ఒక నెలలో 51,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించిన Hyundai Creta Facelift

హ్యుందాయ్ క్రెటా కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 06, 2024 07:24 pm ప్రచురించబడింది

  • 130 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సరికొత్త క్యాబిన్, మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు గతంలో కంటే మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

Hyundai Creta

  • హ్యుందాయ్ జనవరి మొదటి వారంలో 2024 క్రెటా కోసం దాని బుకింగ్ లను ప్రారంభించింది, అయితే దాని ధరలు జనవరి 16న ప్రకటించబడ్డాయి.
  • 2024 క్రెటా లోపల మరియు వెలుపల సమగ్రమైన డిజైన్ మార్పులను పొందింది.
  • ఇది ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే కోసం 10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది.
  • క్రెటా ఇప్పుడు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS / 253 Nm) ఎంపికతో వస్తుంది, అంతేకాకుండా ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో జత చేయబడింది.

జనవరి 2024లో హ్యుందాయ్ క్రెటాకి మిడ్‌లైఫ్ అప్‌డేట్ అందించబడింది, తాజా డిజైన్ మరియు అనేక కొత్త ఫీచర్‌లను అందుకుంది. హ్యుందాయ్ జనవరి మొదటి వారంలో ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా కోసం ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించింది మరియు కేవలం ఒక నెలలో, కాంపాక్ట్ SUV 51,000 బుకింగ్‌లను సంపాదించింది.

ఇది ఏమి అందిస్తుంది?

Hyundai Creta Interior

2024 హ్యుందాయ్ క్రెటా ఫీచర్ల పరంగా సమగ్రమైన అప్‌డేట్‌లను పొందింది. ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరియు మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే కోసం), డ్యూయల్ జోన్ AC, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అంశాలు ఉన్నాయి.

ప్రయాణీకుల భద్రత పరంగా దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అలాగే డిపార్చర్‌ అసిస్ట్ తో సహా అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) మరియు ఆటోమేటిక్ అత్యవసర బ్రేకింగ్ వంటి అంశాలు అందించబడ్డాయి.

వీటిని కూడా చూడండి: భారత్ మొబిలిటీ ఎక్స్‌పో వార్షికంగా నిర్వహించబడుతుంది–ఇది ఆటో ఎక్స్‌పోను భర్తీ చేయగలదా?

మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలు

Hyundai Creta Engine

హ్యుందాయ్ 2024 క్రెటాను మూడు ఇంజన్ ఎంపికలు మరియు నాలుగు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందిస్తోంది. వాటి లక్షణాలు క్రింది పట్టికలో వివరించబడ్డాయి:

ఇంజిన్

1.5-లీటర్ NA పెట్రోల్

1.5-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

శక్తి

115 PS

160 PS

116 PS

టార్క్

144 Nm

253 Nm

250 Nm

ట్రాన్స్మిషన్

6-MT / CVT

7-DCT

6-MT / 6-AT

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ప్రస్తుతం డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)కి పరిమితం చేయబడింది. అయినప్పటికీ, హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ పరిచయంతో దాని టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికతో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను అందించే అవకాశం ఉంది. SUV యొక్క N లైన్ వెర్షన్ గురించి మరింత సమాచారం కోసం మీరు ఇక్కడకు వెళ్లవచ్చు.

ఇంకా తనిఖీ చేయండి: ఈ వివరణాత్మక 8 చిత్రాలలో హ్యుందాయ్ క్రెటా S(O) వేరియంట్‌ని చూడండి

ధర పరిధి & ప్రత్యర్థులు

2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ. 11 లక్షల నుండి రూ. 20.15 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) వరకు ఉంది. ఇది కియా సెల్టోస్మారుతి గ్రాండ్ విటారాస్కోడా కుషాక్,  వోక్స్వాగన్ టైగూన్, హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి వాహనాలకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
మరింత చదవండి : క్రెటా ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience