• English
    • Login / Register

    పూర్తిస్థాయిలో వెల్లడైన హ్యూందాయ్ క్రెటా రహస్య చిత్రాలు

    హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా జూన్ 22, 2015 03:17 pm ప్రచురించబడింది

    • 21 Views
    • 1 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: హ్యుందాయ్ క్రెటా జూలై 21 న విడుదల సిద్దంగా ఉంది అన్న విషయం మనకు తెలిసిందే, ఇప్పటి నుండి దాదాపు ఒక నెల ఉంది. కానీ, ఇటీవల ఏ రకమైన ముసుగులు లేకుండా, గూడచర్యం చెయ్యబడింది. ఎస్యువి అయిన క్రెటా,   రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రనో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ (యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు) మరియు రాబోయే మారుతి సుజుకి ఎస్ క్రాస్ వంటి వాహనాలతో గట్టిపోటీను ఇవ్వడానికి త్వరలో రానుంది. అంతేకాకుండా, మహీంద్రా స్కార్పియో & 2015 టాటా సఫారి స్టోర్మ్ తో కూడా గట్టి పోటీను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

    డిజైన్ గురించి మాట్లాడటానికి వస్తే, చైనా లో ప్రత్యేకంగా అమ్ముడుబోతున్న ఐఎక్స్25 తో పోలిస్తే, సూక్ష్మ మార్పులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైసెన్స్ ప్లేట్ మీద క్రోమ్ గార్నిష్ ఉంటుంది మరియు చైనీస్ వాహనాలతో పోలిస్తే,  డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ రావటం లేదు. వీటితో పాటు, ప్రతి భాగం ఐఎక్స్ 25 ను పోలి ఉంటుంది. దీని యొక్క డిజైన్ గురించి చెప్పాలంటే, ఈ క్రెటా అనేది సాంట ఫీ ను పోలి ఉంటుంది. 

    ఇంజన్ పరంగా చెప్పాలంటే, క్రెటా, వెర్నా నుండి ఇంజిన్లను సేకరించి రాబోతుంది. మరియు ఇది 3 ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుందని బావిస్తున్నారు. అవి వరుసగా,  రెండు డీజిల్, ఒక పెట్రోల్. ఈ క్రెటా యొక్క డీజిల్ వేరియంట్లు 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ సీఅర్ డి ఐ ఇంజన్ లతో రాబోతుంది మరియు 1.6 పెట్రోల్ ఇంజన్. 1.6 డీజిల్ ఇంజన్ అత్యధికంగా 128PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అదే విధంగా, టార్క్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 260Nm టార్క్ ను విడుదల చేస్తుంది. హ్యుందాయ్ క్రెటా యొక్క ఇంజన్ లు చైనా లో ఉండే ఐఎక్స్25 లో లాగా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటాయి. అయితే, ఈ వాహనం యొక్క డీజిల్ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. వీటి యొక్క పెట్రోల్ వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి.   

    was this article helpful ?

    Write your Comment on Hyundai క్రెటా 2015-2020

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience