• English
  • Login / Register

జీప్ చెకోరీ & చెకోరీ ఎస్ ఆర్ టి ఆటో ఎక్స్పో వద్ద భారతదేశం లో బహిర్గతం

జీప్ గ్రాండ్ చెరోకీ 2016-2020 కోసం saad ద్వారా ఫిబ్రవరి 04, 2016 04:25 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జీప్, కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో రాంగ్లర్ గ్రాండ్ చెరోకీ మరియు దాని ఎస్ ఆర్ టి వెర్షన్ లను ప్రకటించింది. ఈ బ్రాండ్, 2016 వ సంవత్సరం మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు దీని తరువాత ఈ వాహనాల ధరలు ప్రకటించడం జరుగుతుంది. 

ఈ గ్రాండ్ చెకోరీ వాహనం, లిమిటెడ్ మరియు సబ్మిట్ అను రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లు, ఒకే 3.0 లీటర్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా, 240 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 570 ఎన్ ఎం గల అధిక టార్క్ విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 

ఈ గ్రాండ్ చెకోరీ ఎస్ ఆర్ టి అనునది, ప్రముఖమైన ఎస్యువి యొక్క హై ఆక్టేన్ వెర్షన్ అని చెప్పవచ్చు. అనుబంద సంస్థ అయిన ఎఫ్ సి ఏ, భారతదేశంలోకి ఈ బ్రాండ్ ను తీసుకురావాలని ఎంతగానో కృషి చేసింది కానీ, కొన్ని నెలెల క్రితం మాత్రమే ఇది ఈ విధంగా చోటు చేసుకుంది. ఈ వాహనాల ప్రారంభం తరువాత, భారత మార్కెట్ లో ప్రారంబించబడతాయి. 

ఈ గ్రాండ్ చెకోరీ వాహనం యొక్క బాహ్య భాగాన్ని, కాంటెంపరరీ ఎస్యువి యొక్క డిజైన్ ఆధారంగా రూపొందించడం జరిగింది. దీనితో ఈ వాహనం, బాక్సీ లుక్ ను కలిగి ఉంటుంది. ఈ బాక్సీ సెట్ అప్ మాత్రమే కాకుండా, ఈ ఎస్యువి యొక్క లైన్లు మరియు ఎడ్జ్లు వంటివి మృదువుగా కనబడతాయి. మరచిపోకూడని విషయం ఏమిటంటే, ఈ ఎస్యువి యొక్క హుడ్ స్కూప్లు, లోయరెడ్ స్టాన్స్, ముందు మరియు వెనుక డిఫ్యూజర్లు వంటివి ఈ వాహనానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా, ఈ వాహనం మరింత అద్భుతంగా ఉండటమే కాకుండా హెడ్ ల్యాంప్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.

యాంత్రికంగా ఈ ఎస్యువి వాహనానికి, అత్యంత శక్తివంతమైన 6.4 లీటర్ హెమి వి 8 ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ క్వాడ్రా ట్రాక్ యాక్టివ్ అధారంగా 4 డబ్ల్యూడి ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క అన్ని చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. మరోవైపు సంస్థ ఈ ఎస్యువి వాహనానికి, అధిక పనితీరు కలిగిన బ్రెంబో బ్రేక్ లను అలాగే యాక్టివ్ సస్పెన్షన్ వ్యవస్థ లను అందించడం జరిగింది.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Jeep గ్రాండ్ చెరోకీ 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience