Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మహీంద్రా XUV400 Vs టాటా నెక్సాన్ EV మాక్స్ – వీటిలో ఏది అత్యంత వాస్తవిక మైలేజ్‌ను అందిస్తుంది?

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కోసం tarun ద్వారా మార్చి 16, 2023 12:59 pm ప్రచురించబడింది

ఈ రెండు వాహనాలు సారూప్య ధరలను కలిగి, సుమారు 450 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందించగల ప్రత్యక్ష పోటీదారులు

ప్రస్తుతం భారతదేశంలో, టాటా నెక్సాన్ EV అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ కారు, ఇటీవల దీనికి ప్రత్యక్ష పోటీదారుగా మహీంద్రా XUV400 విడుదల అయ్యింది. ఈ రెండు వాహనాల ధర రూ.15 లక్షల నుండి రూ. 19 లక్షల వరకు ఉంది, 450 కిలోమీటర్‌ల డ్రైవింగ్ మైలేజ్‌ను ఇవి క్లెయిమ్ చేస్తున్నాయి.

వీటి వాస్తవ పరిధిని తనిఖీ చేయడానికి, ఒకే రోజు కాకపోయినా సమానమైన పరిస్థితులలో వీటిని పరీక్షించి, వాటి బ్యాటరీ ఛార్జింగ్ؚను ఒక శాతానికి తీసుకువచ్చాము. XUV400 మరియు నెక్సాన్ EV మాక్స్ؚలు క్లెయిమ్ చేసిన గణాంకాలకు దగ్గరగా వస్తాయా లేదా, వీటిలో ఏది ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది అనేది చూద్దాం:

పరిధి తనిఖీ

మోడల్

XUV400

నెక్సాన్ EV మాక్స్

క్లెయిమ్ చేసిన పరిధి

456 కిలోమీటర్లు

453 కిలోమీటర్లు

వాస్తవ పరిధి *

289.5 కిలోమీటర్లు

293.3 కిలోమీటర్లు

*ఈ EVలను నగర రోడ్లు, హైవేలు, ఘాట్ؚలు వంటి మిశ్రమ దారులలో నడిపి వీటి వాస్తవ పరిధిని లెక్కించాము.

రెండు SUVలు, క్లెయిమ్ చేసిన పరిధి కంటే 150కిమీ తక్కువ దూరం నడిచాయి, మిశ్రమ డ్రైవింగ్ పరిస్థితులలో 300-కిలోమీటర్‌ల మార్క్ؚకు దగ్గరగా వచ్చాయి. మరింత నిదానమైన డ్రైవింగ్ లేదా, అధిక నగర ప్రయాణ నిష్పత్తిలో ఫుల్ చార్జ్ؚతో 300కిలోమీటర్‌ల కంటే ఎక్కువ పరిధిని పొందగలరు.

ఇది కూడా చదవండి: మహీంద్రా XUV400 EV: మొదటి డ్రైవ్ సమీక్ష

టాటా నెక్సాన్ EV మాక్స్ మరియు మహీంద్రా XUV400, రెండిటినీ ఎకో మోడ్ؚలో డ్రైవ్ చేశాం, ఈ మోడ్ ఎలక్ట్రిక్ మోటార్ పనితీరు సామర్ధ్యాల కంటే మైలేజ్‌కు ప్రాధాన్యతను ఇస్తుంది. కాబట్టి, మీరు సాధారణ లేదా స్పోర్ట్ మోడ్ؚలో డ్రైవ్ చేస్తే, ఈ పరిధి ఇంకా తగ్గే అవకాశం ఉంది.

ఈ గణాంకాలతో, కొనుగోలుదారులు ముంబై నుండి పూణేకు వెళ్ళి రావచ్చు, లేదా ఢిల్లీ నుండి జైపూర్ؚకు లేదా ఢిల్లీ నుండి ఆగ్రాకు ప్రయాణించవచ్చు.

ఛార్జింగ్ తగ్గినప్పుడు ఏం జరుగుతుంది?

మహీంద్రా XUV400: ఛార్జ్ 10 శాతానికి తగ్గినప్పుడు, అత్యధిక వేగం గంటకు 50 కిలోమీటర్‌లకు పరిమితం అవుతుంది. అది ఎనిమిది శాతానికి వచ్చిన్నప్పుడు, అత్యధిక వేగం గంటకు 40 కిలోమీటర్‌లకు తగ్గుతుంది, తర్వాత మూడు శాతం ఛార్జ్ ఉన్నప్పుడు గంటకు 30 కిలోమీటర్‌లకు పరిమితం అవుతుంది. చార్జింగ్ పూర్తిగా పడిపోయినప్పుడు, గంటకు 10 కిలోమీటర్‌ల కంటే ఎక్కువ వేగంతో నడపలేరు. 10 శాతం ఛార్జింగ్ మిగిలి ఉన్నప్పుడు కూడా, కొనుగోలుదారుడి ప్రాధాన్యతలను అనుసరించి, క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్ؚలు మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

టాటా నెక్సాన్ EV మాక్స్: టాటా విషయంలో, ఛార్జింగ్ 20 శాతానికి పడిపోయినప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ తీవ్రత పెరుగుతుంది. అది 10 శాతం మార్క్ؚకు చేరినప్పుడు, మిగిలిన డ్రైవింగ్ పరిధి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుండి కనిపించకుండా పోతుంది, అత్యధిక వేగం గంటకు 55 కిలోమీటర్‌లకు పరిమితం చేయబడుతుంది. ఇక్కడ స్పోర్ట్ మోడ్ కూడా నిలిపివేయబడుతుంది.

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ EV మాక్స్ మొదటి డ్రైవ్ సమీక్ష

ధరలు మరియు ప్రత్యామ్నాయాలు

మోడల్

నెక్సాన్ EV ప్రైమ్

నెక్సాన్ EV మాక్స్

XUV400 EV

ధర పరిధి

రూ. 14.49 లక్షల నుండి రూ. 17.50 లక్షల వరకు

రూ. 16.49 లక్షల నుండి రూ. 18.99 లక్షల వరకు

రూ. 15.99 లక్షల నుండి రూ. 18.99 లక్షల వరకు

XUV400 EV టాప్-ఎండ్ వేరియెంట్ ధర, నెక్సాన్ EV మాక్స్ ధరకు సమానంగా ఉంటుంది. XUV400 EV బేస్ వేరియెంట్ ధర, నెక్సాన్ EV మాక్స్ కంటే రూ.50,000 తక్కువ. మీ బడ్జెట్ దీని కంటే తక్కువ అయితే, నెక్సాన్ EV ప్రైమ్ సరైన ఎంపిక కావచ్చు, ఎందుకంటే ఇది 320 కిలోమీటర్‌ల మైలేజ్ మాత్రమే అందిస్తుంది.

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా XUV400 EV ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on Mahindra ఎక్స్యువి400 ఈవి

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
ప్రారంభించబడింది on : Feb 17, 2025
Rs.48.90 - 54.90 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర