ఇటలీలో ప్రారంభించబడిన మహీంద్రా ఎక్స్యువి 500 ఫేస్ లిఫ్ట్

ప్రచురించబడుట పైన Nov 19, 2015 06:39 PM ద్వారా Sumit for మహీంద్రా ఎక్స్యూవి500

  • 5 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

మహీంద్రాఎక్స్యువి 500 వాహనం భారీతీయ రోడ్లపైకి వచ్చిన తరువాత దాని ఫేస్‌లిఫ్ట్ ఇటలీ లో ప్రారంభించబడింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇటలీ లో ప్రారంభించబడిన మోడల్ కి  5 సంవత్సరాలు / 100,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. చిన్న కాస్మెటిక్ చేర్పులు పొందడం కాకుండా  కారు పరికరాలు పరంగా సంపూర్ణ నవీకరణలు అందుకుంది. W6 మరియు W8 అనే రెండు వేరియంట్లు యూరోపియన్ దేశంలో అందుబాటులో ఉన్నాయి మరియు ఎయిర్బ్యాగ్స్, ABS, EBD, ESP, ISOFIX మౌంట్స్,  హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. 

2.2 లీటర్ mHawkడీజిల్ ఇంజిన్  6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ భారతీయ మరియు ఇటాలియన్ వేరియంట్స్ కి మధ్య సాధారణంగా ఉన్నాయి. ఈ వాహనం లో కొత్త మూలకం అంతర్జాతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన పెట్రోల్ ఇంజిన్.  

కారు ముందరి భాగం హెడ్ల్యాంప్స్ తో పునఃరుద్ధరించబడిన గ్రిల్ ని కలిగి ఉంది. అలానే అంతర్భాగాలలో కొత్త డాష్బోర్డ్ రంగు థీమ్, ఫాబ్రిక్స్ సీటు మరియు వీకరించబడిన సెంటర్ కన్సోల్ ఇవన్నీ కూడా కారు యొక్క సౌందర్యాన్ని మరింతగా పెంచుతాయి. భారత వాహనం యొక్క యూరోపియన్ వెర్షన్ (W8) యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ కి  రివర్స్ పార్కింగ్ కెమెరా, కూల్డ్ గ్లోవ్ బాక్స్, GPS నావిగేషన్ కి మద్దతు ఇచ్చే టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పడుల్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు స్టాటిక్ కార్నరింగ్ ల్యాంప్స్ వంటి లక్షణాలు అందించబడుతున్నవి. అదనంగా సన్రూఫ్ మరియు క్రోమ్ హైలేటెడ్ ఫాగ్ ల్యాంప్స్ తో బంపర్ మిడ్-సైజ్ క్రాస్ఓవర్ కి మరింత ప్రాముఖ్యతను చేకూరుస్తున్నాయి. 

ఎక్స్యువి 500 యొక్క యూరోపియన్ వెర్షన్ 19,527 నుండి 25,466 యూరోలు (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 13.74లక్షలు నుండి రూ. 18.01 లక్షలు) ఉంది. అంతేకాకుండా  భారతదేశం నుండి  CBU మార్గం ద్వారా ఎగుమతి అవుతోంది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా ఎక్స్యూవి500

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?