మహీంద్రా TUV300 వేరియంట్లు: మీ ఉత్తమ ఎంపిక ఏది?
డిసెంబర్ 17, 2015 09:43 am bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై: TUV300 ద్వారా మహీంద్రా వారు వారి యొక్క బలమైన యుటిలిటీ వాహనాల పేరును మరొకసారి నిరూపించుకున్నారు. ఈ TUV300 వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది మరియు సంస్థ కూడా వీటి యొక్క ఉత్పత్తిని పెంచి అధిక డిమాండు ని అందుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాహనాల యొక్క భారీ పరిమాణం మరియు సౌకర్యవంతమైన అంతర్గత స్పేస్, లక్షణాలు, మంచి స్టయిలింగ్ మరియు ఒక బలమైన లుక్ ద్వారా మహీంద్రా TUV300 ఇప్పుడు ఉత్తమ అమ్మకాలు కలిగిన భారతీయ కార్ల జాబితాలో చేరింది. ఈ క్రింద మేము TUV300 యొక్క వేరియంట్ల విశ్లేషణ వివరాలు అందించాము. అన్ని ధరలు ఎక్స్-షోరూం డిల్లీ అధారితంగా చూపించబడ్డాయి.
TUV300 T4 వేరియంట్
రూ. 6,98 లక్షలు
బేస్ వేరియంట్ TUV300 , T4 ఇది ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లతో అసంతృప్తిగా ఉన్న వినియోగదారులకు ఒక పెద్ద కారు(లేదా SUV) అనుభూతిని అందించగలదు. అది కొద్ది పాటి అధిక ధరతోనే. ఇది బేస్ వేరియంట్ అవ్వడం చేత అన్ని సౌకర్యాలను అందించనప్పటికీ ఇది ఒక మంచి ప్రారంభ శ్రేణి కారుగా చెప్పవచ్చు.
- టెయిల్‌గేట్ మీద అమర్చబడియున్న స్పేర్ వీల్
- టిల్ట్ సర్దుబాటు తో పవర్ స్టీరింగ్
- హీటర్ తో AC
- ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
- ముందు మరియు వెనుక పవర్ విండోస్
- ముందు వరుసలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్
- ఎకో మోడ్ మరియు బ్రేక్ శక్తి పునరుత్పత్తి టెక్నాలజీ
- డిజిటల్ ఇమ్మొబలైజర్
- ఆటో డోర్ లాక్
TUV300 T4 + వేరియంట్
Rs.7.33 లక్షలు
ఒకవేళ మునుపటి బేస్ వెర్షన్ తక్కువ సేవలతో అందుతున్నట్లు అనుకుంటే T4+ ఊహలకు అనుగుణంగా ఉంటుంది. ఇవి కొన్ని అధనపు స్టయిల్ మరియు కొన్ని భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.
- శరీర రంగు బంపర్స్
- వెనుక అమర్చబడియున్న అదనపు వీల్ కి కవర్
- వెనుక ఫుట్ స్టెప్
- డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
- EBD తో ABS
TUV300 T6 వేరియంట్
రూ. 7.63 లక్షలు
ఈ T6 వేరియంట్ వీయోగదారులకు అధునాతన మానవీయ సౌకర్యాలను అందిస్తుంది. ఉదాహరణకు సంగీత వ్యవస్థ, సమాచార వ్యవస్థ లాంటివి అందిస్తుంది. అదనంగా కారు ఎన్నో స్టయిలింగ్ సౌకర్యాలను అందిస్తుంది.
- క్రోమ్ చేరికలతో ఫ్రంట్ గ్రిల్
- శరీర రంగు డోర్ హ్యాండిల్స్
- సైడ్ ఫుట్ స్టెప్స్
- ప్రదర్శన స్క్రీన్ తో సమాచారవినోద వ్యవస్థ, 2-డిన్ ఆడియో, బ్లూటూత్, ఆక్స్, USB
- వాయిస్ మెసేజింగ్ సిష్టం
- వెనుక డీఫాగర్
- వెనుక వాష్ మరియు వైప్
- రిమోట్ లాక్ మరియుకీలెస్ ఎంట్రీ
- రెండవ వరుసలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్
- యాంటీ థెఫ్ట్ వార్నింగ్
- EBD తో ABS
TUV300 T6 + వేరియంట్
Rs.7.88 లక్షలు
ఈ T6+ శ్రేణి ప్రామాణిక T6విభాగంలోని అన్ని లక్షణాలతో పాటూ అదనంగా భద్రతా పరమైన లక్షణాలను కలిగి ఉంటుంది, ఉదాహరణకు ఎయిర్‌బ్యాగ్లు. ఈ T6+ శ్రేణి ఒక ఉత్తమమైన ధర మరియు లక్షణాలను కలిగియున్న కారు అవ్వడం చేత ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది.
- డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
TUV300 T6 + AMT వేరియంట్ రూ. 8.60 లక్షలు
పేరులో తెలిపిన విధంగా ఈ T6 + AMT వాహనం గేర్‌బాక్స్ ద్వారా నడపడానికి అయిష్టత చూపే వాహనదారులకు ఒక AMT గేర్‌బాక్స్ లక్షణాన్ని అందిస్తుంది.
- ఆటో షిఫ్ట్ AMT
TUV300 T8 వేరియంట్
రూ. 8.48 లక్షలు
ఈ T8 వేరియంట్ అన్ని లక్షణాలతోటి సౌకర్యాలతోటి అందించబడిన ఒక ఉత్తమమైన వాహనం. మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ మొదలుకొని వెనకాతల సీట్ల ఫోల్డింగ్ వరకు వినియోగదారులకు కావలసిన అన్ని హంగులను అందించగలుగుతుంది.
- క్రోమ్ చేరికలతో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
- స్టాటిక్ బెండింగ్ హెడ్ల్యాంప్స్
- అలాయ్ వీల్స్
- బ్లాక్ అవుట్ పిల్లర్
- పియానో బ్లాక్ సెంటర్ ఫేసియా
- ఆఛ్ వెంట్లలో సిల్వర్ చేరికలు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్ కి సిల్వర్ ఫినిషింగ్
- స్టీరింగ్ వీల్ గార్నిష్
- ఇంట్లీపార్క్ రివర్స్ అసిస్ట్
- డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
- ఎలక్ట్రిక్ ORVMs
- స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
- డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు
- మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ
- ఫాలోమీ హోమ్ అండ్ లెడ్ మి టు వెహికెల్ హెడ్‌ల్యాంప్స్
- ముందు సీట్లు కోసం ఆర్మ్రెస్ట్
- రెండవ వరుసలో పూర్తి సీటు ఫోల్డ్
TUV300 T8 AMT వేరియంట్
Rs.9.20 లక్షలు
కారుతో పాటూ అన్ని సౌకర్యాలు కావాలనుకొనే వారికోసం ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ తో ఈ T8 AMT మీ దగ్గరలోని మహీంద్రా డీలర్ వద్ద అందుబాటులో ఉంది.
ఇంకా చదవండి