హోండా బీఆర్-వీ ఫోటో గ్యాలరీ - జపాన్ నుండి ప్రత్యేకం
హోండా బిఆర్-వి కోసం raunak ద్వారా అక్టోబర్ 27, 2015 06:04 pm సవరించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మేము హోండా ఇండియా యొక్క తదుపరి రాబోయే పెద్ద సమర్పణ బిఆర్-వి ని టోక్యో, జపాన్ లో నడిపాము. ఈ జపనీస్ వాహన తయారీసంస్థ రాబోయే నెలల్లో బీఅర్-వి తో పెరుగుతున్న కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో చేరబోతుంది. దీనిలో ఆశక్తికరమైన అంశం ఏమిటంటే బీఅర్-వి దాని పోటీదారుల వలే కాకుండా, ఏడు సీట్ల సౌకర్యంతో అందించబడుతున్నది. హ్యుందాయి ఇటీవలే దాని పోటీదారి అయిన క్రెటా ని దేశంలో ప్రారంభించింది. ఈ కొరియన్ తయారీసంస్థ అందించిన వాహనం నెలవారీ కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో దాదాపు 7K + యూనిట్లు అమ్మకాలు చేస్తూ అద్భుతంగా రాణిస్తుంది. ఆ వాహనం ప్రారంభించబడిన సమయానికి రెనాల్ట్ డస్టర్ కూడా యాంత్రిక నవీకరణలతో పాటు ఒక ఫేస్‌లిఫ్ట్ ని పొందింది. డస్టర్ మరియు నిస్సన్ టెరానో చూసేందుకు ఒకే విధంగా ఉన్నట్టు వూహిస్తున్నాము. ఇది ఏడు-సీట్లను కలిగియుండి మహీంద్రా స్కార్పియో ( ఈ సంవత్సరం ప్రారంభించబడిన రెండవ తరం వాహనం) మరియు నవీకరించబడిన 2015 టాటా సఫారి తో పోటీ పడవచ్చు.
హోండా బిఆర్-వ్ రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో దాని మొదటి ప్రపంచ ప్రదర్శన చేయబోతున్నది మరియు త్వరలో ప్రారంభం కాబోతుందని భావిస్తున్నారు. దీని ఇంజిన్ ఎంపికలు నిర్దారించబడినవి. ఇది 1.5 లీటర్ i-Vtec పెట్రోల్ మరియు 1.5 లీటర్ i-DTEC డీజిల్ ఇంజిన్లతో అందించబడుతుంది. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండిటిలోని 6-స్పీడ్ మ్యాన్యువల్ ని ప్రామాణికంగా కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది పెట్రోల్ తో హోండా యొక్క కొత్త సివిటి ట్రాన్స్మిషన్ ని కూడా కలిగి ఉంది. మా మొదటి డ్రైవ్ సమీక్ష త్వరలో అప్లోడ్ చేయబడుతుంది, ఈ లోగా మూడు వరుసల సీటింగ్ లక్షణాలు కలిగిన హ్యుందాయ్ క్రెటా యొక్క వివరణాత్మక చిత్రాలు పరిశీలించండి. పదండి చూద్దాము!!
బాహ్య రూపం
ఈ వాహనం బ్రయో వేదికన నడుస్తుంది కానీ కొత్త రూపంలో ఉంటుంది. హోండా వారి అంతర్జాతీయ ఎస్‌యూవీ అయిన సీఆర్-వీ మరియూ హెచ్ఆర్-వీ ల ఆధారంగా ఉంటుంది.
బీఆర్-వీ కి డ్యువల్ టోన్ ముందు ఇంకా వెనుక వైపు బంపర్లతో పాటుగా ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఉంటుంది.
పక్క వైపున ఈ వాహనం విండోలు అన్ని మొబిలియోని పోలి ఉంటుంది.
హెడ్‌ల్యాంప్స్ నాజుకుగా ఉండి వెనక్కి దువ్వినట్టుగా ఉండి అచ్చు సీఆర్-వీ/హెచ్ఆర్వీ లాగా ఉంటుంది. ఈ వాహనానికి హై బీం హ్యాలొజెన్ ల్యాంప్ తో పాటుగా ప్రొజెక్టర్ ల్యాంప్ (లో బీం) కూడా ఉంటుంది.
హోండా బీఆర్-వీ కి టెయిల్‌ల్యాంప్స్ కి ఎల్ఈడీ లు ఉంటాయి. మొబిలియో మాదిరిగానే బూట్ లిడ్ ఎత్తు దిగువన ఉండీ వెసులుబాటుగా ఉంటుంది.
బాహ్యపు అద్దాలు జాజ్/సిటీ నుండి పునికి తెచ్చుకుని వీటితో పాటుగా ఎల్ఈడీ సైడ్ రిపీటర్స్ కలిగి ఉంటుంది.
దీనికి 195/60 క్రాస్-సెక్షన్ R16 టైర్లు ఉండి వీటికి ట్విన్-ఫైవ్-స్పోక్ డైమండ్ కట్ అల్లోయ్ వీల్స్ కలిగి ఉంటాయి.
వాహనం మోనోకాక్ వేదికపై నిర్మించబడింది. స్పేర్ వీల్ ట్రంక్ క్రింద ఉండి బయట నుండి అందుబాటులో ఉంటుంది. బూట్ ఎత్తు కొంచం దిగువన ఉండి సామాను పెట్టేందుకు వీలుగా ఉంటుంది.
అంతర్ఘతాలు
హోండా వారు డ్యాష్‌బోర్డ్ ని బ్రయో/అమేజ్/ మొబిలియో నుండి పునికి తెచ్చుకోలేదు. డ్యాష్‌బోర్డు సిటీ/జాజ్ నుండి సున్నితమైన మార్పులతో పొందింది. ఇది మంచి విషయమే!
హోడా వారు తెలివిగా ధరను దృష్టిలో పెట్టుకుని డ్యాష్‌బోర్డ్ ని డిజైన్ చేశారు. దీనికి ఆల్-బ్లాక్ థీం తో విభిన్న సిల్వర్ పూతలు ఉంటాయి. సిటీ/జాజ్ నుండి డ్యాష్‌బోర్డ్ వచ్చినా, స్టీరింగ్ వీల్ తో పాటుగా సెంట్రల్ టన్నెల్ వంటివి బ్రయో/అమేజ్/మొబిలియో నుండి పునికి తెచ్చుకున్నవి (క్రింద చిత్రం చూడవచ్చు).
డోర్ మ్యాట్స్ మరియూ క్యాబిన్ పరికరాలు బ్రయో/అమేజ్/మొబిలియో (క్రింద చూడండి - మూడవ వరుస సీటు కి ఉన్న బాటిల్ హోల్డర్ ఇంకా మొబైల్ హోల్డర్ అచ్చు మొబిలియోలో ఉన్నట్టుగానే ఉంటుంది) ఆధారంగా ఉంటుంది.
సిటీ నుండి పునికి తెచ్చుకున్న పెద్ద మల్టి-ఇంఫర్మేషన్ డిస్ప్లే స్క్రీన్ ఉండటం వలన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నతంగా కనపడుతుంది.
సిటీ మరియూ జాజ్ వంటి వాటితో డ్యాష్‌బోర్డ్ పంచుకుంటుంది. టచ్ ప్యానెల్ క్లైమేట్ కంట్రోల్తో పాటుగా ఈ బీఆర్-వీ లో హీటర్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ యొక్క బటన్లు ఉంటాయి. ధరను బట్టి చూస్తే దీనిలో ఉన్న మాన్యువల్ రీసర్క్యులేషన్ నాబ్ కొంచం పాత కాలం మాదిరిగా ఉంది అనిపిస్తుంది.
మొబిలియో మాదిరిగానే ఇందులో లెగ్ రూం స్థలం బాగా వెసులుబాటుగా ఉంది. సీట్లు మడిస్తే లగేజీ స్థలం పెరుగుతుంది. రెండవ వరుశ కి 60:40 నిష్పత్తిలో మడవగలిగే వీలు ఉంది మరియూ మూడవ వరుసకి ఈ నిష్పత్తి 50:50 గా ఉంది.
మూడు వరుసలలో స్థలం నిండిపోయినా గానీ ఈ వాహనం సాఫీగా సాగిపోతుంది.