మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2016 లైనప్ ని ప్రకటించింది
జనవరి 20, 2016 11:47 am raunak ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సంస్థ ఈ సంవత్సరాన్ని మార్పులు మరియు నవీకరణల సంవత్సరంగా చెప్తుంది. ఈ సమయం మారుతి సంస్థకి 'ట్రాన్స్ఫార్మేషన్' సమయం. ఇది ఇప్పుడు మారుతి సుజుకి 2.0 గా ఉంది! 2.0 ఎందుకంటే, సంస్థ వివిధ విభాగాలలో ఒక ఊపు ఊపేందుకు ఇప్పటికే ఉత్పత్తులు మరియు నెక్సా అనుభవంతో పాటు కొత్త టెక్నాలజీలు మరియు ఉత్పత్తుల విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి సంస్థ 1.0 లీటర్ Boosterjet ఇంజిన్ తో అమర్చబడియున్న బాలెనో RS తో పాటు విటారా బ్రెజా మరియు ఇగ్నీస్ అను రెండు కొత్త SUVs/క్రాసోవర్ లను ప్రదర్శించనున్నది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా
ఇది మారుతి సుజికి యొక్క మొదటి కాంపాక్ట్ ఎస్యువి మరియు ఇది ఢిల్లీ ఆటో ఎక్స్పో వద్ద ఫిబ్రవరి 3 2016, న దాని ప్రపంచ ప్రీమియర్ చేయనున్నది. ఇది సబ్-4 మీటర్ వాహనంగా ఊహించబడి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా TUV3OO కి వ్యతిరేకంగా పోటీ చేయవచ్చు. మారుతి సుజుకి సంస్థ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు LED డే టైం రన్నింగ్ లైట్స్ తో బై-జినాన్ ప్రొజెక్టర్లు వంటి వాటిని కలిగి ఉన్న విషయం తప్ప మిగిలినవి ఏవీ బహిర్గతం చేయలేదు. ఈ వాహనం ఎక్కువగా బాలెనో లక్షణాలతో పోలి ఉండవచ్చు. యాంత్రికంగా ఇది ప్రస్తుత లైనప్ నుండి VTVT పెట్రోల్ మరియు 1.3 లీటర్ DDiS 200 డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంది. మారుతి సంస్థ బ్రెజ్జాలో 1.0l Boosterjet మరియు ఫోర్డ్ సంస్థ ఎకోస్పోర్ట్ లో 1.0l Ecoboost ని అందించే అవకాశాలు ఉన్నాయి.
కాన్సెప్ట్ ఇగ్నిస్
మహీంద్రా KUV100 తరువాత మైక్రో- SUV విభాగంలో వచ్చే తదుపరి ఉత్పత్తి మారుతి సుజుకి ఇగ్నిస్. ఇది 2015 టోక్యో మోటార్ షోలో తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేసింది. వాహనతయారీసంస్థ 2015 జెనీవా మోటార్ షో నుండి im4 కాన్సెప్ట్ వలే ఉన్న కాన్సెప్ట్ ఇగ్నిస్ ని ప్రదర్శించనున్నది. ఇది ఈ సంవత్సరం తర్వాత ప్రారంభించబడవచ్చు మరియు మహీంద్రా KUV100 అటువంటి తరహాలోనే ధర కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. యాంత్రికంగా, ఇది భారతదేశం లో, స్విఫ్ట్ / బాలెనో వంటి వాహనాలతో ఇంజిన్లను పంచుకుంటుంది.
బాలెనో RS
మారుతిసంస్థ బాలెనో RSగా నామకరణం చేయబడిన బాలెనో యొక్క స్పోర్టీరియర్ వెర్షన్ ని కూడా ప్రదర్శించనున్నది. ఇది సుజుకి యొక్క క్రొత్త 1.0 లీటర్ Boosterjet టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో ఆధారితం చేయబడుతుంది. ఇది తదుపరి ఎప్పుడో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు మరియు ఇది వోక్స్వేగన్ పొలో జిటి టిఎస్ఐ మరియు అబార్త్ పుంటో వంటి వాటికి పోటీగా ఉండవచ్చు.
ఇంకా చదవండి2015TokyoMotorShowLive: సుజుకి ఇగ్నీస్ ప్రపంచ ప్రదర్శన చేసింది!