• English
  • Login / Register

రూ. 6.90 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన మహీంద్రా టియువి 3oo

సెప్టెంబర్ 10, 2015 01:17 pm khan mohd. ద్వారా సవరించబడింది

  • 13 Views
  • 15 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: మహీంద్రా చివరకు టియువి300 ని రూ.6.90 లక్షల అద్భుతమైన ధర వద్ద ఎక్స్ - షోరూం పూనే లో ప్రారంభించింది. కార్దేఖో టియువి ప్రారంభానికి రెండు రోజుల మునుపే మొట్టమొదట ధరను అంచనా వేసింది. మహీంద్రా వారి ముందస్తు ప్రయత్నం క్వాంటో విఫలమవ్వడాన్ని భర్తీ చేయడానికి మహీంద్రా కాంపాక్ట్ 7-సీటర్ ఎస్యువి విభాగాన్ని టియువి తో మన ముందుకు తీసుకొచ్చారు. 

బయటవైపు, టియువి కొంచెం బాక్సీ ఆకారంలో కనిపిస్తుంది. టియువి పేరులో 'టి' అనగా 'టఫ్' అని అర్ధం మరియు దీనిని ఒక యుద్దపు ట్యాంక్ నుండి ప్రేరణ తో రూపొందించారు అని మహీంద్రా సంస్థ తెలిపింది. ముందరిభాగంలో, క్రోమ్ పూతతో ఉన్న నిలువు గ్రిల్ కి ఇరువైపులా పెద్ద హెడ్ల్యాంప్స్ అమర్చబడి ఉన్నాయి. బంపర్స్ కొంచెం జిడ్డుగా ఎయిర్ డ్యాం తో మరియు ఎక్కువ క్రోమ్ గీతలు కలిగినటువంటి ఒక జత చదరపు ఫాగ్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంది. దీని ప్రక్కభాగం ఫ్లాట్ గా కనిపిస్తోంది. దానిపైన కర్వ్స్ వంటివి లేవు. దీని షోల్డర్ లైన్ , హెడ్ల్యాంప్ నుండి టెయిల్ ల్యాంప్ వరకూ సజావుగా నడుస్తుంది. అగ్ర శ్రేణి లక్షణాలు కలిగిన వేరియంట్ యొక్క అలాయ్ వీల్స్ మొత్తం నిష్పత్తులతో పోలిస్తే చిన్నదిగా అనిపిస్తుంది. మహీంద్రా పెద్ద రింస్ తో ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. దీనిలో, బి మరియు డి పిల్లర్స్ మరియు రూఫ్ రెయిల్స్ నల్లని రంగులో అందించబడి ప్రక్క ప్రొఫైల్ ని పూర్తి చేశాయి. దీని వెనుక భాగంలో స్పేర్ వీల్ అమర్చబడి ఉండడం ముఖ్యమైన విషయం. దీనిలో గ్లాస్ ప్రాంతం చిన్నదిగా ఉంది. 

దీని అంతర్గత భాగం నలుపు మరియు లేత గోధుమరంగు కాంబో తో మరింత మెరుగుపరిచేందుకు సిల్వర్ చేరికలతో ఉంది. దీని డాష్బోర్డ్ పూర్తిగా కొత్తది మరియు డిజైన్ రూపం క్వాంటో యొక్క అంతర్గత భాగాల నుండి కొద్దిగా మార్పు పొందింది. దీని అత్యుత్తమ లక్షణాలు కలిగిన వెర్షన్ బెల్స్ మరియు విజల్స్ ని కలిగి ఉంది. దీనిలో స్టీరియో యుఎస్బి, బ్లూటూత్ మరియు ఆక్స్ ఇంపుట్స్ తో అమర్చబడి ఉంది. అలానే దీనిలో స్టీరింగ్ నియంత్రణలు కూడా అందుబాటులో ఉన్నాయి. టియువి మార్కెట్ లో ఇతర కాంపాక్ట్ ఎస్యువి లకు వేరుగా 5 + 2 సీటింగ్ ని పొంది ఉంది. +2' సీట్లు పిల్లల కోసం ఉత్తమమైనవి. 

టియువి300 హుడ్ క్రింద, కొత్త ఎం హాక్ ఇంజిన్ ని కలిగి ఉండి 84bhp శక్తిని మరియు 230Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఎం హాక్, క్వాంటో యొక్క 1.5 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ యొక్క ట్వీకెడ్ వెర్షన్. ప్రామాణిక 5 స్పీడ్ మాన్యువల్ తో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందించబడుతున్నది. 

ఈ వాహనం పూర్తిగా రోడ్ టెస్ట్ కి వెళ్ళేంతవరకూ ఎలా పనిచేస్తుంది అనే విషయం పైన మన వ్యాఖ్యలు కొంచెం రిజర్వ్ చెసుకోవాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి! 

ధరలు:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra TUV 3OO

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience