాలు: బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, వీల్ క్యాప్స్ మరియు రూఫ్ రెయిల్స్

ఆడియో: LDI తో అందించబడిన అదే మ్యూజిక్ సిస్టమ్ రిమోట్ కంట్రోల్ తో పొందుతుంది

కంఫర్ట్ లక్షణాలు: వెనుక పవర్ విండోస్, డ్రైవర్ విండో ఆటో అప్ / డౌన్, వెనుక హెడ్ రెస్ట్లు, విద్యుత్ బూట్ రిలీజ్ మరియు కీలెస్ ఎంట్రీ

భద్రత: మారుతి యొక్క యాంటీ థెఫ్ట్ సిష్టం మరియు ఫైవ్-డోర్ సెంట్రల్ లాకింగ్(LDI బూట్లిడ్ ని మిస్ చేస్తుంది)

ప్రాధమిక లక్షణాలు మిస్ అయ్యింది:

 •  వెనుక డిఫేజర్

​​​​​​​

ఇది కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?

బేర్ బోన్స్ LDI తో పోలిస్తే VDI వేరియంట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, దీనికి గానూ దానిలో ఉండే సౌందర్య లక్షణాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అయినా కుడా మారుతి దీనికి ఎక్కువ స్థాయిలో ప్రీమియం వసూల్ చేస్తుందని మాకు అనిపిస్తుంది. మీరు మాన్యువల్ VDI వేరియంట్ ను పూర్తిగా దాటివేయవచ్చు. మరోవైపు, VDI AGS a.k.a AMT, ఎవరైతే తగిన బడ్జెట్ లో ఆటోమేటిక్ సబ్ 4m  SUV కోసం చూస్తున్నారో వారికి ఇది సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే ఇది ప్రస్తుతం సెగ్మెంట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అత్యంత సరసమైన సమర్పణగా ఉంది. AMT ఆప్షన్ సుమారు రూ. 50,000 ప్రీమియంను ఆకర్షిస్తుంది, ఇది ఆటోమేటెడ్ ఆంట్ కొరకు ఛార్జ్ చేసిన సాధారణ మొత్తంగా చెప్పుకోవచ్చు.  

Maruti Vitara Brezza AMT

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ZDI (డబ్బుకు తగ్గ విలువైనది)

 

MT

AMT

ZDI

రూ.8.96 లక్షలు

రూ.9.46 లక్షలు

VDI మీద

రూ.77,000

రూ.77,000

VDI పై, ZDI అందించే లక్షణాలు:

వీల్స్ మరియు టైర్స్: 215 / 60mm టైర్లతో 16-ఇంచ్ గ్లోసీ బ్లాక్ ఫినిష్ అలాయ్స్

సౌందర్యాలు: హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, గన్ మెటల్ ఫినిష్ రూఫ్ రెయిల్స్, LED ఎలిమెంట్స్ తో టెయిల్ ల్యాంప్స్, గ్లోసీ బ్లాక్ క్యాబిన్ ఇన్సర్ట్స్ మరియు మూడ్ లైటింగ్ తో ఇన్స్టృమెంటల్ క్లస్టర్   

ఆడియో మరియు కాలింగ్ కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్,డ్రైవర్ యొక్క సీటు కోసం ఎత్తు సర్దుబాటు, 60:40 స్పిల్ట్ రేర్ సీటు,లగేజ్ బే కోసం ఇల్లూమినేషన్,ఫుట్ వెల్ మరియు గ్లోవ్ బాక్స్ మరియు రేర్ ఆర్మ్రెస్ట్  

భద్రత: డెమిస్టర్ తో వెనుక వాషర్ మరియు వైపర్

ఇది కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?

మీరు వాణిజ్యపరంగా చూసే విటారా బ్రెజ్జా యొక్క స్పోర్టి స్టైలింగ్ ను ZDI పూర్తి చేస్తుంది. అంతేకాకుండా, VDI పైన దీని అధనపు ధర సమర్ధనీయమైనదిగా ఉంటుంది, అదనపు లక్షణాలకు గానూ న్యాయం చేస్తుంది. లోపల భాగాలలో కూడా, ZDI ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి అదనపు లక్షణాలతో వస్తుంది. మా పుస్తకాలలో, VDI వేరియంట్ పై ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే బ్రెజ్జా యొక్క లైనప్ లో  ZDI అత్యంత విలువైనదిగా కనిపిస్తుంది. ఆంట్ వెర్షన్ కూడా 10 లక్షలు కంటే తక్కువగానే ఉంది, దీనివలన దాని పోటీదారులు అయిన నెక్సాన్ AMT మరియు TUV 300 కంటే తక్కువ ఖరీదు కలిగి ఉంది.  

మారుతి సుజుకి విటర బ్రెజ్జా  ZDI +

 

MT

AMT

ZDI+

రూ. 9.92 లక్షలు

రూ. 10.42 లక్షలు

ZDI మీద

రూ. 96,000

రూ. 96,000

ZDI మీద, ZDI + అందించే లక్షణాలు:

ఆడియో వ్యవస్థ: ఆపిల్ కార్ప్లే,గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్లతో 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలాగే బిల్ట్-ఇన్ నావిగేషన్ మరియు బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు వాయిస్ కమాండ్ ఇంపుట్స్ తో కూడా వస్తుంది. ఈ యూనిట్ ఇప్పటికే ఉన్న నాలుగు స్పీకర్ సెటప్ కాకుండా రెండు అదనపు ట్వీట్లను పొందుతుంది. అలాగే దీనిలో యాప్-ఆధారిత రిమోట్ కూడా ఉంది.

Maruti Suzuki Vitara Brezza

సౌకర్య లక్షణాలు: రివర్స్ పార్కింగ్ కెమేరా,పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీ, క్రూయిస్ కంట్రోల్ (మాన్యువల్ లో మాత్రమే ), రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, ఆటో ఫోల్డబుల్ ORVMలు,కూలెడ్ గ్లోవ్ బాక్స్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ మరియు హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీటు బెల్ట్స్.

Maruti Suzuki Vitara Brezza

కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?

ZDI మరియు ZDI + రెండూ కూడా ఒకేలా కనిపిస్తాయి, రెండవది లోపల భాగాలలో చాలా ప్రీమియం లక్షణాలతో కలిసి మంచి లుక్ ని ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ZDI పైన 1 లక్ష దగ్గర ప్రీమియం దాని లక్షణాలకు న్యాయం చేస్తుంది. ముందు చెప్పుకున్నట్లు మీకు ఎటువంటి బడ్జెట్ పరిధులు లేకపోతే మీరు టాప్ వేరియంట్ కి వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో ప్రతీ ఒక లక్షణం ఉంది, ఈ రోజుల్లో సబ్-4m SUV ల రోజుల్లో స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ తో అందించబడుతుంది.

ముఖ్యమైనవి:

Maruti Suzuki Vitara Brezza

Maruti Suzuki Vitara Brezza

 

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience