ఎస్101 మరియు యు301 వాహనాలను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా , త్వరలోనే విడుదలకు సిద్ధం!

ప్రచురించబడుట పైన Jul 06, 2015 11:33 AM ద్వారా Raunak

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎస్101 కొంతమేరకు రెనాల్ట్ క్విడ్ డిజైన్ ని కలిగి ఉన్నటువంటి స్టైలిష్ గా ఉండే హచ్బ్యాక్ క్రాసోవర్ మరియు యు301 వాహనం లాడర్ ఫ్రేమ్ సబ్ 4మీటర్ల బొలేరో ను భర్తీ చేయబడిన వాహనం. 

జైపూర్: ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రారంభాలకి పునాది రాయి వంటిది. మహీంద్రా మొట్టమొదటిసారిగా దాని పెట్రోల్ ఇంజన్ తో రాబోయే ఎస్101 (కోడ్ నేమ్) వాహనంను ప్రారంభించనుంది. యు301 (కోడ్ నేమ్) కూడా బొలేరో యొక్క స్థానంలో భర్తీ చేయబడనుంది మరియు ఇది పట్టణ ప్రయాణికుల కోసం లక్ష్యంగా కనిపించనుంది మరియు ఇది ఇప్పటివరకు మహీంద్రా ఎప్పుడూ తయారు చేయని విధంగా అత్యధిక ప్రీమియంతో రాబోతోంది. మేము నాసిక్ సమీపంలో ఈ రెండు కార్లను రహస్యంగా చూశాము, వారు ఉత్పత్తి సిద్ధంగా ఉంది. వారు బహుశా టెస్టింగ్ యొక్క చివరి దశను అక్కడ చేస్తున్నట్లున్నారు. దీని ప్రారంభం గురించి మాట్లాడుతూ, ఎస్101 మరియు యు301 కార్లు ఈ సంవత్సరం రాబోయే కొన్ని నెలల్లో విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు.

డిజైన్ పరంగా చూస్తే, బొలేరో తో పోలిస్తే యు301 ఖరీదైనదిగా కనిపిస్తోంది కానీ దాని క్లాసిక్ లుక్ మాత్రం అలాగే ఉంది. దీని గ్రిల్ మహీంద్రా కొత్త ఎక్స్ యు వి500 యొక్క హనీ కోంబ్ మెష్ గ్రిల్ ను పోలి ఉంది. ఇది టెస్టింగ్ సమయంలో 15 అంగుళాల రేడియల్స్ తో 5 స్పోక్ ట్విన్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది.

మరోవైపు ఎస్101, మహీంద్రా యొక్క సాధారణ మోడల్ లో లాగా కాకుండా ఒక కొత్త స్లీకర్ గ్రిల్ తో రాబోతోంది. ఎస్101 స్పై షాట్లు కూడా , బీట్ లో ఉన్నటువంటి వెనుక డోర్ హ్యాండిల్స్ ను కలిగి ఉన్నాయని వెల్లడించారు మరియు అది టెస్టింగ్ చేసే సమయంలో 14 అంగుళాల రేడియల్స్ తో స్టీల్ రిమ్స్ తో కనిపించిందని చెప్పారు.

ఎస్ 101 అంతర్భాగాల్లో డాష్ మౌంటెడ్ గేర్బాక్స్ మరియు డాట్సన్ గో ను పోలినటువంటి విస్త్రుతమైన సీట్లను కలిగి ఉంది. మరోవైపు, యు301 లో టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, వాతావరణ నియంత్రణ ఏ.సి మొదలైన అంశాలను కలిగి ఉంది.

యాంత్రికంగా, డీజిల్ పరంగా, రెండు వాహనాలు ప్రస్తుతం మహీంద్రా 1.5-లీటర్ ఆయిల్ బర్నర్ ద్వారా ఆధారితం చేయబడుతుంది. ఈ ఇంజిన్ ఉత్తమంగా 100 బిహెచ్ హ్ పి మరియు 240ఎన్ ఎం టార్క్ ని అందజేస్తుంది. క్వాంటో కారు వలే రెండూ కూడా 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ తో జతచేయబడ్డాయి. 

ఆశ్చర్యకరకమైన విషయమేమిటంటే, మహీంద్రా ఎస్101 ద్వారా దాని మొట్టమొదటి పెట్రోల్ ఇంజన్ ని అందించబోతున్నది. ఇది 3-సిలిండర్ 1.2 లీటర్ యూనిట్ సస్సాంగ్ ఇన్పుట్ ల ఆధారంగా రాబోతున్నది. అంతేకాక, ఎస్101 మరియు యు301 రెండూ కూడా ఏ.ఎం.టి (ఆటోమేటెడ్ మాన్యువల్) ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉంటాయి. 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment on Mahindra Compact XUV

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?