హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్: మాకు నచ్చిన 5 విషయాలు
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా ఏప్రిల్ 20, 2019 12:22 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇటీవలే హ్యుందాయ్ మిడ్-లైఫ్ రిఫ్రెష్ క్రెటాను రూ.9.43 లక్షల(ఎక్స్-షోరూం, డిల్లీ) రూపాయల ప్రారంభ ధరతో ప్రారంభించింది. దక్షిణ కొరియా వాహన తయారీసంస్థ క్రెటాకు కొన్ని మార్పులు చేసి ఇంతకు ముందు ఉన్నదానికన్నా మెరుగైన ప్యాకేజీగా చేసింది మరియు క్రెటా ఫేస్లిఫ్ట్ యొక్క బుకింగ్స్ కేవలం 10 రోజుల్లో 14K మార్క్ దాటి ఇప్పటికే దాని సత్తాను చాటుకుంది.
హ్యుందాయ్ క్రెటా 2018 గురించి మాకు చాలా ఆకర్షణ కలిగించినటువంటి ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
గమనించదగిన కారుగా కొనసాగుతుంది!
హ్యుందాయి యొక్క తాజా క్యాస్కేడింగ్ గ్రిల్ క్రెటా యొక్క ముఖ భాగం నుండి కొంత లోపాలను తీసే మంచి పని చేస్తుంది. దాని పరిపూర్ణ పరిమాణం కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని యొక్క రీ డిజైన్ చేయబడిన బంపర్ కొత్త డే టైం రన్నింగ్ LED లను మరియు పెద్ద స్కిడ్ ప్లేట్ ను కలిగి ఉంది మరియు క్రెటా ఇప్పుడు ముందు కంటే మరింత విస్తృతమైనదిగా మరియు మరింత పరిపక్వత చెందినట్టుగా కనిపిస్తుంది.
ఇది చాలా మార్పులకు గురైన క్రెటా యొక్క ముందు ప్రొఫైల్ అయినప్పటికీ, ప్రక్క మరియు వెనుక ప్రొఫైళ్ళు కూడా విషయాలను మెరుగుపర్చడానికి సూక్ష్మమైన మార్పులను అందుకున్నాయి.
మరింత ప్రీమియం ప్యాకేజీ
ప్రీ-ఫేస్లిఫ్ట్ క్రెటా దాని విభాగంలో అత్యంత మంచి లక్షణాలతో లోడ్ చేయబడిన SUV లలో ఒకటి. అయితే, ఈ ఫేస్లిఫ్ట్ తో హ్యుందాయ్ దాని ఖ్యాతి ని మరింత పెంచుకుంది.
క్రెటా ఇప్పుడు పవర్-అడస్టబుల్ డ్రైవర్ సీటు, సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు స్మార్ట్ యాక్సెస్ బ్యాండ్ వంటి మరింత అద్భుతమైన లక్షణాలను చవిచూస్తుంది.
దీనిలో ఆరు ఎయిర్ బాగ్స్, 17-అంగుళాల మెషినెడ్ వీల్స్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లక్షణాలు దాని ఇప్పటికే కలిగి ఉన్న ఉన్న దీర్ఘకాల లక్షణాల జాబితాకు అధనంగా జోడించబడ్డాయి.
ధర తగ్గింది
హ్యుందాయి దాని క్రెటా యొక్క టాప్-స్పెక్ SX (O)వేరియంట్ ధరను రూ. 50,000 పెంచింది. మీరు పైన చదివిన కొత్త లక్షణాలను అదనంగా చేర్చడం ద్వారా ధర పెరిగింది. అయితే, క్రెటా ఫేస్లిఫ్ట్ యొక్క కొన్ని తక్కువ వేరియంట్స్ మరియు మిడ్ వేరియంట్స్(S, SX డీజిల్ మరియు మరిన్ని) ధరలు తగ్గించబడ్డాయి. హుందాయ్ మల్టిపుల్ ఆప్ష్నల్ వేరియంట్స్ లైనప్ తగ్గించడం ద్వారా, క్రెటా యొక్క వేరియంట్ లైనప్ కూడా కత్తించబడింది.
పూర్తిగా లోడ్ చేయబడిన పెట్రోల్
హ్యుండాయ్ పూర్తిగా లోడ్ చేయబడిన SX (O) వేరియంట్ ని మొదటిసారిగా ఫెలిలిఫ్ట్ లో క్రేటా యొక్క పెట్రోల్-ఆధారిత వెర్షన్ తో అందిస్తోంది. రూ. 13.59 లక్షల ధర వద్ద, ఇది క్రెటా యొక్క పెట్రోల్ లైనప్ లో అత్యంత ఖరీదైనది. ఇది క్రమంగా పెరుగుతున్న పెట్రోల్-ఆధారిత కార్లు మరియు SUV ల మార్కెట్ లో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం. అంతేకాక, ఇప్పుడు క్రెటా పెట్రోల్ కోసం చూస్తున్న కొనుగోలుదారులు ముందు వలే లక్షణాలపై రాజీపడవలసిన అవసరం లేదు.
కొత్త శక్తివంతమైన రంగులు
హ్యుందాయ్ క్రీటా ఫేస్లిఫ్ట్ తో మెరీనా బ్లూ మరియు ప్యాషన్ ఆరెంజ్ అను రెండు యూత్‌ఫుల్ రంగుల ఎంపికలను జోడించింది. ఇవి మొదట ఈ సంవత్సరం ప్రారంభించబడిన ఎలైట్ i20 ఫేస్లిఫ్ట్ తో పరిచయం చేయబడ్డాయి. ఈ రెండు రంగులలో, పాషన్ ఆరెంజ్ రంగు క్రెటా యొక్క డ్యుయల్ టోన్ కలర్ స్కీమ్ తో కలిగి ఉంటుంది, ఇది రెండవ-చివరి SX వేరియంట్ తో లభిస్తుంది.