• English
  • Login / Register

హ్యుండై ఇండియా అక్టోబర్ కి అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది; క్రేటా జోరుని కొనసాగిస్తోంది

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా నవంబర్ 03, 2015 01:22 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

హ్యుండై వారు గ్రాండ్ ఐ10 యొక్క అత్యధిక నెలవారీ అమ్మకాలను 14,079 యూనిట్ల వద్ద నమోదు చేసింది

హ్యుండై మోటర్ ఇండియా లిమిటెడ్ వారు రికార్డు స్థాయిలో  అత్యధిక దేశీయ అమ్మకాలను గత నెల నమోదు చేశారు.  ఈ కొరియన్ ఆటో తయారీదారి గత నెల దేశీయ మార్కెట్లో గత నెల 47,015 యూనిట్లను అమ్మడం జరిగింది మరియూ 14,777 యూనిట్లను  ఎగుమతి చేశారు. మొత్తం కలిపి 61,792 యూనిట్ల సంచిత అమ్మకాలను నమోదు చేయడం జరిగింది.

అక్టోబర్ అమ్మకాల గురించి మాట్లాడుతూ, హెచ్ఎంఐఎల్ కి సేల్స్ మరియూ మార్కెటింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్. రాకేష్ శ్రీవాస్తవ గారు," హ్యుండై వారి 47,015 యూనిట్ల అమ్మకాలు ఈ కంపెనీ కి ఒక రికార్డు. 14,079 యూనిట్ల గ్రాండ్ ఐ10 అమ్మకాలు కూడా అత్యధిక నమోదు,  ఎలీట్ ఐ20 ఇంకా యాక్టివ్ యొక్క అమ్మకాల సంఖ్య 18,244 గా ఉన్నాయి. కస్టమర్ యొక్క వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ఉత్పత్తి వేగాన్ని పెంచాము," అని అన్నారు.

గ్రాండ్ ఐ10 విడుదల అయినప్పటి నుండి ఇదే నెల వారీలో అత్యధిక అమ్మకాల నమోదు. అమ్మకాల పరంగా ఎలీట్ ఐ20 మరియూ క్రేటా లు బాగారాణిస్తున్నాయి. జులై లో క్రేటా విడుదల అయ్యింది మరియూ హ్యుండై వారు నెలలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క అమ్మకాలు దాదాపుగా 7 వేలుగా చేయగలుగుతున్నారు. ఎలీట్ ఐ20/యాక్టివ్ గురించి మాట్లాడుతూ కంపెనీ వారు నెలలో 10 వేల యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగలుగుతున్నారు. పైగా, తాజాగా కంపెనీ వారు క్రేటా మరియూ ఐ20 యొక్క ధరలను పెంచారు.

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience