మహీంద్రా థార్ రూ.8,03,000 లక్షల ధర వద్ద ఎక్స్-షోరూమ్ నాసిక్ లో విడుదల అయ్యింది (లోపల గ్యాలరీతో)
మహీంద్రా థార్ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా జూలై 23, 2015 02:59 pm సవరించబడింది
- 13 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఎంతాగానో ఎదురు చూస్తున్న ఆఫ్-రోడర్ మహింద్ర థార్ రూ.8,03,000 లక్షల ధర వద్ద ఎక్స్-షోరూం నాసిక్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సరికొత్త పునరుద్దరణ లోపలి భాగంలో మరియూ బాహ్య రూపంతో పాటుగా దాని సమర్ధతలో కూడా జరిగింది. ఇంజిను అదే 2.5-లీటర్ సీఆర్డీఈ అయినా కానీ అది ఉత్పత్తి చేసే శక్తి 105Ps గా మరియూ 247Nm గా ఉండటంతో పాటుగా ఇందులో మరిన్ని మార్పులు పొందింది.
కొత్త థార్ సీఆర్డీఈ విడుదల కార్యక్రమంలో మహింద్ర & మహింద్రా లిమిటెద్ కి ప్రెసిడేంట్ మరియూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన ప్రవీన్ షా గారు మాట్లాడుతూ, " దీని విడుదల నుండి థార్ మా యొక్క ధీటైన కణానికి ప్రతిరూపంగా మా వారసత్వానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ విడుదలతో దీనికి మరింత అందం చేకూర్చడం జరిగింది. ఈ మధ్య కాలంలో వినియోగదారులు కొత్త జీవనశైలికి తగ్గట్టుగా మరింత సాహసోపేతంగా ఉన్నారు, అందుకు గాను ఈ థార్ అటువంటి ఔత్సాహికులకు సరైన జోడీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష్య. థార్ యొక్క ఈ కొత్త అవతారం అందరికి నచ్చుతుందనీ మరియూ కొత్త వినియోగదారులని సైతం ఆక్స్ర్షిస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.
ఇంతకు మునుపటి వాహనం కంటే కూడా ఇందులో ఎక్కువ ప్లాస్టిక్ భాగాలు ఉన్నాయి
ముఖ్య బాహ్య తేడాలు:
- కొత్త ముందు మరియూ వెనుక బంపర్లు
- కొత్త వీల్ ఆర్చెస్
- కొత్త సైడ్ ఫుట్ బోర్డు
- కొత్త పునరుద్దరించిన తేలికగ విప్పి పెట్టగలిగే కానొపీ
- కొత్త స్పష్టమైన హెడ్ల్యాంప్
- అల్లోయ్ వీల్స్ ఆప్షనల్ గా లభ్యం అవుతున్నాయి
ఇది నూతన మరియూ ఉన్నత లోపలి భాగాలు కలిగి ఉంది . ఇది ఉన్నత మరియూ ఆచరణాత్మక లక్షణాలతో కారు వంటి సౌకర్యం కలిగి ఉంది. రెందు రంగుల థీం లోపలి భాగాన అంతకు ముందు పూర్తి నలుపు కంటే మెరుగ్గా ఉంది. ఇంతకు మునుపు ధుడుకైన స్టీరింగ్ వీల్ ని మరియూ గరుకుదనం ఇంకా సబ్దల శాతాన్ని తగ్గంచడం జరిగింది.
ముఖ్యంశాలు:
- కొత్త సౌకర్యవంతమైన ఉన్నతమైన సీట్లు
- మరింత నాణ్యతతో మరియూ పూతతో రెండు రంగుల డ్యాష్బోర్ద్
- టాకోమీటర్ కలిగిన 3-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
- పునరుద్దరించిన ఏసీ వెంట్స్
- గత థార్లో లేని విండ్షీల్డ్ డీ-మిస్టర్
- బొలెరో నుండి పునికి తెచుకున్న కొత్త స్టీరింగ్ వీల్ మరియూ గేర్ నాబ్
- కొత్త డోర్ టృఇంస్
- కప్ హోల్డర్స్ తో కొత్త ఫ్లోర్ కన్సోల్
ఆఫ్-రోడ్ సామర్ధ్యం
సొగసైన మార్పులే కాకుండా సామర్ధ్యాన్ని పెంచేందుకు కూడా థార్ ఫేస్-లిఫ్ట్ లో మార్పులు చేయడం జరిగింది. అందులో కొన్ని:
- లాకింగ్ వెనుకటి డిఫారెన్షియల్
- మరింత ధుడుకైన వెనుక షాకల్స్ మరియూ లీఫ్ స్ప్రింగ్స్
- బలమైన ముందు హుక్కులు
ఎవేమి మార్పు చెందలేదు?
ముందుగా, ఇంజినులో మరియూ దాని శక్తిలో ఎటువంటి మార్పు లేదు. అదే 2.5 సీఆర్డీఈ మోటరుతో 105bhp మరియూ 247Nm టార్క్ ని ఉత్పత్తి చేసే ఇంజిను అమర్చబడి ఉంది. కొలతలు కూడా అలాగే మునుపటిలా 3920x1726x1930 గా ఉన్నాయి మరియూ వీల్బేస్ 2430mm గా ఉంది. అదే బోర్గ్వార్నర్ యొక్క ఎగుడు దిగుడు తగ్గింపు గేర్ల గల ట్రాన్స్ఫర్ కేస్ తో వచ్చింది. ముందు మరియూ వెనుక అదే మార్పు లేని సస్పెన్షంతో ఉంది.