ఇండియా-స్పెక్ స్కోడా కరోక్ వెల్లడి, జీప్ కంపాస్ తో పోటీ పడుతుంది
స్కోడా కరోక్ కోసం rohit ద్వారా ఫిబ్రవరి 07, 2020 12:48 pm ప్రచురించబడింది
- 33 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
స్కోడా యొక్క మిడ్-సైజ్ SUV భారతదేశంలో పెట్రోల్ తో మాత్రమే అందించబడుతుంది
- LED హెడ్‌ల్యాంప్‌లు మరియు L-ఆకారపు టెయిల్ లాంప్స్‌తో కూడిన కోడియాక్ లాంటి ఫ్రంట్ ప్రొఫైల్ ను కలిగి ఉంది.
- 1.5-లీటర్ TSI ఇంజన్ ద్వారా పవర్ ని పొందుతూ, 7-స్పీడ్ DSG తో జత చేయబడి ఉంది.
- పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కనెక్ట్ టెక్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
- దీని యొక్క ముఖ్య ప్రత్యర్థులు జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్.
స్కోడా 2020 మధ్య నాటికి దాని మిడ్-సైజ్ SUV కరోక్ ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు మేము ఇంతకు ముందే నివేదించాము. అయితే, చెక్ కార్ల తయారీ సంస్థ కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పోలో SUV ని వెళ్ళడించింది మరియు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనుంది.
కరోక్ కేవలం BS 6-కంప్లైంట్ 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది, ఇది 150 Ps పవర్ మరియు 250 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఎంపికతో జతచేయబడుతుంది. స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా కు BS 6 ఎరా లో డీజిల్ వాహనాలను విక్రయించే ప్రణాళికలు లేనందున, కరోక్ దాని అన్ని ఇతర ఆఫర్ల మాదిరిగానే మన దేశంలో పెట్రోల్ తో మాత్రమే అందించబడే ఉత్పత్తి అవుతుంది.
స్కోడా కరోక్ ను అనేక లక్షణాలతో అందిస్తుంది. ఇది 18-ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ను పొందుతుంది. ఇది 9 ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు EBD తో ABS వంటి భద్రతా లక్షణాలతో కూడా అందించబడుతుంది.
కరోక్ ధరలు రూ .20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే ఇది ప్రారంభంలో పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU) మార్గం ద్వారా తీసుకురాబడుతుంది. స్కోడా 2020 ఏప్రిల్ నాటికి మిడ్-సైజ్ SUV ని విడుదల చేయనుంది. ఇది MG హెక్టర్, హ్యుందాయ్ టక్సన్, జీప్ కంపాస్, మహీంద్రా XUV 500, టాటా హారియర్ మరియు గ్రావిటాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful