Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మ్యాగ్నెటీ మరెల్లీ వారు మనేసార్ లో ఏఎంటీ ఉత్పత్తికై కొత్త సదుపాయం తెరిచారు!

మారుతి సెలెరియో 2017-2021 కోసం raunak ద్వారా అక్టోబర్ 20, 2015 01:05 pm ప్రచురించబడింది

జైపూర్: ఫియట్ వారి తయారీ వ్యవస్థ అయిన మ్యాగ్నెటీ మరెల్లీ యొక్క కొత్త సదుపాయం తెరిచారు. ఇందులో ఆటోమేటెడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లు తయారు చేస్తారు. ఈ ఫియట్ వారు మరియూ మ్యాగ్నెటీ మరెల్లీ పవర్ ట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి కి మధ్య ఉన్న జాయింట్ వెంచర్. కాని ఈ భారతీయ కంపెనీ మునుపే మారుతి సుజుకీ మరియూ సుజుకీ మోటర్ కంపెనీ వారితో 2007 నుండి పనిచేస్తున్నారు. కొత్త సదుపాయం 7,500 చదరపు అడుగుల విస్థీర్నంలో ఉంది. పూర్తిగా పనిచేయడం ప్రారంభించినప్పుడు, ఈ సదుపాయంలో దాదాపుగా 115 ఉద్యోగులు ఉండి ఏడాదికి 280,000 ఏఎంటీ కిట్స్ తయారు అవుతాయి. దేశ వ్యాప్తంగా 11 తయారీ సదుపాయాలు ఉన్నాయి- 7 సదుపాయాలు మరియూ ఒక ఆర్డీ సెంటర్ న్యూ ఢిల్లీ లో ఉండి, పవర్ ట్రైన్, ఎలక్ట్రానిక్ సిస్టంస్, ఎగ్జాస్ట్ సిస్టంస్ మరియూ సస్పెన్షన్ సిస్టంస్ విభాగాల తయారీ జరుగుతుంది. 3 సదుపాయాలు మరియూ ఆర్డీ సెంటర్ పూణే లో ఉండి లైటింగ్, పవర్ ట్రైన్, ఎగ్జాస్ట్ సిస్టంస్ మరియూ షాక్ అబ్సార్బర్స్ వంటివి ఉంటాయి; ఒక సదుపాయం చెన్నై లో ఉండి ఎగ్జాస్ట్ సిస్టంస్ విభాగం తయారీ జరుగుతుంది.

మరుతీ సుజుకీ సెలెరియో ఏఎంటీ గేర్ బాక్స్ ని మొట్టమొదటి సారిగా దేశంలో ప్రవేశపెట్టింది. మారుతీ వారు దీనిని ఆల్టో కే10 లో అమర్చింది. టాటా వారు జెస్ట్ డీజిల్ లో ఇదే ఏఎంటీ సిస్టం ని అమర్చి తరువాత నానో జెన్ఎక్స్ లో కూడా అమర్చారు. అన్ని కార్లు మ్యాగ్నెటీ మరెల్లీ వారి ఏఎంటీ లనే ఉపయోగిస్తున్నారు. మహింద్రా టీయూవీ300 లో అమర్చిన ఏఎంటీ ని మహింద్రా మరియూ రికార్డో వారు కలసి తయారు చేశారు. పైగా, హ్యుండై (గ్రాండ్ ఐ10 కి) మరియూ రెనాల్ట్ (క్విడ్ కి) వారు జీఎఫ్ నుండి ఏఎంటీ ని ఉపయోగించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కాకపోతే, రెనాల్ట్/డాషియా వారి ఏఎంటీ గేర్ బాక్స్ -ఇజీ-ర్యాట్ ని ఫ్రాంక్‌ఫర్ట్ మోటర్ షోలో గత నెల ఆవిష్కరించారు. దీనితో పాటుగా క్విడ్, డస్టర్ కి కూడా త్వరలోనే ఈ గేర్ బాక్స్ రానుంది.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి సెలెరియో 2017-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర