• English
    • Login / Register

    ఇండియా లో ప్రారంభం కావలసిన 2016 డస్టర్, రష్యాలో ముందుగానే విడుదల

    జూన్ 26, 2015 04:24 pm saad ద్వారా ప్రచురించబడింది

    • 13 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: ఫ్రెంచ్ ఆటో సంస్థ అయిన రెనాల్ట్ రష్యన్ మార్కెట్ లో తన సరికొత్త డస్టర్ ని విడుదల చేసింది. ఇదే డస్టర్ ని కొంతకాలం క్రితం బ్రెజిలియన్ మార్కెట్లో ప్రారంభించడం జరిగింది. కారు ఔత్సాహికులకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ డస్టర్ వచ్చే ఏడాది భారత మార్కెట్లో అడుగు పెట్టబోతున్నది. రష్యా లో విడుదలైన ఈ కారు, చాలా ఆకర్షణీయంగా, ఖరీదైన అతర్భాగాలతో అలాగే కొత్త ఇంజిన్లను కలిగి ఉంది.

    ఏమిటి కొత్త?

    ఈ ప్రశ్న చాలా మంది మనసులో ఉంది. దీని సమాదానం కోసం చాలా మంది ఎదురు చుస్తున్నారు. సరికొత్త డస్టర్ లో ఇవి ప్రధాన మార్పులు.

    • దీని ముందరి భాగం కొత్త ఖరీదైన నల్లటి గ్రిల్, పునరుద్ధరింపబడిన హెడ్ లైట్ క్లస్టర్ ఇప్పుడు ఎల్ ఇ డి డే టైమ్ రన్నింగ్ లైట్లు తో రాబోతుంది మరియు దీనిలో స్కిడ్ గార్డ్ సిల్వర్ పూతతో అలకరించబడి ఉంది.
    • దీని పక్క భాగం సరికొత్త వీల్ డిజైన్ ని కలిగి ఉంది. దీని బలమైన రూఫ్ రైల్స్, డస్టర్ చిహ్నాన్ని కలిగి ఉండటం వలన అందరి దృష్టి ని ఆకర్షించేలా చేస్తాయి.
    • దీనిలో వెనుక ఉండే టైల్ లైట్స్ ఇప్పుడు ప్రస్తుత వెర్షన్ కంటే ఎక్కువ ఖరీదైనవి.

    అంతర్గత బాగాలు

    • ఈ కార్ లోపలి భాగం విషయానికి వస్తే, ఒక కొత్త సెంట్రల్ కన్సోల్ తో పాటు నవీకరించబడిన సమాచార వ్యవస్థ తో రాబోతుంది. ఈ ఆధునిక సమాచార వ్యవస్థ,
    • నావిగేషన్ మీడియా ను మద్దతిస్తుంది. ఇది, ప్రస్తుత ట్రాఫిక్ సమయాన్ని తగ్గిస్తుంది.
    • రేర్ వ్యూ కెమెరా, హీటెడ్ విండ్ స్క్రీన్ మరియు క్రూజ్ కంట్రోల్ తో పాటు ఇతర అంశాలతో రాబోతుంది.
    • నవీకరించబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో మంచి లైటింగ్ తో రాబోతుంది.
    • క్యాబిన్ లో మెరుగైన ఇన్సులేషన్

    ఇంజన్లు

    • ఈ డస్టర్ యొక్క ధిగువ శ్రేణి వేరియంట్లు, నిస్సాన్ సెంత్రా మరియు రష్యా లో ఉన్న టిడా నుండి తీసుకోబడిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 114 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.
    • ఈ డస్టర్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, ప్రస్తుతం ఉన్న అదే 2.0 లీటర్ ఇంజన్ తో రాబోతుంది. కానీ, కొంచెం మార్పుతో రాబోతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 143 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డస్టర్ 135 bhp పవర్ ను మాత్రమే విడుదల చేస్తుంది.
    • 90 bhp పవర్ ను విడుదల చేసే డీజిల్ ఇంజన్, 109 bhp పవర్ ను విడుదల చేశేలా పునరుద్దరించి అదే డీజిల్ ఇంజన్ ను తీసుకురాబోతున్నారు.

    రెనాల్ట్ ఇటీవల నవీకరించన డస్టర్ ను భారతదేశంలో ప్రారంభించింది. కాబట్టి భారతదేశం లో, కొత్త వెర్షన్ విడుదల సమయం పట్టేలా ఉంది. దీనిని 2016 లో ప్రారంబించే అవకాశాలు ఉన్నాయి.

    was this article helpful ?

    Write your Comment on Renault డస్టర్ 2016-2019

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience