భారతదేశ ప్రత్యేక తదుపరి తరం ఫార్చ్యూనర్ ను ఇండోనేషియా లో ప్రారంభించిన టయోటా
published on జనవరి 25, 2016 06:59 pm by manish కోసం టయోటా ఫార్చ్యూనర్ 2016-2021
- 11 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రపంచంలో అతిపెద్ద మోటారు వాహన తయారీదారుడు అయిన టయోటా, దాని ప్రీమియం ఎస్యూవి విభాగంలో ఇండోనేషియా లో ఫార్చ్యూనర్ యొక్క తదుపరి తరం నమూనాను ప్రారంభించింది. ఈ ప్రయోగం, ఫిలిపైన్స్ మార్కెట్ లో ఎస్యువి యొక్క పరిచయాన్ని అనుసరిస్తున్నారు మరియు 2016 ఫార్చ్యూనర్ ఆర్పి 442,000,000 నుండి 631,500,000 ఒక ధర ట్యాగ్ తో ఇండోనేషియా లో ప్రారంభించబడింది (భారతీయ లెక్కల ప్రకారం రూ 22 లక్షల నుండి రూ 31 లక్షల వరకు). ఈ ఎస్యువి యొక్క పునాదిని, రెండవ తరం టయోటా హైలక్స్ పిక్ అప్ ట్రక్ నుండి తీసుకోబడినది. ఇండోనేషియా లో, 2016 టయోటా ఫార్చ్యూనర్ 4X2 మరియు 4X4 రెండు డ్రైవ్ కంఫిగరేషన్ లతో కలిపి మొత్తం ఆరు వేరియంట్ లలో అందుబాటులో ఉంది.
తదుపరి తరం టయోటా ఫార్చ్యూనర్ యొక్క భారత వేరియంట్, రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది అని ఆశిస్తున్నారు. ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ కు, 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 174.3 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ నాలుగు సిలండర్ల డైరెక్ట్ ఇంజక్షన్ టర్బో డీజిల్ ఇంజన్, సంస్థ యొక్క 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడినప్పుడు 450 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఇంజన్, ప్రామాణిక 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడినప్పుడు అత్యధికంగా 420 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ పవర్ ప్లాంట్ ఆకట్టుకునే విధంగా అనిపించవచ్చు కానీ, చెవ్రోలెట్ ట్రయల్బ్లేజర్ మరియు ఇటీవలే విడుదల ఫోర్డ్ ఎండీవర్ రెండిటి తో పోలిస్తే తక్కువ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ రెండు వాహనాలలో ఉండే ఇంజన్లు అధిక పవర్ ను అదే విధంగా అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా టయోటా ఫార్చ్యూనర్ కు, దిగువ శ్రేణి 2.4 లీటర్ వేరియంట్ ను అందించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అన్ని కొత్త టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు 2016 భారత ఆటో ఎక్స్పోలో మొదటిసారి ఆవిష్కరించబడుతాయి
- భారత ప్రత్యేక: 2016 టొయోటా ఫార్చునర్ ఆస్ట్రేలియాలో విడుదల అయ్యింది
- Renew Toyota Fortuner 2016-2021 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful