• English
  • Login / Register

రూ. 8.59 లక్షల వద్ద ప్రారంభమైన హ్యూందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం akshit ద్వారా జూలై 21, 2015 01:55 pm సవరించబడింది

  • 17 Views
  • 8 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో అగ్రగామి అయిన హ్యూందాయ్, తమ క్రెటాను ఈరోజు భారత మార్కెట్లో రూ. 8.59 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ప్రవేశపెట్టింది. ఇది కొరియన్ కార్ల తయారీ సంస్థ యొక్క తాజా సమర్పణ. ఇది రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెరానో, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు త్వరలోనే-ప్రారంభం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న మారుతి సుజుకి ఎస్-క్రాస్ వంటి వాటితో గట్టి పోటీకి సిద్ధంగా ఉంది.

చాలా కోణాల నుంచి చూస్తే క్రెటా, ప్రీమియం మరియు ఖరీదైన శాంటా ఫే వలే కనిపిస్తుంది. ఆకర్షణీయంగా కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ట్రిపుల్-స్లాట్ క్రోమ్ హెక్సాగోనల్ రేడియేటర్ గ్రిల్, ప్రొజెక్టర్ మరియు డీఅర్ ఎల్ ఎస్ తో అమర్చబడియున్న దూరదృష్టి గల హెడ్లైట్లు( అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే) మరియు పదునైన నిలువు ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ముందరి ముఖ భాగాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. అగ్ర శ్రేణి వేరియంట్లో 17 అంగుళాల అలాయ్ వీల్స్, ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు స్టైలిష్ టెయిల్ లైట్స్ తో పక్క భాగం, అంతా కలిసి మొత్తం వాహనాన్ని ఆకర్షణీయంగా చేస్తాయి. 

దీనిలో అంతర్భాగాలు ఎక్కువ లేదా తక్కువ శాతం విజయవంతమైన ఎలైట్ ఐ 20 లా కనిపిస్తాయి. అగ్ర శ్రేణి వేరియంట్లలో రెండు టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ ఉండడం వలన సెంటర్ కన్సోల్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంతేకాకుండా, ఆడియో సిస్టమ్ 1 జిబ్ మెమొరీటో ఇన్ బిల్ట్ చేయబడి హ్యుందాయి లో మునుపెన్నడూ లేని విధంగా ఈ వాహనం రాబోతున్నది. ఇంకా దీనిలో క పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా, ఆరు ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లక్షణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయి క్రెటా సబ్ 4 మీటర్ కాదు కనుక లోపల చాలా విశాలంగా ఉంటుంది. 

యాంత్రికంగా, క్రెటా మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. అవేమిటంటే, 123పిఎస్-1.6 లీటర్ పెట్రోల్, 90పిఎస్-1.4 లీటర్ డీజిల్ మరియు 128పిఎస్-1.6 లీటర్ 

లైవ్ అప్ డేట్స్ (కీప్ రిఫ్రెష్ )

3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ
హ్యుందాయ్ ప్రకారం, క్రెటా ఇప్పుడు 15000 బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.
అన్ని వేరియంట్స్ లో ఏబిఎస్ వ్యవస్థ ఉంది.
క్రెటా యొక్క ఎస్+ వేరియంట్ లో డ్రైవర్ & ప్రయాణీకుల కోసం ఎయిర్ బాగ్స్ ను అనుసంధానం చేశారు.
బేస్ మరియు ఎస్ వేరియంట్లలో ఎయిర్ బ్యాగ్స్ ను ప్రవేశ పెట్టలేదు. ఎస్ ఎక్స్ వేరియంట్లో మాత్రమే సైడ్ మరియు కర్టెయిన్ బ్యాగ్స్ ను అందించారు.
క్రెటా యొక్క బాడీ షెల్ ను ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి అభివృద్ధి చేశారు.

క్రెటా ఇంధన సామర్థ్య గణాంకాలు

  • 1.6 పెట్రోల్ 15.29 కి.మీ/లీ.
  • 1.6 డీజిల్ ఎంటి 19.67 కి.మీ/లీ. 
  • 1.6 డీజిల్ ఏటి 17.01 కి.మీ/లీ. 
  • 1.4 డీజిల్ 21.38 కి.మీ/లీ. 

ధరలు జాబితా

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ 

హ్యుందాయ్ క్రెటా 1.6ఎల్ పెట్రోల్ బేస్ - రూ.8.59 లక్షలు 
హ్యుందాయ్ క్రెటా 1.6ఎల్ పెట్రోల్ ఎస్ - రూ. 9,57 లక్షలు 
హ్యుందాయ్ క్రెటా 1.6ఎల్ పెట్రోల్ ఎస్ఎక్స్ + - రూ. 11.19 లక్షలు 

హ్యుందాయ్ క్రెటా 1.4ఎల్ డీజిల్

హ్యుందాయ్ క్రెటా1.4ఎల్ సీఅర్డి ఐ బేస్ - రూ 9.46 లక్షలు 
హ్యుందాయ్ క్రెటా1.4ఎల్ సీఅర్డి ఐ ఎస్ - రూ 10.42 లక్షలు 
హ్యుందాయ్ క్రెటా 1.4ఎల్ సీఅర్డి ఐ ఎస్ + - రూ 11.45 లక్షలు 

 హ్యుందాయ్ క్రెటా1.6ఎల్ డీజిల్

హ్యుందాయ్ క్రెటా 1.6ఎల్ సీఅర్డి ఐఎస్ఎక్స్ - రూ 11.59 లక్షలు
 హ్యుందాయ్ క్రెటా 1.6ఎల్ సీఅర్డి ఐ ఎస్ఎక్స్ + - రూ 12,67 లక్షలు 
హ్యుందాయ్ క్రెటా1.6ఎల్ సీఅర్డి ఐ ఎస్ఎక్స్ + ఎ టి - రూ13.57 లక్షలు 
హ్యుందాయ్ క్రెటా 1.6ఎల్ సీఅర్డి ఐ ఎస్ఎక్స్ (ఓ) - రూ 13.60 లక్షలు 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience