ఇన్ఫినిటీ QX30 క్రాస్ఓవర్ బహిర్గతం

నవంబర్ 19, 2015 05:28 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఇన్ఫినిటీ QX30 జపనీస్ వాహన తయారీసంస్థచే ఆవిష్కరించబడింది మరియు ఇది సంస్థ యొక్క కొత్త ఆల్ వీల్ డ్రైవ్ క్రాస్ఓవర్. ఇన్ఫినిటీ, జెనీవా మోటార్ షోలో QX30 కాన్సెప్ట్ ని ప్రదర్శించింది మరియు QX30 యొక్క ప్రొడక్షన్ వెర్షన్ కాన్సెప్ట్ కి చాలా దగ్గరగా ఉంది. బాహ్య భాగాల పరంగా, కారు ముందు భాగానికి వస్తే గ్రిల్ యొక్క పైన మరియు క్రింద క్రోం చేరికలతో ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా కారు ప్రముఖమైన ఫాక్స్ స్కిడ్ ప్లేటుని కూడా కలిగి ఉంది. ఈ స్కిడ్ ప్లేటు సమాంతరంగా రెండు ఎగ్జాస్ట్ వాల్వులతో అమర్చబడి మరియు దాని పైన నల్లని బాడీ క్లాడింగ్ తో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని రైడ్ హైట్ 45mm. ఇన్ఫినిటీ QX30  పదునైన కోణం మరియు LED టెయిల్‌ల్యాంప్స్  కలిగియున్నటువంటి విండ్షీల్డ్ ని కలిగి ఉంటుంది.

లోపలివైపు, QX30 క్రాస్ఓవర్ హాచ్బాక్ వర్షన్ లో చూసిన విధంగా ఉండే 7-అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థతో అందించబడుతుంది. ఈ క్రాస్ఓవర్ అన్ని కోణాలలో చూడగలిగే మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు పార్కింగ్ సహాయం వ్యవస్థ వంటి భద్రతా అంశాలతో అందించబడుతుంది. అలానే ఇది యాంటీ రోలర్ బాల్స్ మరియు బిరుసైన స్ప్రింగ్స్ తో అమర్చబడియున్నపునః రుద్ధరించబడిన సస్పెన్షన్ ని కలిగి ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే,  QX30 వాహనం బహుశా  AWD Q30 లో ఉన్నటువంటి విధమైన  2.2లీటర్ 168bhp శక్తిని అందించే డీజిల్ మరియు 2.0 లీటర్  208bhp శక్తిని అందించే పెట్రోల్ మోటార్ తో అమర్చబడి ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా,  QX30 వాహనం  2016 మధ్య కాలంలో అమ్మకాలకు వెళ్ళవచ్చని అంచనా మరియు మెర్సెడెజ్-బెంజ్ GLA  మరియు బిఎండబ్లు  X1 కి పోటీగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి

ఇంఫినిటీ వారు క్యూ30 లగ్జరీ హ్యాచ్బ్యాక్ ని బహిర్గతం చేశారు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience