త్వరలో భారతదేశానికి వస్తున్న ఆసక్తికరమైన కార్లు!

published on nov 17, 2015 12:42 pm by raunak for రెనాల్ట్ డస్టర్ 2016-2019

జైపూర్:

Honda BR-V

తయారీదారులు ఫేస్ లిఫ్ట్ మరియు కొత్త మోడల్స్ ప్రారంభించటానికి ప్రణాళిక చేయడం సంవత్సరంలో మొదటిసారి. భారత ఆటో ఎక్స్పో తో(ప్రతి రెండు సంవత్సరాలకి జరుగుతుంది), రాబోయే నెలల్లో టన్నుల వరుసలో ప్రారంభాలు ఉన్నాయి. మేము కేవలం ఇతర వాహనాలతో పాటు 2014 ఎక్స్పోలో ప్రకటించిన ప్రారంభాలను పూర్తి చేశాము మరియు సరికొత్త బ్యాచ్ తమ తమ విభాగాలలో రాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.   

ఎదురుచూస్తున్న 2016 ఆటో ఎక్స్పో ప్రగతి మైదాన్ నుండి చివరిసారిగా మార్చబడిన అదే స్థానం నోయిడా (భారత ఎక్స్పో మార్ట్, గ్రేటర్ నోయిడా) వద్ద, ఫిబ్రవరి 5 నుండి 15 మధ్య జరిగేందుకు సిద్ధంగా ఉంది. ఐకానిక్ మస్కుల్ కార్లు నుండి కొత్త బ్రాండ్లు వరకూ ఈ సమయంలో చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ సమీప భవిష్యత్తులో ప్రారంభం కాబోయే ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన కార్ల జాబితా ఉంది!       

ఫోర్డ్ ముస్తాంగ్

ముస్తాంగ్ భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన సందర్శనం ఇచ్చింది. ఇంతకు మునుపు ఈ వాహనం  పూనే లో ఏఆర్ఏఐ (భారతదేశం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్) ఫెసిలిటీ  వద్ద రహస్యంగా కనిపించింది. బహుశా ఇది ఇక్కడ నిర్ధారణకు తీసుకురాబడి ఉంది. ఇది తరువాత రాబోయే ప్రారంభంతో  భారతదేశంలో ఆటో ఎక్స్పోలో ప్రజా ప్రదర్శన  ఇచ్చే అవకాశం ఎక్కువగా  ఉంది.  

భారతదేశంలో రహస్యంగా పరీక్షించబడిన ముస్తాంగ్

Ford Mustang

జీప్ బ్రాండ్

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ 2014 భారత ఆటో ఎక్స్పోలో అబార్త్ బ్రాండ్ ని అరంగేట్రం చేసింది మరియు ఇది అధికారింగా 595 కాంపిటజోన్ తో ఈ సంవత్సరం ప్రారంభం కానున్నది మరియు తదుపరి  అబార్త్ పుంటో తో వస్తుంది. రాబోయే ఎక్స్పో వద్ద,  ఇటాలియన్-అమెరికన్ అంబ్రెల్లా నుండి జీప్ రానున్నది. ఎస్యువి ల తో దేశం యొక్క అనురాగం భారతదేశంలో బ్రాండ్ పురోగమించేందుకు సహాయపడుతుంది. ఈ సంవత్సరంలో  చేసిన పెద్ద ప్రకటనలు,  స్థానికంగా ఉత్పత్తి అయ్యే నమూనాల కొరకు ఫియట్ యొక్క రాజనంగన్ ప్లాంట్ విస్తరణకు లో $ 280 మిలియన్ పెట్టుబడి మరియు జీప్ యొక్క కొత్త కాంపాక్ట్ ఎస్యువి కోసం భారతదేశం లో ఒక అంతర్జాతీయ రంగప్రవేశం జరిగేందుకు సిద్దంగా ఉంది.  

 ఈ సమయంలో ఖచ్చితంగా భారతదేశానికి జీప్ బ్రాండ్ వస్తుంది

టాటా - కైట్ హాచ్ / సెడాన్, నెక్సాన్, హెక్సా   

గత ఎక్స్పో వలే, స్వదేశ వాహన తయారీసంస్థ టాటా మోటార్స్ కోసం చాలా జరుగుతుంది. 2014 ఎక్స్పో వద్ద టాటా సంస్థ జెస్ట్ మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యువి కాన్సెప్ట్ తో పాటూ బోల్ట్ ని ప్రవేశపెట్టింది. 2016 ఎక్స్పో వద్ద, కైట్ సిబిలింగ్స్ అయినటువంటి  నెక్సాన్ ఎస్యువి మరియు హెక్సా క్రాసోవర్ ల యొక్క ప్రొడక్షన్ వెర్షన్ కొరకు ఎదురుచూస్తున్నాము. కైట్ సిబిలింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ హ్యాచ్  కాంపాక్ట్ సెడాన్ రావడానికి ముందు వచ్చే నెల ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. కొద్ది రోజుల క్రితం, టాటా మోటార్స్ వారి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా లియోనెల్ మెస్సీ ని ప్రకటించింది మరియు కొత్త కైట్ హాచ్ టీజర్ ఆయనతో విడుదల చేయించింది.    

లియోనెల్ మెస్సీ ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన టాటా మోటార్స్

మొదటి సారిగా టాటా కైట్ వారి ప్రకటన: ఇందులో లియోనెల్ మెస్సీ కనపడ్డారు

Tata Kite

ఫోర్డ్ ఎండీవర్

ఈ సంవత్సరం వారి మొత్తం లైనప్ పునరుద్ధరించిన తరువాత,  ఫోర్డ్ ఇండియా మొదటి తరం అమ్మకాలు జరిగిన  ఒక దశాబ్దం తర్వాత దేశంలో ఎండీవర్ రెండవ తరం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. థాయిలాండ్ లో కొత్త ఎండీవర్  నడపడం జరిగింది  మరియు ఇది పాత తరం నమూనా కంటే పూర్తి విభిన్నంగా ఉంది. ఇది ఒక సరికొత్త ఇంజిన్ల సమితిని పొంది ఉంది మరియు అమెరికన్ వాహనతయారి సంస్థ యొక్క కొత్త టెర్రైన్ రెస్పాన్స్ సిస్టం తో పాటు ట్రాన్స్మిషన్స్ ని జరుపుతుంది. 

2016 Ford Endeavour

రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్

కాంపాక్ట్ క్రాసోవర్ విభాగంలో హ్యుందాయి క్రెటా యొక్క అమ్మకాలు పెరగడంతో, దేశంలో ఈ విభాగంలో అధిపతయిన రెనాల్ట్  డస్టర్ కూడా పోటీ కి ధీటుగా సౌందర్యపరంగా మరియు సాంకేతికంగా కూడా చాలా మార్పులు చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దీని ఫేస్‌లిఫ్ట్ కొన్ని నెలల క్రితం బహిర్గతమయ్యింది మరియు నివేదిక ప్రకారం ఇది 2016 భారత ఆటో ఎక్స్పోలో వస్తోంది. యాంత్రిక నవీకరణల పరంగా డస్టర్ ఫేస్లిఫ్ట్ పరీక్ష మ్యూల్ ఇటీవల ఒక ఏఎంటి గేర్బాక్స్ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) వ్యవస్థతో రహస్యంగా కనిపించింది. 

Renault Duster       

హోండా బీఅర్‌వి

హోండా కూడా రాబోయే బీఅర్‌వి తో కాంపాక్ట్ క్రాస్ఓవర్ /ఎస్యువి విభాగంలో వచ్చే అవకాశం ఉంది. దీనిని ఇటీవల జపాన్ లో నడపడం జరిగింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, బీఅర్‌వి 3-వరుసలు సీటింగ్ కలిగిన విభాగంలో మొట్టమొదటి కాంపాక్ట్ క్రాస్ఓవర్ / ఎస్యువి. ఇంజిన్ ఎంపికలు సిటీ మాదిరిగానే ఉంటుంది, అయితే ట్రాన్స్మిషన్ ఎంపికలు మాత్రం కొత్తగా ప్రత్యేకంగా బిఆర్-వి కొరకు అభివృద్ధి చేయబడినవి.  6-స్పీడ్ మ్యాన్యువల్ పెట్రోల్ మరియు డీజిల్ కోసం ప్రామాణికంగా ఉంటుంది. అయితే పెట్రోల్ ఒక కొత్త ఇ-సివిటి ని కూడా కలిగి ఉంటుంది.  

హోండా బీఆర్-వీ ఫోటో గ్యాలరీ - జపాన్ నుండి ప్రత్యేకం

Honda BR-V

మారుతి సుజుకి - విటారా, ఇగ్నిస్ మరియు వైబిఎ  కాంపాక్ట్ ఎస్యువి

భారతదేశం యొక్క  అతిపెద్ద వాహన తయారీసంస్థ మారుతి సుజికీ నుండి రాబోయే నెలల్లో కొత్త విటారా, ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మరియు వైబిఎ కాంపాక్ట్ ఎస్యువి ని చూస్తామని ఊహిస్తున్నాము. విటారా, ఐరోపాలో గత ఏడాది బహిర్గతమయ్యింది, అయితే ఇగ్నిస్ ఇటీవల 2015 టోక్యో మోటార్ షోలో  తెర ముందుకు వచ్చింది మరియు వైబిఎ ఎక్స్పోలో భారతదేశంలో తెర ముందుకు రాబోతుందని ఊహిస్తున్నాము. ఈ ఉత్పత్తులు అన్నీ కూడా సంస్థ యొక్క నెక్సా ప్రీమియం డీలర్షిప్ ద్వారా అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.     

మారుతి సుజుకి విటారా త్వరలో రాబోతోంది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ డస్టర్ 2016-2019

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience