2015 జూలై 22, న థార్ ఫేస్ లిఫ్ట్ ను ప్రారంభించబోతున్న మహీంద్రా

ప్రచురించబడుట పైన Jul 13, 2015 02:51 PM ద్వారా Raunak for మహీంద్రా థార్

  • 3 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మహింద్రా వచ్చే వారం 22 న థార్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. ఇది, డిసెంబర్ 2010 లో ప్రారంబించబడిన థార్ నుండి ప్రవేశపెట్టబోతుంది. అంతేకాకుండా అనేక నవీకరణలతో రాబోతుంది. ఈ ఆఫ్ రోడ్ వాహనం, బాహ్య భాగాల విషయంలో అనేక మార్పులతో రాబోతుంది. అయితే, కొత్త డాష్బోర్డ్ ను కలిగి ఉండబోతుంది. అంతేకాకుండా, దీనిలో భారీగా జీప్ రాంగ్లర్ ప్రేరణ కనిపిస్తుంది!

మార్పులు గురించి మాట్లాడటానికి వస్తే, గూడచర్యం చేయబడ్డ చిత్రాలలో చూసిన విధంగా ప్లాస్టిక్ మెటల్ బంపర్స్ తో రాబోతుంది. వెనుక బాగంలో ఉండేది కొంచెం వంగి ఉంటుంది. అంతేకాక, రాబోయే కొత్త థాత్ యొక్క డాష్ బోర్డ్ అనేక నవీకరణలతో మరియు డ్యూయల్ టోన్ షేడ్స్ తో రాబోతుంది. దీని వలన క్యాబిన్ చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది.

పైన చెప్పినట్లుగా, కొత్త గా రాబోయే వాహనం యొక్క క్యాబిన్, జీప్ రాంగ్లర్ నుంచి తీసుకోబడిన డిజైన్ కవళికలు కనిపిస్తుంది- దీనిలో బాగంగా, ఏసి ప్రియుల కోసం ఏసి నియంత్రణలు మరియు అదే సెంట్రల్ కన్సోల్ డిజైన్ తో రాబోతుంది. అంతేకాకుండా, త్రీ పాట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త గా రాబోతుంది. మరియు క్రోమ్ ప్రీమియం కనిపిస్తోంది. అంతేకాకుండా కొన్ని అంశాలను బొలీరో నుండి తీసుకోబోతుంది. అవి వరుసగా, గేర్ బాక్స్ లెవర్, స్టీరింగ్ వీల్ ఏసి నాబ్స్ లో మనం గమనించవచ్చు.

ఇంజన్ గురించి చెప్పాలంటే, పాత దానిలో ఉండే అదే ఇంజన్ ఆప్షన్ లతో 2015 ప్రస్తుత థార్ ఏ మార్పులు లేకుండా రాబోతుంది. అవుట్గోయింగ్ థార్ లో ఉండే రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రాబోతుంది. అవి వరుసగా, 2.5 లీటర్ సి ఆర్ డి ఈ మరియు 2.6 లీటర్ డి ఐ ఇంజన్. ఈ రెండిటిలో తక్కువ శక్తివంతమైన 2.6 లీటర్ డి ఐ ఇంజన్, 2523సిసి స్థానబ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అతధికంగా 63 bhp పవర్ ను మరియు 1500 నుండి 1800 rpm మద్య 182.5 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. రెండవది 2.5 లీటర్ సి ఆర్ డి ఈ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 3800 rpm వద్ద 105 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా 1800 నుండి 2000 rpm మధ్య లో 247 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో 2డబ్ల్యూ డి ( రేర్ వీల్ డ్రైవ్) మరియు 4 డబ్ల్యూ డి బోర్గ్-వార్నర్ (మాన్యువల్ షిఫ్ట్) తక్కువ రిడక్షన్ గేర్ తో] జత చేయబడి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా థార్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?