• English
  • Login / Register

విటారా బ్రెజ్జా ను బహిర్గతం చేసిన మారుతి సుజుకి

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం raunak ద్వారా జనవరి 21, 2016 05:37 pm సవరించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

విటారా బ్రెజ్జా, మారుతి సుజుకి ద్వారా పూర్తిగా అంతర్గత రూపకల్పన చేయబడింది మరియు ఇది, ఆటో ఎక్స్పో 2016 వద్ద తన మొదటి ప్రపంచ ప్రదర్శన తర్వాత కొన్ని వారాల లో ప్రారంభించబడుతుంది.

రాబోయే ఆటో ఎక్స్పో ద్వారా మారుతి, కాంపాక్ట్ ఎస్యువి యొక్క మొట్ట మొదటి లుక్ ను తిరిగి బహిర్గతం చేయనుంది. మారుతి ద్వారా రాబోయే ఈ వాహనం, చాలా ఎక్కువగా ఎదురుచూస్తున్న వాహనంగా ఉంది. మరియు ఈ వాహనం, ఇదే విభాగంలో ఉన్న మహింద్రా టియువి 300 వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ధరలు గురించి మాట్లాడటానికి వస్తే, ఈ విటారా బ్రెజ్జా యొక్క ధర ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనం కంటే తక్కువగా ఉండబోతుంది. ఈ విటారా బ్రెజ్జా వాహనం ఎక్స్పో వద్ద బహిర్గతం అయిన తర్వాత కొన్ని వారాల లో ప్రారంభించబడుతుంది అని మారుతి వెల్లడించింది. ఈ వాహనాలు, 2016 మార్చి లోగా షోరూం లను చేరుకోవచ్చునని భావిస్తున్నారు. 
మారుతి వాహనం దేశంలోపల అభివృద్ధి చేయబడింది అని చెప్పాడు. ఈ వాహనం యొక్క డిజైన్, స్విఫ్ట్ మరియు కొత్త విటారా నుంచి ప్రేరణ చాలా వరకు తీసుకుంది. ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక ప్రొఫైళ్ళు కొత్త విటారా ను ప్రతిబింబిస్తాయి అలాగే ప్రముఖ ఫ్లోటింగ్ రూఫ్, స్విఫ్ట్ వాహనాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా, వివిధ టీజర్ చిత్రాలను చూసినట్లైతే విటారా బ్రెజ్జా సొగసైన గ్రిల్ ను కలిగి ఉంటుంది. దీనికి ఇరువైపులా ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లను మరియు ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్లను కలిగిన హెడ్ లైట్ క్లస్టర్లు అందించబడతాయి. తయారీదారుడు ఈ వాహనానికి సంబందించి మరొక విషయాన్ని కూడా బహిర్గతం చేశాడు. అది ఏమిటంటే, ఈ వాహనం యొక్క స్క్వేరిష్ వీల్ ఆర్చులకు 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను అందించాడు.

 

ఈ వాహనానికి, ప్రస్తుతం ఉన్న వాహనాల నుండి ఇంజన్ లను తీసుకోవడం జరిగింది. ఈ వాహనానికి పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ లను అందించడం జరిగింది. అవి వరుసగా, 1.2 లీటర్ విటి విటి పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డి డి ఐ ఎస్ 200 తో ఎస్ హెచ్ వి ఎస్ (మిడ్ హైబ్రిడ్) డీజిల్ ఇంజన్. ఈ వాహనానికి, సుజుకి యొక్క మిడ్ హైబ్రిడ్ ఎస్ హెచ్ వి ఎస్ టెక్నాలజీ ను గనుక అందించినట్లైతే, డీజిల్ ఇంజన్ ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు విషయానికి వస్తే, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా అందించబడుతుంది. అయితే సివిటి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, మారుతి బాలెనో నుండి తీసుకోబడినది.

ఇది కూడా చదవండి:

మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2016 లైనప్ ని ప్రకటించింది​

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience