మహీంద్రా XUV 300 రీకాల్ చేయబడింది: మీ కారు ఏమైనా ప్రభావితమైందా?
మహీంద్రా ఎక్స్యూవి300 కోసం rohit ద్వారా నవంబర్ 11, 2019 02:14 pm ప్రచురించబడింది
- 29 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా XUV300 యొక్క నిర్దిష్ట బ్యాచ్ ని రీకాల్ చేయడం జరిగింది, అయితే ఖచ్చితంగా ఎన్నియూనిట్లు ప్రభావితమయ్యాయో పేర్కొనలేదు
- 19 మే, 2019 వరకు తయారు చేయబడిన XUV 300 యొక్క నిర్దిష్ట బ్యాచ్‌ను రీకాల్ చేయడం జరిగింది.
- అవసరమైన రీ-ప్లేస్‌మెంట్స్ ఉచితంగా నిర్వహించబడతాయి.
మహీంద్రా తన సబ్ -4 మీటర్ SUV, XUV300 యొక్క నిర్దిష్ట బ్యాచ్ ను దాని సస్పెన్షన్‌కు సంబంధించిన సమస్య కోసం రీ-కాల్ చేయడం జరిగింది. రీకాల్ 19 మే, 2019 వరకు తయారు చేయబడిన లిమిటెడ్ బ్యాచ్ XUV300 ను ప్రభావితం చేస్తుందని చెప్పబడింది. అయితే, రీకాల్ ద్వారా ప్రభావితమైన యూనిట్ల సంఖ్యను మహీంద్రా పేర్కొనలేదు.
భారతీయ కార్ల తయారీదారు ప్రకారం, రీకాల్ ద్వారా ప్రభావితమైన XUV300 యజమానులను త్వరలో సంప్రదిస్తారు. అంతేకాక, లోపం కనుగొనబడితే కంపెనీ తప్పు భాగాన్ని ఉచితంగా భర్తీ చేస్తుంది.
ఇది కూడా చదవండి: ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ని పొందనున్న 2020 మహీంద్రా XUV500
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన XUV 300 ధర ప్రస్తుతం రూ .8.1 లక్షల నుంచి రూ .12.69 లక్షల మధ్య ఉంది (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.5-లీటర్ డీజిల్ యూనిట్ తో అందించబడుతుంది. పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ తో మాత్రమే అందించబడుతుండగా, డీజిల్ వెర్షన్ ను AMT తో కూడా కలిగి ఉండవచ్చు.
సంబంధిత: మహీంద్రా XUV300 Vs హ్యుందాయ్ క్రెటా: డీజిల్ రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్ & మైలేజ్ పోలిక
ఈ రీకాల్ జాబితాలో ఉన్న కార్లను వాటి ప్రస్తుత స్థితిలో నడిపించవచ్చా అనే దాని పై స్పష్టత లేనప్పటికీ, మీ వాహనం ఆ జాబితాలో గనుక ఉంటే వెంటనే పరీక్షించుకోండి. అలా అయితే మీ SUV మంచి కండిషన్ లో ఉండడానికి అది సహాయపడుతుంది
దీనిపై మరింత చదవండి: XUV300 AMT
0 out of 0 found this helpful