• English
    • Login / Register

    విడుదలకు ముందుగానే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన స్పష్టమైన మారుతి ఇన్విక్టో చిత్రాలు

    మారుతి ఇన్విక్టో కోసం rohit ద్వారా జూన్ 26, 2023 12:58 pm ప్రచురించబడింది

    • 62 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    టయోటా ఇన్నోవా హైక్రాస్ؚఫీచర్‌లు మరియు పవర్‌ట్రెయిన్ؚలను పంచుకొనున్న మారుతి ఇన్విక్టో

    Maruti Invicto spied

    • ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడిన మారుతి ఇన్విక్టో లుక్ పరంగా తేడాలు పొందనుంది.

    • రూ.25,000కు,ఈ MPV బుకింగ్ؚలను ప్రారంభించిన మారుతి.

    • కొత్త చిత్రాలలో, క్రోమ్ శ్లాబ్ؚలతో సరికొత్త డిజైన్ గల గ్రిల్ మరియు టెయిల్ లైట్‌ల లోపల అండర్‌లైనింగ్ؚమరియు ట్రై-పీస్ LED ఎలిమెంట్లను చూడవచ్చు. 

    • భిన్నమైన అలాయ్ వీల్స్ؚను కుండ పొందింది మరియు టెయిల్ؚగేట్‌పై వేరియెంట్ బ్యాడ్జ్ పొందడం లేదు.

    • లోపలి భాగంలో గమనించదగిన ఒకే మార్పు, టయోటా MPVలోని ట్యాన్ అప్ؚహోల్ؚస్ట్రీకి బదులుగా నలుపు రంగు థీమ్‌తో వస్తుంది.

    • 2-లీటర్‌ల బలమైన-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో మాత్రమే వస్తుందని తెలుస్తోంది.

    • ఫీచర్‌లలో10-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్-జోన్ AC మరియు 360-డిగ్రీల కెమెరాలు ఉండవచ్చు.

    టయోటా ఇన్నోవా హైక్రాస్-ఆధారిత మారుతి ఇన్విక్టో కేవలం 10 రోజులలో విడుదల కానుంది. రూ. 25,000 ముందస్తు ధరను చెల్లించి దీన్నీ ప్రస్తుతం బుక్ చేసుకోవచ్చు,ఈ వాహనం జూలై 5న విడుదల కానుంది. ధరను ప్రకటించే ముందు, ఈ ప్రీమియం మారుతి MPV మళ్ళీ ఎటువంటి ముసుగు లేకుండా కనిపించింది, ఈసారి దీని డిజైన్ స్పష్టంగా కనిపించింది.

    లుక్ పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా?

    మారుతి MPV తెలుపు రంగులో కనిపించింది, ఇన్విక్టో మరియు ఇన్నోవా హైక్రాస్ؚల మధ్య ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా సర్దుబాటు చేసిన గ్రిల్. ఇది ప్రస్తుతం ట్విన్ క్రోమ్ స్లాట్ؚలు మరియు మందమైన క్రోమ్ అండర్‌లైనింగ్‌తో వస్తుంది.చిత్రాలలో ఇన్విక్టో మోడల్‌లో ఫాగ్ ల్యాంపులు మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ కనిపించలేదు కాబట్టి ఇది లోయర్ వేరియెంట్ అయ్యి ఉండవచ్చు అని అంచనా,ఈ ఫీచర్‌లు టాప్-స్పెక్ ఇన్నోవా హైక్రాస్ؚలో ఉన్నాయి.

    Maruti Invicto rear spied

    ఇన్విక్టో భిన్నమైన అలాయ్ వీల్స్‌ సెట్‌ను కూడా పొందుతుంది,కానీ ప్రొఫైల్పరంగా ఎటువంటి మార్పులు లేవు. వెనుక భాగంలో,ఆధునిక నెక్సా వాహనాలలో ఉన్నట్లుగాLED టెయిల్‌లైట్‌లలో ట్రై-పీస్ ఎలిమెంట్ؚను గమనించవచ్చు. మిగిలిన వెనుక భాగంలో మరే ఇతర మార్పులు లేవు (‘ఇన్విక్టో’స్టిక్కర్ జోడింపు మినహహించి). దీని తోటిటయోటావాహనంలో ఉన్నట్లుగా వేరియెంట్ బ్యాడ్జ్ కూడా ఇందులో లేదు.

    క్యాబిన్ లోపల తేడాలు

    Maruti Invicto seats

    మారుతి నెక్సా కార్‌లలో ప్రధానంగా కనిపించే పూర్తి నలుపు రంగు క్యాబిన్ థీమ్‌ను ఇన్విక్టోలో కూడా కొనసాగించారు (సరికొత్త టీజర్ ఒక దానిలో ఇది నిర్ధారించబడింది). ఇంటీరియర్ పరంగా ఈ రెండు MPVలు ఏకరితీగా ఉంటాయని అంచనా.

    హైక్రాస్ؚలో ఉన్న డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 10-అంగుళాల టచ్ؚస్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, రెండవ వరుస కెప్టెన్ సీట్‌లలో ఒట్టోమాన్ ఫంక్షన్ వంటి హైక్రాస్ ఫీచర్‌లను మారుతి ఇన్విక్టోలో అందిస్తుందని అంచనా. 

    భద్రత విషయంలో, ఇన్విక్టోలో గరిష్టంగాఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు మరియు 360-డిగ్రీల కెమెరా ఉంటాయని అంచనా. హైక్రాస్ ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ؚలు) ఫీచర్‌ను కలిగి ఉంది కానీ ఇన్విక్టో యూనిట్ؚలో ఇది ఉన్నట్లు చిత్రాలలో కనిపించలేదు.

    ఇది కూడా చూడండి:ప్రారంభమైన మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV టెస్టింగ్, త్వరలో తెలియనున్న ఇంటీరియర్ వివరాలు

    స్ట్రాంగ్-హైబ్రిడ్ మాత్రమే 

    నివేదికలు మరియు డీలర్‌ల నుండి అందిన సమాచారం ప్రకారం, ఇన్విక్టోను కేవలం ఇన్నోవా హైక్రాస్ؚలో ఉన్న 184PS పవర్ 2-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్‌తో మాత్రమే అందిస్తున్నారు. ఇది e-CVT గేర్ బాక్స్‌తో వస్తుంది మరియు 21.1kmplమైలేజ్‌ను అందిస్తుందని అంచనా.

    అయితే, పూర్తి ఫీచర్‌లతో ఒకే ఒక వేరియంట్‌లోబుకింగ్‌లకు అందుబాటులో ఉంటుందని వచ్చిన మునపటి నివేదికలతో పోలిస్తే ఈ రహస్య చిత్రాలలో వ్యత్యాసం కనిపిస్తుంది.ధరను తగ్గించడానికి, ఈ విధంగా లేదా టయోటా MPV ఎక్విప్మెంట్ జాబితాలో తేలికపాటి మార్పులతో ఇన్విక్టోMPVని అందించవచ్చు 

    ధరలు మరియు పోటీదారులు

    Maruti Invicto teaser

    కేవలం హైబ్రిడ్ మోడల్‌గా అందిస్తే,మారుతితమ ప్రీమియం ఇన్విక్టో MPV ధరను రూ.22 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయిస్తుందని అంచనా. టయోటా ఇన్నోవా హైక్రాస్దీని ప్రత్యక్ష పోటీదారుగా నిలుస్తుంది,MPV విభాగంలో ఇది మారుతి XL6 మరియు కియా కేరెన్స్వంటి వాటి కంటే ఎగువ స్థానంలో ఉంటుంది.

    చిత్రం మూలం

    was this article helpful ?

    Write your Comment on Maruti ఇన్విక్టో

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience