మహీంద్రా స్కార్పియో వేరియంట్స్ - ఉత్తమమైనది ఏదో తెలుసుకోండి!!

మహీంద్రా స్కార్పియో 2014-2022 కోసం sumit ద్వారా డిసెంబర్ 21, 2015 01:14 pm ప్రచురించబడింది

 • 12 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Mahindra Scorpio

మహీంద్రా స్కార్పియో భారతీయ కారు ప్రపంచంలో ఎస్యూవీ సెగ్మెంట్లో తగినంత పేరు సంపాదించింది. ఇది ఒక SUV ఔత్సాహికులకు అబ్బుర పరిచే సామర్థ్యం కలిగి ఉన్న వాహనం. అయితే స్కార్పియో ని కొనుగోలు చేద్దాం అనుకొనేవారికి మాత్రం ఏ వేరియంట్ ఎంచుకోవాలి అనేది కొంచెం తికమకలో పెడుతుంది. అందువలన, మేము వేరియంట్ కి సంబందించి ఒక సంక్షిప్త విశ్లేషణ ని మీ ముందు ఉంచాము. చూద్దాం పదండి !!!

స్కార్పియో S2, S4, S4 +, S6 +, S8 మరియు S10 అను 6 వేరియంట్లలో వస్తుంది.

1. S2 వేరియంట్: రూపాయలు. 8.9లక్షలు- రూపాయలు. 9.0 లక్షలు

ఇది 2,523cc ఇంజిన్ కలిగి ఉండి 75bhp శక్తిని విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

కొన్ని కీలకమైన అంశాలు

 • హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్
 • హీటింగ్, వెంటిలేషన్ మరియు AC
 • టిల్ట్ స్టీరింగ్
 • 12V ఛార్జింగ్ పాయింట్
 • హైడ్రాలిక్ అసిస్ట్ బోనెట్
 • కొలాప్స్ స్టీరింగ్ కోలం
 • సైడ్ ఇంట్రూజన్ బీంస్
 • డిజిటల్ఇమ్మొబలైజర్
 • మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ

ఈ బేస్ వేరియంట్ ఎవరైతే, తక్కువ బడ్జెట్ తో ఆఫ్ రోడ్ సామర్ధ్యం గల వాహనం కావలనుకుంటారో వారికి ఇది చాలా అనువైనది. S2 వేరియంట్ సౌకర్యవంతమైన రైడింగ్ కోసం కాలవసిన అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ లగ్జరీ లక్షణాలు అందుబాటులో లేవు మరియు 4WD ఎంపిక అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది.

2. S4 వేరియంట్: రూపాయలు. 9.5 లక్షలు - రూ. 10.7 లక్షలు

S4 వేరియంట్ (2179cc 120 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేసే) మరింత శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉంది, కానీ మైక్రో- హైబ్రిడ్ టెక్నాలజీని అందించడం లేదు. మిగిలినదంతా S2 వేరియంట్ లానే ఉంటుంది. ఎవరైతే SUV నుండి ముడి పవర్ కోసం చూస్తారో మరియు లక్షణాల జాబితా పై రాజీ పడరో అటువంటి వారికి ఈ వేరియంట్ సరైనది.

3. S4 + వేరియంట్: రూపాయలు. 9.9 లక్షలు - రూ. 11.1 లక్షలు

ఈ వేరియంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS వంటి సేఫ్టీ లక్షణాలతో అందించబడుతుంది.

కొన్ని ఇతర ముఖ్యమైన లక్షణాలు:

 • EBD
 • పానిక్ బ్రేక్ ఇండికేషన్
 • డ్రైవింగ్ చేసేటప్పుడు ఆటో డోర్ లాక్
 • సీటు బెల్ట్ రిమైండర్ ల్యాంప్
 • ఫాలోమీ హోమ్ హెడ్ల్యాంప్స్
 • బాటిల్ హోల్డర్ మరియు కప్ హోల్డర్
 • షిఫ్ట్ ఆన్ ఫ్లై 4WD (ఆప్షనల్ )

ఎవరైతే భద్రతా అంశాలపై రాజీ పడరో అటువంటి వారు ఖచ్చితంగా ఈ వేరియంట్ వైపు వెళ్ళాల్సిందే. అంతేకాకుండా, ఎవరైతే ఆఫ్ రోడింగ్ సామర్ధ్యాలను కావలనుకుంటారో వారికి ఇది చాలా అనువైన వాహనం. ఇది 4WD ఎంపికను కూడా అందిస్తుంది.

4. S6 + వేరియంట్: రూపాయలు. 11.1 లక్షలు

ఈ వేరియంట్ స్పాయిలర్ మరియు 2-డిన్ సంగీతం వ్యవస్థ వంటి కొన్ని ముఖ్యమైన మరియు సౌందర్య లక్షణాలను కలిగి ఉంది.

కొన్ని ఇతర ముఖ్యమైన లక్షణాలు:

 • స్కీ రాక్
 • AC వెంట్లపై క్రోం ఫినిష్
 • వాయిస్ సహాయక వ్యవస్థ
 • ట్విట్టర్లతో స్పీకర్లు
 • లీడ్ మీ టు వెహికెల్ హెడ్ల్యాంప్స్
 • యాంటీ తెఫ్ట్ హెచ్చరిక
 • మధ్య వరుసలో స్లైడింగ్

ఎవరైతే సౌందర్యపరమైన అంశాలు కావాలనుకుంటారో వారికి ఈ వాహనం సరైనది.

5. S8 వేరియంట్: రూపాయలు. 11.9 లక్షలు - రూ. 12.0 లక్షలు

ఈ వేరియంట్ లో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి ప్రధాన మార్పులు కూడా అందించడం జరిగింది.

కొన్ని కీలక అంశాలు:

 • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
 • సిల్వర్-పెయింటెడ్ స్కిడ్ ప్లేటు
 • ఇంటిలీ పార్క్స్
 • ముందరి సీట్లు పైన ఆర్మ్రెస్ట్

ఎవరైతే సౌకర్యవంతమైన రోజువారీ డ్రైవర్ లక్షణాలను కోరుకుంటారో వారికి ఈ S8 వేరియంట్ సరైనది.

6. S10 వేరియంట్: రూపాయలు. 12.4లక్షలు - రూపాయలు. 14.5 లక్షలు

Mahindra Scorpio

ఇది స్కార్పియో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ మరియు 6 అంగుళాల టచ్ స్క్రీన్ తో సమాచార వినోద వ్యవస్థ మరియు పూర్తి ఆటోమేటిక్ ఉష్ణోగ్రత నియంత్రణ యూనిట్ వంటి విలాశవంతమైన లక్షణాలతో వస్తుంది.

ఇతర ముఖ్యమైన లక్షణాలు:

 • DRLs
 • ముందు గ్రిల్ పైన క్రోం చేరికలు
 • హెడ్ల్యాంప్స్ లో స్టాటిక్ బెండింగ్ టెక్నాలజీ
 • GPS నావిగేషన్
 • రైన్ అండ్ లైట్ సెన్సార్లు
 • ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
 • యాంటి-పించ్ స్మార్ట్ విండో

ఎవరైతే శక్తివంతమైన ఆఫ్ రోడర్ వాహనాన్ని కావాలనుకుంటారో వారికి ఈ వేరియంట్ సరైనది.

మహీంద్రా స్కార్పియో యొక్క ఎక్స్పెర్ట్ రివ్యూ వీడియో చూడండి

ఇంకా చదవండి

మహీంద్రా స్కార్పియో

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా స్కార్పియో 2014-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience