విడుదలకు ముందే అనధికారికంగా కనిపించిన మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్

ప్రచురించబడుట పైన Feb 16, 2016 10:50 AM ద్వారా Manish for మారుతి Vitara Brezza

  • 8 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Brezza VDi

మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్యూవీ ఈ సంవత్సరం భారతదేశంలో ప్రారంభం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారు ప్రారంభానికి ముందే ఎంతగానో ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్యువి యొక్క బేస్ వేరియంట్ అనధికారికంగా కనిపించింది.  బ్రెజ్జా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ తో మీరు ఆకర్షితులైతే గనుక, ఈ కారు యొక్క భిన్నమైన రంగు పధకం టాప్ రేంజ్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లు భావిస్తున్నారా? అప్పుడు ఈ చిత్రాలను చూస్తే ఈ రాబోయే ఎస్యువి యొక్క వేరియంట్ల తేడాలు తెలుస్తాయి. 

Maruti Suzuki Brezza

బ్రెజ్జా వాహనం ఒకే ఒక డీజిల్ యూనిట్ తో అందించబడుతుంది, అది DDiS200 ఫియాట్ సోర్సెడ్ మిల్ 90PS శక్తిని అందిస్తుంది. ఈ కారు రూ.5.3 లక్షల నుండి మొదలయ్యి అగ్ర శ్రేణి వేరియంట్ రూ.8 లక్షల వరకూ ధరను కలిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ కారు డీజిల్ వేరియంట్లలో మాత్రమే అందించబడుతుంది మరియు నెక్సా కి బదులుగా మారుతి యొక్క డీలర్షిప్ లో అమ్మకం చేయబడుతుంది. ఈ కారు యొక్క చిత్రాలను చూసినట్లయితే ఇది బ్రెజ్జా యొక్క LDI వేరియంట్ అని తెలుస్తుంది. ఈ కారు యొక్క వేరియంట్ వైజ్ లక్షణాలు లీక్ అవ్వడంతో, ఈ మోడల్ యొక్క సబ్ 4 మీటర్ ఎస్యువి డ్రైవర్ సైడ్ ఎయిర్బ్యాగ్స్ తో ప్రామాణికంగా మరియు EBD తో ABS మరియు అధనపు ఆప్ష్నల్ ప్యాసింజర్ సైడ్ ఎయిర్బ్యాగ్స్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఈ కారు వచ్చే నెల ప్రారంభించబడుతుందని ఊహించడమయ్యింది మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా TUV300  తో పోటీ పడుతుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మారుతి Vitara Brezza

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?