• English
  • Login / Register

మహీంద్రా XUV500: పాతది Vs కొత్తది -ప్రధాన వ్యత్యాసం

మహీంద్రా ఎక్స్యూవి500 కోసం dinesh ద్వారా మార్చి 12, 2019 10:15 am ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra XUV500 Old vs New

నవీకరించబడిన XUV500 డిజైన్ లో చిన్న చిన్న మార్పులు కలిగి ఉంది మరియు మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. మహీంద్రా భారతదేశం లో XUV500 ఫేస్లిఫ్ట్ ని ప్రారంభించింది.ఇది 2011 లో ప్రవేశపెట్టినప్పటి నుంచి మహీంద్రా యొక్క ఫ్లాగ్షిప్ SUVని సాధించిన రెండో ఫేస్లిఫ్ట్ ఇది. పాత మోడల్ నుండి వేరుగా ఉంచడానికి, మహీంద్రా ఒక ప్రధాన మెకానికల్ తో పాటు XUV500 కు వివిధ సౌందర్య నవీకరణలను ఇచ్చింది. ఏమిటి అవి? తెలుసుకోవడానికి చదవండి.

బయటభాగాలు:

Mahindra XUV500 Old vs New

స్టైలింగ్ పరంగా, XUV500 అనేది అవుట్గోయింగ్ మోడల్ ను ఎక్కువగా పోలి ఉంటుంది, అయినా కూడా పాత దానికంటే భిన్నంగా ఉండడానికి కావలసినన్ని మార్పులు కలిగి ఉంది. దీనిలో ముందర భాగానికి వస్తే,విష్కర్ గ్రిల్ మార్చబడి స్టడ్డెడ్ మెష్ అమరిక ద్వారా కొత్త క్రోం భర్తీ చేయబడింది. బంపర్ కూడా పునఃరూపకల్పన చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ తో కొత్తగా ఉంది మరియు పెద్ద సెంట్రల్ ఎయిర్‌డాం గ్రిల్ తో కలిసిపోయినట్టుగా ఉండి SUV కి ఒక గంభీరమైన లుక్ ని ఇస్తుంది. హెడ్‌ల్యాంప్స్ కొద్దిగా మార్చడం జరిగింది మరియు  LED DRLS లతో కొత్త లేఅవుట్ తో ఉన్నాయి. వెనుకవైపు, మార్పులు మరింత విలక్షణమైనవి. అంతకు ముందు ఉన్న వర్టికల్ టెయిల్‌ల్యాంప్స్ మార్చబడి కొత్త ట్రైయాంగ్యులర్ వ్రాపరౌండ్ యూనిట్స్ అమర్చడం జరిగింది. టెయిల్‌గేట్ కూడా కొత్తది మరియు నంబర్ ప్లేట్ మీద క్రోం చేరికలను కలిగి ఉంది. కారు యొక్క ప్రక్క భాగం గురించి మాట్లాడుకుంటే, డోర్ క్రింద క్రోం ట్రిం అనేది పాతదానిలానే ఉంది. దీనికి కొత్త 17 ఇంచ్ అలాయ్స్ వీల్స్ ఉన్నాయి మరియు దానితో పాటూ 18 ఇంచ్ అలాయ్ ఆప్షన్ కూడా ఉంది.    

కొలతలు

Mahindra XUV500 Old vs New

కొత్త XU500 కేవలం ఒక ఫేస్లిఫ్ట్. దాని కొలతలు 4585mm x 1890mm x1785mm (LxWxH) వద్ద పాత నమూనాకు సమానంగా ఉంటాయి.ఊహించిన విధంగా, కారు లోపలి స్థలం అలాగే ఉంటుంది.

లోపల భాగాలు:

Mahindra XUV500 Old vs New

లోపల భాగాలకు వస్తే, ప్రాథమిక కాబిన్ లేఅవుట్ మారలేదు. ఏమి మార్చబడింది అంటే, వాటికి ఉపయోగించే కలర్స్ మరియు మెటీరియల్స్. దీని డాష్‌బోర్డ్ పాత దానిలో ఉండేటటువంటి మాట్టే బ్లాక్ మరియు బీజ్ రంగులకు బదులుగా కొత్తదానిలో అన్నినలుపు మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ తో వ్రాప్ చేయబడి ఉంది. దీని సెంట్రల్ కన్సోల్ కూడా మాట్టే బ్లాక్ ప్లాస్టిక్స్ కి బదులుగా పియానో నలుపు రంగుని పొందుతుంది. అలాగే, పాత మోడల్ లో నల్ల లెథర్ సీట్లకు బదులుగా,కొత్త వాటిలో సీట్లు టాన్ రంగు లెథర్ తో చుట్టబడి ఉంటాయి.

లక్షణాలు:

2018 Mahindra XUV500

దీనిలో పరికరాల జాబితా పాతదానిలో ఉన్నట్టుగానే ఉంటుంది. దీనిలో సౌకర్యవంతమైన లక్షణాలు క్రూయిస్ నియంత్రణ, టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVMS, టైర్ ప్రజర్ మోనిటరింగ్ వ్యవస్థ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డైనమిక్ మార్గదర్శకాలతో రివర్స్ పార్కింగ్ కెమెరా, DRLS తో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, పుష్-బటన్ స్టార్ట్ మరియు రీగెనరేటివ్ బ్రేకింగ్ వంటి లక్షణాలు ఉన్నాయి. వినోదం కోసం, అది ఒక 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను GPS, USB, బ్లూటూత్ మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటు, ఒక ఆర్కమ్య్స్- ట్యూన్డ్ సౌండ్ సిస్టంతో పాటు వస్తుంది.  

భద్రతా లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రాధమిక లక్షణాలు అయిన డబల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు EBD తో ABS ఉన్నాయి. అయితే, టాప్ స్పెక్ వేరియంట్ లో సైడ్ మరియు కర్టైన్ ఎయిర్బ్యాగ్స్ ఉన్నాయి. ఇతర భద్రతా లక్షణాలు అయిన  ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు హిల్ డెసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి మరియు ఇవి టాప్ వేరియంట్ కి మాత్రమే పరిమితం చేయబడి ఉన్నాయి.

ఇంజన్:

2018 XUV500

ఇంజన్ విషయానికి వస్తే,  XUV500 ఫేస్ లిఫ్ట్ అదే 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. అయితే  ఈ సారి 155Ps పవర్ మరియు 360Nm టార్క్ ని అత్యధికంగా ఇచ్చే విధంగా ట్యూన్ చేయబడింది. ఇది మునుపటి కంటే  14Ps పవర్ ను మరియు 20Nm టార్క్ ని ఎక్కువగా  అందిస్తుంది. కొత్త XUV500 వేగంగా ఉంది, దీనికిగానూ ధన్యవాదాలు తెలపాలి. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ కానీ లేదా 6-స్పీడ్ ఆటోమెటిక్ తో గానీ మునుపటి వలే ఉంది. ఈ 2.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 140Ps పవర్ మరియు టార్క్ 320Nm టార్క్ పరంగా ఎటువంటి మార్పు చేయబడి లేదు మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో మాత్రమే వస్తుంది.

వేరియంట్స్ మరియు ధర:

2018 Mahindra XUV500

ప్రీ-ఫేస్లిఫ్ట్ మోడల్ మాదిరిగా, కొత్త XUV500 ఐదు డీజిల్ ఇంజిన్ తో అమర్చబడిన వేరియంట్లలో లభిస్తుంది. అయితే నామకరణం W5, W7, W9, W11 మరియు W11 ఆప్షనల్ (టాప్ స్పెక్) కు మార్చబడింది. మరోవైపు, పెట్రోలు XUV500, ఒకటే G వేరియంట్లో అందుబాటులో ఉంది.

కొత్త XUV500 యొక్క ధరలు రూ.12.34 లక్షల నుంచి మొదలయ్యి రూ.18.98 లక్షల(ఎక్స్ -షోరూమ్,ముంబై) వరకు ఉన్నాయి. దృష్టికోణానికి సంబంధించి పాత XUV500 రూ.12.71 లక్షలు మరియు 18.82 లక్షల (ఎక్స్-షోరూమ్ ముంబై) మధ్య ధరకే నిర్ణయించబడింది. మేము చూసినదానిబట్టి కొత్త XUV500 యొక్క బేస్ వేరియంట్ దాని పాతదాని కంటే తక్కువగా ఉంటుంది. అయితే, టాప్-స్పెక్ 4WD AT వేరియంట్ 16,000 రూపాయల పెంపును చూస్తుంది. మాకు తెలిసినంతవరకూ దీనికి ఉన్న నవీకరణలు చూసుకుంటే ఆ పెరిగిన ధర న్యాయమే అనిపిస్తుంది. ఈ ధరల వద్ద, XUV500 ముందు దానివలే పెట్టిన డబ్బుకు న్యాయం చేసే విధంగానే ఉంటుంది.

అయితే, ఈ ధర వద్ద కూడా, XUV500 దాని పోటీదారులు అయిన టాటా హెక్సా(ధరలు రూ.12.49 లక్షల నుండి రూ.18.05 లక్షలు) మరియు జీప్ కంపాస్(15.07 లక్షల నుండి 21.84 లక్షల వరకు (రెండూ కూడా ఎక్స్-షో్‌రూం ముంబై)) తో పోటీపడుతున్నది. హెక్సా ఎక్క్య్వ స్థలం మరియు కొద్దిగా మెరుగైన నాణ్యత గల లోపల భాగాలను కలిగి ఉంటుంది. అయితే కంపాస్ ఎక్కువ ప్రీమియం గా ఉంటుంది మరియు మంచి మెరుగైన డ్రైవ్ ను అందిస్తుంది. మహీంద్రా XUV500 కు ఉన్న నవీకరణలతో దాని ప్రత్యర్థులతో పోటీ పడేందుకు సరిపోతుందా? కనుగొనేందుకు మా పూర్తిస్థాయి పోలిక కోసం వేచి ఉండండి.



 

was this article helpful ?

Write your Comment on Mahindra ఎక్స్యూవి500

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience