జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారతదేశంలో 2018 రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ను ప్రారంభించింది

published on మార్చి 18, 2019 10:00 am by khan mohd. కోసం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్

  • 14 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Land Rover Range Rover Sport

ల్యాండ్ రోవర్, ఇండియాలో రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క 2018 మోడళ్లను ప్రవేశపెట్టింది. రెండు ఎస్యువిలు కూడా వారి విలాసవంతాన్ని లేదా వారి రహదారి పరాక్రమాన్ని కోల్పోకుండా క్రొత్త ఫీచర్లతో పాటు వారి ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్స్ కు కొద్దీ కొద్దీ మార్పులను పొందుతున్నాయి. వేరియంట్ వారీ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

 

కారు మోడల్

ధరలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)

డీజిల్

 

పెట్రోల్

రూ 1.74 కోట్లు

రేంజ్ రోవర్ 3.0 వోగ్

-

రూ 1.87 కోట్లు

రేంజ్ రోవర్ 3.0 ఎల్డబ్ల్యూబి వోగ్

రూ 1.87 కోట్లు

రూ .2.26 కోట్లు

రేంజ్ రోవర్ 4.4 ఎల్డబ్ల్యూబి వోగ్ ఎస్ ఈ

రూ 2.05 కోట్లు

-

రేంజ్ రోవర్ 5.0 ఆటోబయోగ్రఫీ

రూ 2.49 కోట్లు

-

రేంజ్ రోవర్ 5.0 ఆటోబయోగ్రఫీ డైనమిక్

రూ. 3.11 కోట్లు

రూ 2.41 కోట్లు

రేంజ్ రోవర్ 4.4 ఎల్డబ్ల్యూబి ఆటోబయోగ్రఫీ

-

రూ .3.76 కోట్లు

రేంజ్ రోవర్ 4.4 ఎల్డబ్ల్యూబి ఎస్వి ఆటోబయోగ్రఫీ

-

-

రేంజ్ రోవర్ 5.0 ఎల్డబ్ల్యూబి ఎస్వి ఆటోబయోగ్రఫీ

రూ 3.88 కోట్లు

 

 

 

రూ. 99.48 లక్షలు

రేంజ్ రోవర్ స్పోర్ట్ 3.0 ఎస్

-

రూ 1.14 కోట్లు

రేంజ్ రోవర్ స్పోర్ట్ 3.0 ఎస్ఈ

రూ 1.10 కోట్లు

రూ 1.30 కోట్లు

రేంజ్ రోవర్ స్పోర్ట్ 3.0 హెచ్ఎస్ఈ

రూ 1.26 కోట్లు

రూ 1.42 కోట్లు

రేంజ్ రోవర్ స్పోర్ట్ 4.4 హెచ్ఎస్ఈ

-

-

రేంజ్ రోవర్ స్పోర్ట్ 5.0 ఆటోబయోగ్రఫీ డైనమిక్

రూ 1.72 కోట్లు

-

రేంజ్ రోవర్ స్పోర్ట్ 5.0 ఎస్వి ఆర్

రూ 1.96 కోట్లు

-

ఇంజిన్లు

రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ రెండూ కూడా ముందు ఇంజిన్లతోనే కొనసాగుతున్నాయి. అయితే, అవి మరింత పనితీరును అందించడానికి కొద్దిగా మార్పు చేయబడ్డాయి. ఈ కార్లలో పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఎంపికలు అందించబడ్డాయి. ముందుగా పెట్రోల్ ఇంజన్ల విషయానికి వాటి, ఇవి సూపర్ఛార్జ్డ్ వి6 తో అందించబడతాయి ఈ ఇంజన్ గరిష్టంగా (340పిఎస్ / 450ఎన్ఎమ్) మరియు వి8 ఇంజన్ తో (525పిఎస్ / 625ఎన్ఎమ్) గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు డీజిల్ ఇంజన్ల విషయానికి వస్తే, టర్బోచార్జెడ్ వి6 తో (259పిఎస్ / 600ఎన్ఎమ్) మరియు వి8 (340పిఎస్ / 740ఎన్ఎమ్) గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి నాలుగు చక్రాల డ్రైవ్ వ్యవస్థతో వివిధ భూభాగ రీతులతో అందించబడుతున్నాయి.

ఎక్స్టీరియర్స్

Land Rover Range Rover Sport

రెండు ఎస్యువిలు కూడా ఎక్స్టీరియర్స్ పరంగా పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఇవి కొన్ని నవీకరణతో ఉన్నాయి. ఉదాహరణకు, మునుపటి గ్రిల్ స్థానంలో 'అట్లాస్' మెష్ గ్రిల్ భర్తీ చేయబడింది, ఇది రేంజ్ రోవర్ వేలర్ వేరియంట్లో మొదటిసారి అందించబడింది. బోనెట్ ఇప్పుడు ఆ చురుకైన అంచులతో పదునైన సైడ్ భాగం వంటివి అందించబడ్డాయి. పెద్ద ఎయిర్ డామ్లతో సవరించిన బంపర్లు మరియు పునఃరూపకల్పన చేయబడిన ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లు రేంజ్ రోవర్ యొక్క రూపానికి తాజాదనాన్ని తెస్తాయి.

Land Rover Range Rover Pixel LED headlamp

కొత్తగా జోడించిన పిక్సెల్ ఎల్ఈడి హెడ్ల్యాంప్ ఫీచర్, ముందు కంటే మరింత ప్రకాశవంతంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న 144 ఎల్ఈడి ఎలిమెంట్స్ ను కలిగి ఉంది. ట్రాఫిక్ గందరగోళానికి గురి కాకుండా మరి కొన్ని అంశాల నుండి సెన్సార్లను కూడా కలిగి ఉంది. వెనుక భాగం విషయానికి వస్తే, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టైల్ లాంప్స్ మరియు రేర్ బంపర్తో బాగా సమీకృతమైన ఎగ్సాస్ట్ అవుట్లెట్లు ఒక క్లీన్ లేఅవుట్ కోసం తయారు చేశారు. రేంజ్ రోవర్ ఒక కొత్త 'బైరాన్ బ్లూ' షాడో ను కూడా పొందుతుంది.

ఇంటీరియర్స్

Range Rover Touch Pro Duo

ల్యాండ్ రోవర్ యొక్క తాజా 'టచ్ ప్రో డుయో' ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్- రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్లో అమర్చబడింది. ఈ యూనిట్ సెంట్రల్ కన్సోల్లో రెండు 10 అంగుళాల టచ్స్క్రీన్లను కలిగి ఉంటుంది. బటన్లు లేకపోవడం వలన చాలా స్పష్టమైన లుక్ ను కలిగి ఉంది.

రేంజ్ రోవర్ ఎయిర్క్రాఫ్ట్-లాంటి సౌకర్యాల స్థాయిలను అందించడాం కోసం "ఎగ్జిక్యూటివ్ క్లాస్" తో వెనుక సీట్లను పొందుతుంది. అవి 40- డిగ్రీ బ్యాకెస్ట్ కోణంతో, ఒక 'హాట్ స్టోన్' మసాజ్ ఫంక్షన్ మోడ్ మరియు శక్తితో కూడిన సెంటర్ ఆర్మ్ రెస్ట్ తో అందించబడతాయి. అయినైజేషన్ కలిగివుంటే, క్లైమేట్ కంట్రోల్  ఇప్పుడు కారులో గాలిని శుభ్రపరుస్తుంది. మూడు జోన్ పరిసర లైటింగ్ (సీలింగ్, డోర్లు మరియు పాదాలు) వ్యవస్థ కూడా అందించబడుతుంది. ఏది ఏమయినప్పటికీ, పార్టీ ట్రిక్- వెనుక వైపు విండో సన్ బ్లైండ్స్ కలిగి ఉంటుంది, ఇది చేతి యొక్క వేవ్ తోనే అమలు చేయబడుతుంది. ఇది సూపర్ కూల్, కాదా?

మరింత సౌలభ్యాన్ని జత చేయడం కోసం, 'క్యూ అసిస్ట్' తో అనుకూల క్రూయిజ్ నియంత్రణ వంటి ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ ఎస్యువి కి ముందు కారును అనుకరిస్తుంది. ఈ ఫంక్షన్ అవసరమైనప్పుడు, వేగవంతం లేదా నెమ్మది చేస్తుంది.

రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు, టయోటా ల్యాండ్ క్రూజర్ కు గట్టి పోటీని ఇస్తున్నాయి.

సిఫార్సు: 2018 ఎవోక్, డిస్కవరీ స్పోర్ట్ ప్రారంభించబడింది; మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ ను పొందండి

రేంజ్ రోవర్ డీజిల్ గురించి మరింత చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన Land Rover Range Rover

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
×
We need your సిటీ to customize your experience