త్వరలోనే ప్రారంభం కానున్న మహీంద్రా XUV500 మరియు మహీంద్రా స్కార్పియో 1.9 లీటర్ వేరియంట్స్
జనవరి 19, 2016 12:50 pm manish ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డీజిల్ ఇంజిన్ల నిషేధం ప్రధానంగా భారతదేశం యొక్క డీజిల్ వాహన తయారీసంస్థ పై ప్రభావం చూపించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మహీంద్రా ఎక్స్యువి 500 మరియు మహీంద్రా స్కార్పియోలో ఉన్నటువంటి 2.2 లీటర్ యూనిట్ కుదించడం జరిగుతుందని ప్రకటించింది. యుటిలిటీ వాహనాలు 2000cc స్థానభ్రంశం నుండి మరియు దాని కంటే ఎక్కువ స్థానభ్రంశం గల వాహనాలను ఇటీవల దేశ రాజధానిలో నెలకొన్న కాలుష్యం పరిస్థితికి అనుగుణంగా డిల్లీ ప్రభుత్వం నిషేంధించింది. ఎకనమిక్ టైంస్ ద్వారా ఒక నివేదిక ప్రకారం, భారత వాహనతయారి సంస్థ సుప్రీంకోర్టు నిషేధించిన బాన్ క్రమంలో ఒక 1.9-లీటర్ యూనిట్ ప్రారంభించనున్నది. ఇది పైన పేర్కొన్న ఇంజిన్లకు భర్తీగా ఉండబోతోంది.
2.2 లీటర్ mHawkఇంజిన్ బాన్ నుండి తప్పుకొనేందుకు 1.9 లీటర్ వెర్షన్ కి కుధించబడనున్నది. ఈ కొత్త యూనిట్ దాని ముందరి దాని కంటే సాపేక్షంగా తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది కానీ, ఈ ఎత్తుగడ నేషనల్ కాపిటల్ రీజియన్ లో మహీంద్రా అమ్మకాలు తిరిగి పునఃరుద్ధరించబడానికి ఉపయోగపడుతుంది. ఇలా కుధించబడడం వలన ఒక మెరుగైన ఇంధన సామర్ధ్యం అందించగలదా లేదా అనే దానిపై పుకార్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలా కుదించడం వలన చిన్న ఇంజిన్ పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనికి కారణం పవర్ టు వెయిట్ నిష్పత్తి తగ్గించబడడం.
అంతర్గతంగా ఇంజిన్ల శక్తి తగ్గించబడింది, కానీ ఇంజిన్ మ్యాపింగ్ అవుట్సోర్స్ లో జరిగింది. ఇది పరిగణనలోకి తీసుకోవలసిన ఒక విలువైన అంశం. ఎందుకంటే సాధారణంగా ఒక ఇంజిన్ ని కుదించేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. అని మహీంద్రా అండ్ మహీంద్రా తరపున ఎగ్జిక్యూటివ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఇదే విషయం పై మారుతి సుజుకి, రీసెర్చ్ & డెవలప్మెంట్ యొక్క మాజీ అధిపతి మిస్టర్. IV రావ్ మాట్లాడుతూ " సాధారణంగా ఇంజన్ పరిమాణాన్ని తగ్గించడం మరియు భాగాలు మరియు ఇంజిన్ అమరిక యొక్క పునఃరూపకల్పన మరియు అభివృద్ధి కోసం సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. ఇంజిన్ మార్చడానికి ఏమి చేయాలి అనే దానిపై కాంప్లెక్సిటీ ఆధారపడి ఉంటుంది." అని తెలిపారు. 1.9 లీటర్ మహీంద్రా స్కార్పియో కొన్ని వారాల క్రితం ప్రారంభించబడింది మరియు ఏఆర్ఏఐ చే ఆమోదం పొందింది. 1.9 లీటర్ మహీంద్రా XUV500 యొక్క ప్రారంభం త్వరలోనే ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇంకా చదవండి
మహీంద్రా స్కార్పియో వేరియంట్స్ - ఉత్తమమైనది ఏదో తెలుసుకోండి!!