• English
  • Login / Register

ఇండియా బౌండ్: ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ ను బయటకు వెలువరించిన సుజుకి - ఇండోనేషియా నుండి ప్రత్యక్ష ప్రసారం

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం raunak ద్వారా ఆగష్టు 20, 2015 05:49 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 7 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జకార్తా: మారుతి సుజుకి తమ యొక్కఎర్టిగా ఫేస్ లిఫ్ట్ మోడల్ ను ప్రస్తుతం జరుగుతున్న 2015 గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో (జి ఐ ఐ ఏ ఎస్) లో అధికారికంగా వెల్లడించింది. ఈ నవీకరించబడిన ఎంపివి రాబోవు కొన్ని నెలల్లో భారతదేశం లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగా ఇండోనేషియా లో అదే ఇంజన్ తో, లోపల మరియు బయట కాస్మెటిక్ మార్పులను అందుకుంది. అయితే, భారతదేశం లో మారుతి సుజుకి సంస్థ మెరుగైన ఇంధన సామర్ధ్యంను అందించడానికి స్విఫ్ట్ మరియు డిజైర్ లో వలె 1.4 లీటర్ వివిటి పెట్రోల్, 1.3 లీటర్ డిడీఇఎస్ డీజిల్ ఇంజన్లతో ఎర్టిగాలో కూడా అందిస్తుంది. 

బయట వైపు మార్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే సుజుకి, ఎర్టిగా ను క్రొత్త మూడు-స్లాట్ క్రోమ్ గ్రిల్ తో అందించింది. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ అల్లికతో క్రొత్త బంపర్ ను అందించింది. ఈ ఎంపివి యొక్క హెడ్ లైట్లలో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. బోనెట్ మాత్రం చిన్న చిన్న మార్పులతోకొత్త గ్రిల్ తో పొందుపరచబడి ఉంది.

సైడ్ ప్రొఫైల్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు, కానీ జంట 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ తో ఉంది( మారుతి సుజుకి మన దేశంలో అల్లాయ్ వీల్స్ ను అందిస్తుందో లేదో మనం చూడాలి). వెనుక వైపున, ఎర్టిగా మార్పు చెందని టెయిల్ లైట్స్ మధ్యలో ఒక జత రిఫ్లెక్టర్లతో ఆకర్షించే క్రోమ్ స్ట్రిప్ సమితిని కలిగి ఉంది. 

లోపలివైపు చూసినట్లయితే, భారతదేశంలోని స్విఫ్ట్ మరియు డిజైర్ లో చేసినట్లుగా ఎర్టిగా లో కూడా పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్, ఎలక్ట్రానిక్ ఫోల్దబిల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ వంటి అంశాలతో మార్పులను చేశారు. మారుతి సుజుకి మన దేశంలో ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ లో వారి యొక్క 7 అంగుళాల చురుకైన సమాచార వ్యవస్థను ప్రవేశపెట్టవచ్చునని ఆశిస్తున్నారు. అంతేకాక,ఇండోనేషియన్ ఫేస్ లిఫ్ట్ ఎర్టిగా లో వలె భారతదేశంలో ప్రవేశ పెట్టబోయే వెర్షన్ లో కూడా 50:50 స్ప్లిట్ చివరి వరుస సీట్లకి ఫోల్డింగ్ ఎంపికను తీసుకు రానుంది. 

was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience